సామ్ చేతిలో ఉన్న సినిమాల్లో ఖుషి ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా,శివ నిర్వాణ దర్మకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమా అల్రెడీ కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ సమంతకి హెల్త్ సమస్య ఉండటంతో.. ఇటీవల యశోద సినిమా రిలీజ్ సమయంలో తనకి మాయోసైటిస్ వ్యాధి వచ్చిందని, చికిత్స తీసుకుంటున్నాను అని చెప్పింది సమంత. కొన్ని రోజులు చెన్నైలోని ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంది. గత కొన్ని రోజులుగా సామ్ బయటకి వస్తుంది. ఇటీవల శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత, ప్రస్తుతం షూటింగ్స్ కి వెళ్తుంది. తాజాగా ఓ నెటిజన్ సమంతని ఖుషి సినిమా ఏమైంది అని అడగడంతో ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ సమంత.. విజయ దేవరకొండ అభిమానులకు సారీ. ఖుషి సినిమా త్వరలోనే మొదలవుతుంది అని చెప్పింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారగా, సినిమా మొదలవుతున్నందుకు సమంత అభిమానులు, విజయ్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.