Yashasvi Jaiswal:భారత్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి డొమినికా వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ప్లేయింగ్ ఎలెవన్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ గతంలోనే వెల్లడించాడు. యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ తో ఇండియా టీంలోకి ఆరంగేట్రం చేస్తాడని రోహిత్ చెప్పాడు. దేశవాళీ మ్యాచ్‌ల్లో యశస్వికి మంచి రికార్డు ఉంది. శుభమాన్ గిల్ బ్యాటింగ్ స్థానం గురించి రోహిత్ కొన్ని విషయాలు మాట్లాడాడు. శుభ్‌మన్ గిల్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్ బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది. దీంతో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ల స్థానం ఖరారైంది. వీరిద్దరూ ఆల్‌రౌండర్ ఆటగాళ్లు జట్టు కోసం చాలా సందర్భాలలో అద్భుత ప్రదర్శన చేశారు.
దేశవాళీ మ్యాచ్‌ల్లో యశస్వి అద్భుత ప్రదర్శన చేసిన రికార్డ్ ఉంది. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 26 ఇన్నింగ్స్‌ల్లో 1845 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో అతని అత్యుత్తమ స్కోరు 265 పరుగులు. యశస్వి 9 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు సాధించాడు. అతను 32 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 1511 పరుగులు చేశాడు. అతను 5 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున యశస్వి అద్భుత ప్రదర్శన చేశాడు. 57 టీ20 మ్యాచ్‌లు ఆడి 1578 పరుగులు చేశాడు. చాలా కాలం తర్వాత, భారత్, వెస్టిండీస్‌లోని డొమినికాలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడబోతున్నాయి. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పూర్తిగా సిద్ధమైంది. టెస్టుకు ముందు భారత్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ బాగా రాణించారు. యశస్వి నుంచి టీమ్ ఇండియా మరోసారి మంచి ప్రదర్శనను ఆశిస్తోంది.