కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే విజయం సాధించాడు. శశిథరూర్(shashi tharoor) పై భారీ ఆధిక్యంతో ఖర్గే విజయం సాధించారు. కాగా.. విజయం సాధించిన ఖర్గేపై అందరూ అభినందనలు తెలుపుతున్నారు. శశిథరూర్ సైతం ట్విట్టర్ లో ఖర్గేని అభినందించారు. కాగా.. ఖర్గే విజయంపై తాజాగా రాహుల్ గాంధీ(rahul gandhi) స్పందించారు.
భారత్ జోడో పాదయాత్రను పురస్కరించుకుని ఏపీలో ఉన్న పార్టీ నేత రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ కొత్త అధ్యక్షునిగా మల్లిఖార్జున్ ఖర్గే గెలుస్తారని ముందే చెప్పారు. ఎన్నికల ఫలితాలు విడుదల కాకమేందే ఆయన ఖర్గే గెలుస్తారని చెప్పడం గమనార్హం. నూతన అధ్యక్షుని పాత్ర ఎలా ఉంటుందో తాను చెప్పలేనని, అయితే తన పాత్ర ఏమిటో ఆయన (ఖర్గే) నిర్ణయిస్తారని చెప్పారు. ఈ విషయం గురించి మీరే ఖర్గేని, సోనియా గాంధీని అడగాలన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల గురించి ప్రతివారూ అడుగుతారని, పార్టీ పారదర్శకంగా దీన్ని నిర్వహించినట్టు నిరూపించుకుందని అన్నారు. బీజేపీ,ఇతర ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్ష ఎన్నికల పట్ల ఎవరికీ ఆసక్తి ఎందుకు ఉండదని ప్రశ్నించారు.