యూఎస్ లోని చికాగోలో హైదరాబాద్ కు చెందిన సాయి చరణ్ కొప్పాల ఇటీవల జరిగిన గన్ ఫైరింగ్ లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ట్రీట్ మెంట్ జరుగుతోంది. సాయి కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉంటారు. అక్కడికి వెళ్లడానికి, అక్కడ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ కు భారీగా ఖర్చు అవుతుందని అతడి తల్లిదండ్రులు వాపోతున్నారు. యూఎస్ లో ఆసుపత్రిలో చికిత్స కోసం ఇప్పటికే లక్షలు ఖర్చు చేశారు. ఇంకా రూ.18 లక్షలు ట్రీట్ మెంట్ కు అవుతాయని డాక్టర్లు చెప్పారు. దీంతో సాయం కోసం వాళ్లు ఎదురు చూస్తున్నారు. మిలాప్ ఫండ్ రైజింగ్ వెబ్ సైట్ లో సాయం కోసం వాళ్లు అభ్యర్థిస్తున్నారు. సాయి చరణ్ తల్లి లక్ష్మి తన కొడుకును బతికించాలని కోరుతున్నారు. అందరూ తలో చేయి వేసి సాయిని బతికించాలని ఆమె వేడుకుంటున్నారు. మధ్య తరగతి కుటుంబం కావడం వల్ల ట్రీట్ మెంట్ కోసం అయ్యే లక్షల రూపాయలు లేకపోవడంతో అమెరికాకు వెళ్లలేక దిక్కుతోచని పరిస్థితుల్లో సాయి తల్లిదండ్రులు ఉన్నారు. మిలాప్ ఫండ్ రైజింగ్ వెబ్ సైట్ లో రూ.18 లక్షలు సాయం కోసం అభ్యర్థన పెట్టగా ఇప్పటి వరకు సుమారు రూ. 6 లక్షలు వచ్చాయి. ఇంకా రూ. 12 లక్షల వరకు వస్తే సాయిని బతికించుకోగలుగుతాం. దయచేసి మీకు తోచిన సాయాన్ని సాయిని బతికించడం కోసం కింది లింక్ ను క్లిక్ చేసి డొనేట్ చేయండి.