పిఠాపురం నియోజవర్గంలో కీలక నేత పెండెం దొరబాబు వైస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కూటమి నేతలతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.
పిఠాపురం ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన నేత పెండెం దొరబాబు. 2004 లో బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచినా దొరబాబు, అనంతరం 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థి వర్మ పై ఓటమి పాలయ్యారు. తిరిగి 2019 లో వైస్సార్సీపీ కండువా కప్పుకుని టీడీపీ అభ్యర్థి వర్మపై విజయం సాధించారు. గడిచిన ఎన్నికల్లో వైస్సార్సీపీ తరుపున టికెట్ ఆశించిన దొరబాబుకు నిఆశే మిగిలింది.
పవన్ కళ్యాణ్ పిఠాపురం లో పోటీ చేయాలనీ నిశ్చయించుకోవడంతో అక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అప్పటి అధికార పార్టీ దొరబాబు స్థానంలో వంగా గీత పిఠాపురం అభ్యర్థిగా నిర్ణయించింది. అప్పటి నుంచి వైసీపీ పై అసంతృప్తితో ఉన్న దొరబాబు రాజీనామా చేయాలనీ నిర్ణయించుకున్నా కీలక వైసీపీ నేతల బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు. వైసీపీ అభ్యర్థి వంగ గీత ఎన్నికల కార్యాలయం కూడా దొరబాబు ఇంటి సమీపంలోనే పెట్టడం కూడా ఆయన వర్గానికి మరింత అసంతృప్తిని మిగిల్చింది.