దేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు భావసారూప్యత గల పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్లో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో భాగంగా ఖర్గే స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై (Kishan Reddy) ప్రశంసలు కురిపించారు. చిన్నారుల ఆరోగ్యం కోసం సికింద్రాబాద్ నియోకవర్గంలో కిషన్ రెడ్డి చేపట్టిన ‘హెల్తీ బేబీ షో’ (Healthy Baby Show') అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ( PMModi) అభినందించారు. ఇది చిన్నారులకు ఎంతో మేలు చూస్తుందని అభిప్రాయపడ్డారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తనకు ఇద్దరు హాలీవుడ్ హీరోయిన్ ల పట్ల క్రష్ ఉందని చెప్పారు. రామ్ చరణ్ దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు, రికార్డులతో ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఘోర రోడ్డుప్రమాదం (Road accident) చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ట్రక్కు ఆగిఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah) బహిరంగ సభలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ రెండోరోజు మహాసభల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా(Priyanka Vadra) రాయ్‌పూర్‌కు చేరుకున్నారు. దీంతో ఆమెకు కాంగ్రెస్ (Congress) నేతలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. రాయ్ పూర్ చేరుకోగానే పూలవర్షం కురిపించారు. ఉదయం 8.30 గంటలకు ఆమె రాయ్‌పూర్ (Raipur) విమానాశ్రయానికి చేరుకున్నారు.
preethi is still critical:మెడికో ప్రీతి (preethi) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. నిమ్స్ ఆస్పత్రి వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ (health bulletein) విడుదల చేశారు. ప్రీతికి ఆధునాతన వైద్యం అందజేస్తున్నామని.. ఆమెను బ్రతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రీతికి (preethi) ఎక్మో, వెంటిలేటర్‌పై చికిత్స ఇస్తున్నామనివివరించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్శిటీలో విద్యార్ధి సంఘాల మధ్య వివాదం తలెత్తి ఘర్షణలకు దారి తీసింది. మొన్న మధ్య బీసీసీ (BBC) డాక్యుమెంటరీ ప్రదర్శనపై గొడవ జరిగింది. ఇప్పుడు మరోసారి గొడవలు మొదలయ్యాయి. గచ్చిబౌలిలోని హెచ్ సీ యు వార్తల్లో నిలిచింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), వామపక్ష విద్యార్థి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) విద్యార్థుల మధ్య ఘ...
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ఇలాంటి సమయంలో భారత్ అమలు చేసిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
వివాహ ఆహ్వానపత్రికలో మందు తాగి ఉంటే పెళ్లికి రావద్దు అని ప్రింట్ చేయించారు. దీంతో పెళ్లి పత్రిక నెట్టింట వైరలవుతుంది.మద్యం (wine) కారణంగా కాపురాలు కూలిపోవడమే కాదు..అతిధుల మధ్య గొడవలతో వివాహాలు ఆగిపోయిన ఘటనలు చాలా చూశాం. తాజాగా గుజరాత్ రాజకోట్ లోని హడల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురి పెళ్లి కోసం వినూత్నంగా ఆలోచించాడు.
సీఎం సీఆర్ (CM KCR) టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిందే పెద్ద కుట్ర అని బీఎస్పీ రాష్ట్ర ఛీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RSP) ఆరోపించారు. శనివారం అలంపూర్ చౌరస్తాలోని బీఎస్పీ (BSP) కార్యాలయంలో ఆయన మీడియ సమావేశంలో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సమస్యలపై బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 26న బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
రష్మీ చేసిన విధానం కూడా బాగా లేదని ఇంకొందరు చెబుతున్నారు. అక్కడ అధికారులది, ప్రభుత్వానిది తప్పు లేదు. కానీ రష్మీ ప్రభుత్వాన్ని తిట్టడం సరికాదని పేర్కొంటున్నారు. కాగా రష్మీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. గతంలో ఆమెకు ఇలాంటి సంఘటనలు చాలా ఎదురయ్యాయి.
ప్రీతి (Preeti) కేసును తప్పు దోవ పట్టిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) కుమార్ ఆరోపించారు. హన్మకొండలోని 54వ డివిజన్ లో జరిగిన స్ట్రీట్ కార్నర్ (Street corner)మీటింగ్ కు సంజయ్ పాల్గోన్నారు. నిందితుడికి మద్దతుగా ప్రభుత్వం ధర్నా చేయిస్తుందని మండిపడ్డారు. ప్రీతి తల్లి తండ్రులకు గర్బశొకం మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) విచారణలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)కి నోటీసులు ఇచ్చింది సీబీఐ (CBI).
తాను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానిని అని, ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాను (vaaltheru veeraiah film) చూశానని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) అన్నారు. యువ గళం పాదయాత్ర లో (yuva galam padayatra) భాగంగా తిరుపతి లో (tirupati) యువతతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. చిరంజీవి గారికి నేను కూడా ఓ అభిమానిని అని, ఆ...