'Pushpa 2' : పుష్పరాజ్ మళ్లీ థియేటర్లోకి ఎప్పుడొస్తాడని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. కానీ పుష్ప ఫస్ట్ పార్ట్ వచ్చిన ఏడాదికి.. పుష్ప2 షూటింగ్ మొదలు పెట్టాడు సుకుమార్. ప్రస్తుతం ఈ హిట్ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Governer : తనపై వస్తున్న విమర్శలకు గవర్నర్ తమిళిసై కౌంటర్..! : బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఇటీవల గవర్నర్ల తీరు వివాదాస్పదమవుతోంది. తెలంగాణ గవర్నర్ తమిళి సై కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. తెలంగాణాలో గవర్నర్ వ్యవస్థ అవసరంలేదని కొందరు పార్టీ లీడర్లు అన్నా కూడా ఎన్నో ఆటుపోట్లమధ్య తమిళి సై తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
భారతదేశ ఆర్థిక పరిస్థితి గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ అసత్య ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై తాను చర్చకు సిద్ధమని ఎక్కడకు రావాలో కేసీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్ రాజీనామా లెటర్ జేబులో పెట్టుకుని చర్చకు రావాలని పేర్కొన్నారు.
'Adurs' : 'అదుర్స్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్! : ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్31 ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
ఇండియాలో 2040 నాటికి 73 శాతం మంది షుగర్(మధుమేహం), 65 శాతం మంది ఊభకాయం వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) నిర్వహించిన సర్వేలో తెలిపింది.
ఇండియన్ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకోనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది ప్రేమికుల రోజున తన భార్య నటాసా స్టాంకోవిక్ తో గ్రాండ్ గా వివాహం చేసుకోవాలని భావించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నీటిలో చిరుత కన్నా వేగంగా పరుగెత్తగలడు.. చేపలు, తిమింగళాల కన్నా వేగంగా ఈదగల నైపుణ్యం అతడి సొంతం. పోటీలు ఎక్కడైనా అతి వేగంగా నీటిలో దూసుకెళ్లగలడు.. పతకాలు కొల్లగొట్టగలడు. తండ్రి అగ్ర నటుడైనా అతడి పలుకుబడిని ఏనాడు వాడుకోలేదు. కష్టపడ్డాడు.. ఎదిగాడు.. ఇప్పుడు సత్తా చాటుతున్నాడు.
హిమాలయాల (Himalayas) మంచు కొండల్లో కొలువైన అందమైన ప్రదేశం. ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా నిలిచే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో గిన్నీస్ రికార్డు బదలయ్యేలా ఓ క్రీడా సంబురానికి వేదిక కానుంది. ప్రస్తుతం చలికాలంలో మంచుగడ్డగా మారిన సరస్సులో 75 మంది స్వదేశీ, విదేశీ అథ్లెట్లు (Athletes) దూసుకెళ్లనున్నారు.
టర్కీ, సిరియాలో సంభవించిన భూకంప బాధిత మృతుల సంఖ్య 34 వేలు దాటింది. ఇంకోవైపు ఆదివారం టర్కీ దక్షిణ ప్రాంతమైన కహ్రమన్మరాస్ లో 4.7 తీవ్రతో భూకంపం వచ్చినట్లు అక్కడి మీడియా పేర్కొంది. అంతేకాకుండా భూకంపాలు వచ్చినా తట్టుకునే విధంగా నిర్మించిన భవనాలు కూడా కూలడం పట్ల 131 మంది భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశారు.
ఈ లీగ్ కు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారిలో పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద వాళ్లు సీసీఎల్ కు దూరంగా ఉంటారు. అందుకే సీసీఎల్ గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. బాలీవుడ్, కోలీవుడ్ తదితర సినీ పరిశ్రమలో పెద్ద స్టార్లు కూడా బరిలోకి దిగుతారు.
హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఐడీఎల్ చెరువు సమీపంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో ఓ ట్రావెల్ బస్సుతోపాటు రెండు వ్యాన్లు కాలిపోయాయి.
జల్సా సినిమా విడుదలైన సమయంలో టిక్కెట్ల కోసం చాలా ఇబ్బంది పడినట్లు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గుర్తు చేసుకున్నారు. తాను హీరోగా నటించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం తిరుపతిలో జరిపిన క్రమంలో ఈ మేరకు వెల్లడించారు. మరోవైపు అనేక సినిమాలు స్కూల్ గోడ దూకి చుశానని గుర్తు చేసుకున్నారు.
ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతీయువకులకు వివాహానికి ముందే వివాహా సామగ్రి (తాళిబొట్టు, పట్టువస్త్రాలు, బాసింగాలు, మేకప్ కిట్ సహా కొన్ని వస్తువులు) అందిస్తారు. నిర్ణయించిన ముహూర్తానికి బంధువులతో కలిసి వధూవరులు వస్తే చాలు. కొత్త జంటలకు కాపురానికి కావాల్సిన బీరువా, మంచం, పరుపు, దుప్పట్లు, 2 కుర్చీలు, వంట సామగ్రి, కుక్కర్, మిక్సీ తదితర సామగ్రి అందించారు.
తెలంగాణ కామారెడ్డి జిల్లాలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ ఆఫీసుకు రూ.11,41,63,672 కరెంట్ బిల్లు వచ్చింది. ఇది చూసిన అక్కడి గ్రామ సర్పంచ్, సిబ్బంది అంత బిల్లు రావడమెంటని విద్యుత్ అధికారులను ప్రశ్నించారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆ బిల్లు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఏసీడీ ఛార్జీల పేరుతో పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.