• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఇచ్చిన మాట ప్రకారం పనులు చేస్తున్నాం’

W.G. ఆచంట మండలం కొడమంచిలి బీపీ చెరువులో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం స్లాబ్ పనులు మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు ఆధ్వర్యంలో సరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ.. అధికారం ఉన్న లేకపోయినా ఇచ్చిన మాట తప్పకుండ బీపీ చెర్వులో అంబెద్కర్ స్లాబ్ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.

February 26, 2026 / 05:30 PM IST

నమ్మండి.. ఇది చెరువే..!

NRML: నిర్మల్ పట్టణంలోని కంచరోని చెరువు పూర్తిగా ఎండిపోవడంతో క్రీడా మైదానంలా కనిపిస్తోంది. కొద్దిపాటి నీరు మాత్రమే మిగిలి ఉండగా మత్స్యకారులు చేపలు పడుతున్నారు. నీటిలో గుర్రపు డెక్క పేరుకుపోయింది. చెరువులో పూడికను తొలగించి పునరుద్ధరించాలని పట్టణవాసులు నీటిపారుదల శాఖ అధికారులను కోరుతున్నారు.

February 26, 2026 / 05:30 PM IST

అనంతపురంలో టీడీపీ నేతల ప్రెస్ మీట్.. మేయర్‌పై విమర్శలు

ATP: అనంతపురానికి పట్టిన శని విడిపోతోందని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అహ్మద్, పద్మశాలి కార్పొరేషన్ పోతుల లక్ష్మీనరసింహులు అన్నారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారు ప్రెస్ మీట్ నిర్వహించారు. మేయర్ సానుభూతి రాజకీయాలకు తెర లేపారన్నారు. అవినీతి ఎక్కడుందో నిరూపించాలని సవాల్ చేశారు.

February 26, 2026 / 05:30 PM IST

ఈనెల 28న ఎంప్లాయిమెంట్ కార్డు రిజిస్ట్రేషన్ మేళా

JGL: జగిత్యాలలో ఈ నెల 28న ఎంప్లాయ్మెంట్ కార్డ్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు. జిల్లాలోని 14 – 54 సంవత్సరాల వయస్సు వారు ఈ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10:30 -మధ్యాహ్నం 1:30 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

February 26, 2026 / 05:30 PM IST

రంజాన్ కానుకలు అందిస్తాం: ఎమ్మెల్యే

MDCL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గౌతమ్‌నగర్ డివిజన్‌లోని అర్హులైన ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ముస్లిం పెద్దలు చేసిన వినతికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.

February 26, 2026 / 05:28 PM IST

‘రోడ్డు భద్రతపై అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం’

KMM: కారేపల్లిలో రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ రెండో విడత అవగాహన కార్యక్రమం జరిగింది. రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పర్యవేక్షణలో ఎస్సై గోపి వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై సూచనలు చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.

February 26, 2026 / 05:27 PM IST

గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: మంత్రి

MLG: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు. ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం గ్రామాల నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి సీతక్క హాజరై సర్పంచులకు సర్టిఫికెట్లను అందజేశారు. సర్పంచులు నిత్యం ప్రజల్లో ఉంటూ మంచి పేరు సంపాదించుకోవాలని సీతక్క సూచించారు.

February 26, 2026 / 05:27 PM IST

సోము వీర్రాజుపై దాడి జరగలేదు: మండలి ఛైర్మన్

AP: ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై దాడి జరిగిందని వచ్చిన ఆరోపణలపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజు క్లారిటీ ఇచ్చారు. సోము వీర్రాజు మంత్రి కాదని, ఆయనకు సమాధానం చెప్పే అధికారం లేదని ఛైర్మన్ స్పష్టం చేశారు. వైసీపీ సభ్యలు వెల్‌లో ఉండగా.. సోము వీర్రాజు కూడా పోడియం దగ్గరకు వచ్చారని తెలిపారు. సోము వీర్రాజుపై వైసీపీ సభ్యులు దాడికి యత్నించలేదని వెల్లడించారు.

February 26, 2026 / 05:27 PM IST

రెండవ రోజు 147 మంది విద్యార్థులు గైర్హాజరు: DIEO

WGL: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా నిర్వహించినట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. రెండో రోజు పరీక్షలో జనరల్ మొత్తం 4821 విద్యార్థులకు గాను 4705 హాజరుకాగా 116 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ మొత్తం 744 విద్యార్థులకు గాను 713 మంది హాజరు కాగా 31 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను DIEO శ్రీధర్ సుమన్ సందర్శించారు.

February 26, 2026 / 05:25 PM IST

కలసపాడులో ఆటో అదుపుతప్పి బోల్తా

KDP: బద్వేల్ నియోజకవర్గం కలసపాడు(మం) పెళ్లి మర్రి చెక్ డాం సమీపంలో గురువారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. కలసపాడు నుంచి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలవడంతో అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

February 26, 2026 / 05:25 PM IST

నిరూపయోగంగా చెత్త కేంద్రాలు.. పట్టించుకోండి సారూ..!

తూ.గో: నల్లజర్ల మండలంలో లక్షలాది రూపాయలతో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఇవి పనిచేయడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కేంద్రాలను వెంటనే వినియోగంలోకి తెచ్చి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని గ్రామస్థులు కోరుతున్నారు.

February 26, 2026 / 05:23 PM IST

జిల్లాలో ఉచిత క్యాన్సర్ వ్యాధి శిబిరం

వనపర్తి జిల్లాలో శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ కో-ఆర్డినేటర్ సీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి క్యాంపు నిర్వహించారు. శ్రీ సత్య సాయి సేవ సంస్థ జిల్లా అధ్యక్షులు నరహరి పుల్లయ్య హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క పేషెంట్‌కు దాదాపు రూ.7,000 టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు .

February 26, 2026 / 05:23 PM IST

‘ధైర్య స్పర్శ’ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎస్పీ

CTR: పాలసముద్రం జడ్పీ హైస్కూల్‌ విద్యార్థుల అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి, పాల్గొని “ధైర్య స్పర్శ” పోస్టర్‌ను ట్రైనీ ఐపీఎస్ తరుణ్ పహ్వాతో కలిసి ప్రారంభించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

February 26, 2026 / 05:22 PM IST

పన్నులు సకాలంలో చెల్లించాలి: డిప్యూటీ ఎంపీడీవో

KRNL: గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని డిప్యూటీ ఎంపీడీవో జయరాముడు అన్నారు. గురువారం పెద్దకడబూరులో పన్నుల వసూళ్లపై ఆయన అవగాహన కల్పించారు. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు సకాలంలో చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. పన్నులు సమయానికి చెల్లిస్తే గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు.

February 26, 2026 / 05:22 PM IST

జాతీయ స్థాయి శిబిరంలో తరుణ్ ప్రతిభ

NLG: కేరళలోని కుట్టిక్కానంలో జరిగిన జాతీయ సమగ్రత శిబిరం(NIC)లో NSS వాలంటీర్ కె.తరుణ్ ప్రతిభచాటారు. ఈ నెల 17 నుంచి 23 వరకు మహాత్మా గాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో తెలంగాణ ప్రతినిధిగా తరుణ్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు.

February 26, 2026 / 05:22 PM IST