• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మొగల్తూరు అదనపు ఏఎస్సై ఎవరు.?

W.G: మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల తీవ్రత, కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, దీనిని ఒక ‘హెవీ క్రైమ్’ స్టేషన్ గా పరిగణించవచ్చు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల త్వరితగతిన దర్యాప్తు కోసం ఖాళీ అయిన అదనపు ఎస్సై స్థానంలో ఉన్నత అధికారులు మరొక ఎస్సై త్వరలోనే నియమించే అవకాశం ఉంది. కాగా ఇక్కడ పని చేసిన ఎస్సై నాగలక్ష్మి ఇటీవల బదిలీ అయ్యారు.

February 26, 2026 / 08:33 AM IST

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరు మృతి

AP: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. 30వ మలుపు వద్ద అదుపుతప్పి బైక్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు తమిళనాడు అరక్కోణంకు చెందిన నటరాజన్‌గా పోలీసులు గుర్తించారు.

February 26, 2026 / 08:33 AM IST

జిల్లాలో హృదయ విదారక ఘటన

రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో తల్లి కల్పన(35) మంగళవారం రాత్రి మరణించింది. తెల్లారి బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో, తన భవిష్యత్తు కోసం మనో ధైర్యంతో కుమారుడు రవితేజ పరీక్షను రాసి అందరిని కలిచివేశాడు. తల్లి మృతదేహం ఇంట్లోనే ఉండగా పరీక్షకు వెళ్లి, అనంతరం తల్లి అంతక్రియలకు హాజరయ్యాడు.

February 26, 2026 / 08:31 AM IST

‘సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’

E.G: కొవ్వూరు మండలంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవంతో పాటు భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత లభిస్తుందని మండల అధ్యక్షుడు సుంకర సత్తిబాబు తెలిపారు.జనసేన శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

February 26, 2026 / 08:30 AM IST

ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడిపై హత్యాయత్నం

KRNL: MRPS జిల్లా అధ్యక్షుడు భాస్కర్ మాదిగపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. బుధవారం వెల్దుర్తి మండలం కలుగొట్ల నుంచి ఉయ్యాలవాడ వెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు స్కార్పియో వాహనంతో వెంటాడి ఇనుప రాడ్లతో దాడి చేయడానికి ప్రయత్నించినట్లు, ఉయ్యాలవాడలో ఉన్న ఒక దుకాణంలో వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నట్లు స్థానికులు తెలిపారు.

February 26, 2026 / 08:30 AM IST

కోడి పందాల స్తావరంపై దాడి..ఆరుగురు అరెస్ట్

ELR: కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు-సరిపల్లి గ్రామాల మధ్య హుకుంపేట చెరువు సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై బుధవారం అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఏడు మోటార్ బైక్‌లు, మూడు కోడిపుంజులు, రూ.3,750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపారు.

February 26, 2026 / 08:30 AM IST

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

TG: యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కన్నులపండువగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణమహోత్సవం జరగనుంది. అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో తిరుకళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలిరానున్నారు.

February 26, 2026 / 08:30 AM IST

కాశీబుగ్గ డీఎస్పీ బదిలీ

SKLM: పలాస కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహ బాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. డీఎస్పీను తక్షణమే విధులు నుంచి రిలీవ్‌ చేసి, మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని డీజీపీ హరీష్ కుమార్‌ గుప్తా బుధవారం ఆదేశించారు. ఈయన స్థానంలో ఇన్‌ఛార్జ్‌ డీఎస్పీగా ఎవరిని నియమిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 08:30 AM IST

జిల్లాలో RDOల బదిలీ

CTR: కుప్పం RDO శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది రెవిన్యూ డివిజన్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా కుప్పం RDO శ్రీనివాసరాజు, నగరి RDO భవాని శంకర్‌ను ట్రాన్స్‌ఫర్ చేసింది.

February 26, 2026 / 08:27 AM IST

అల్లూరు గ్రామంలో దొంగతనం

NDL: నందికొట్కూరు మండలం అల్లూరులో దొంగతనం జరిగినట్లు ఎస్సై మణికంఠ తెలిపారు. గ్రామానికి చెందిన మద్దిలేటి సోమవారం ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్లారు. మంగళవారం రాత్రి తిరిగి వచ్చేసరికి బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు 10 తులాల వెండి, అర తులం బంగారం,15 వేల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 26, 2026 / 08:26 AM IST

‘వందశాతం నవ్వుకుంటారు.. నాదీ గ్యారంటీ’

శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటించిన ‘విష్ణు విన్యాసం’ రేపు విడుదల కానుంది. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 100% వినోదాన్ని పంచుతుందని, ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవచ్చని శ్రీవిష్ణు ధీమా వ్యక్తం చేశాడు. ఫస్టాఫ్ యువతకు, సెకండాఫ్ కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని చిత్రబృందం తెలిపింది. ఈ మూవీలో విష్ణు విన్యాసాలు బాగుంటాయని నిర్మాత తెలిపారు.

February 26, 2026 / 08:26 AM IST

కాజీపేటలో కల్తీ ఐస్‌క్రీమ్‌ స్వాధీనం

HNK: కాజీపేట పట్టణ కేంద్రంలోని విష్ణుపురి కాలనీలో బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కల్తీ ఐస్‌క్రీమ్‌తో పాటు గడువు తీరిన 12 రకాల రూ. 60,400 విలువ గల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ACP మధుసూదన్ తెలిపారు.

February 26, 2026 / 08:25 AM IST

రామయ్య ముత్యాల తలంబ్రాల కోసం భారీ విరాళం

BDK: శ్రీరామ నవమి సందర్భంగా జరిగే కళ్యాణ తలంబ్రాల కోసం భక్తులు రూ.4 లక్షల విరాళాన్ని అందించారు. హైదరాబాద్ వాస్తవ్యులు ముప్పాల భవాని ప్రసాద్, యుగంధర్ రూ.4 లక్షలను విరాళంగా భద్రాచలం దేవస్థాన ప్రాంగణంలో అందజేశారు. ఈ విరాళాన్ని భక్తిశ్రద్ధలతో భద్రాచలం దేవస్థానం ఈవో దామోదర్‌కి అందజేశారు. అనంతరం రామయ్యను దర్శించుకున్నారు.

February 26, 2026 / 08:23 AM IST

రేషన్ అక్రమాలపై విజిలెన్స్ నిఘా

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాల శాఖ నిఘా పెంచింది. నెలకు రెండుసార్లు గోదాములు, దుకాణాల్లో తనిఖీలు చేయనున్నారు. బియ్యం దళారులకు విక్రయించే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు డీలర్‌ షిప్‌ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

February 26, 2026 / 08:23 AM IST

టీడీపీలో చేరిన వైసీపీ నేత రామకోటచారికి

NTR: తిరువూరుకు చెందిన వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి రామడుగు రామకోటచారి బుధవారం టీడీపీలో చేరారు. విజయవాడ గురునానక్ కాలనీ ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేసినేని చిన్ని రామకోటచారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ శివనాథ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీలో సుమచిత గుర్తింపు ఉంటుందన్నారు.

February 26, 2026 / 08:22 AM IST