NZB: న్యాయవ్యవస్థపై తాము పెట్టుకున్న నమ్మకం నిలబడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. శుక్రవారం కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ముందు నుంచి చెప్తున్న విధంగానే రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావడం జరిగిందన్నారు. ఈ కేసు పెట్టిన నుంచి తనకు అండగా నిలిచిన వారందరిని తాను ఎప్పటికీ మర్చిపోనన్నారు.
NLG: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా చిట్యాల పీఎంశ్రీ జి.ప.ఉ. పాఠశాలలో రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను హెచ్ఎం బోడ సుశీల శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలో శనివారం నిర్వహించే సైన్స్ దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తమ మేధాశక్తిని ఉపయోగించి ఆవిష్కరణలను ప్రదర్శించాలని చెప్పారు.
MNCL: కళలపై చిన్నారులకు ఆసక్తిని పెంచాలని జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ సంగీత సూచించారు. శుక్రవారం తిమ్మాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-2లో నిర్వహించిన ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చిన్నారులకు చదువుతో పాటు కళలపై ఆసక్తి పెంచితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగేష్, హెచ్ఎం రాజు ఉన్నారు.
MDCL: కీసర MEOగా పాటి వెంకటరామ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా సేవలందిస్తున్న ఆయనను డీఎస్ఈ (DSE), హైదరాబాద్ ఆర్జేడీ(RJD) ఉత్తర్వుల మేరకు ఈ పదవిలో నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జీహెచ్ఎంలు రవీందర్, రాములు, రామ్ రెడ్డి, మైత్రేయి, పుష్పకళ శుభాకాంక్షలు తెలిపారు.
NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎల్ఎల్‌బీ ఐదో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 28 మంది విద్యార్థులకు 27 మంది హాజరుకాగా, ఒక్కరు గైర్హాజరైనట్లు వెల్లడించారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని తెలిపారు.
KDP: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనే నిర్మించబడ్డాయని CM చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పడం హాస్యాస్పదమని, అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యాఖ్యలు ‘బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయఅంత’ అన్నట్లున్నాయని విమర్శించారు.
BPT: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలే కీలకమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన కూటమి ప్రభుత్వం, ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 53,752ల కోట్లు కేటాయించిందని తెలిపారు. ధరల స్థిరీకరణ వంటి కీలక అంశాలపై ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు.
AP: కుట్రలకు కేంద్రం, పాపాలకు కేంద్ర బిందువు చంద్రబాబు అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ‘నిస్సిగ్గు రాజకీయాలు చంద్రబాబుకే చెల్లుతాయి. బాబు చేసిన పాపాలు పండాయి. దేవుడిని నమ్మనని 1995లోనే చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యక్తి కాబట్టే తిరుమల లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు’ అంటూ విమర్శించారు.
NRPT: మాగనూర్ మండలం వాడ్వాట్లో రూపుదిద్దుకోనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్జెస్టేషన్ నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సబ్జెస్టేషన్ అందుబాటులోకి వస్తే వోల్టేజ్ సమస్యలు తొలగి, రైతులకు, ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందన్నారు. గ్రామీణాభివృద్ధిలో విద్యుత్ కీలకమని పేర్కొన్నారు.
NZB: తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం ఎంపీ KR.సురేశ్ రెడ్డి రాజ్య సభలో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన పలు సమస్యలపై ఆయన ప్రస్తావించారు. 2025-26లో రైతు సమస్యలు, యూరియా కొరత, పంట బీమా లోపాలు, కృష్ణా-గోదావరి జలాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మైనారిటీ హక్కులు, వక్స్ బిల్లు గురించి మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
VSP: PMMSY కింద NFDB నిధులతో CIFNETలో ‘ఫ్యాబ్రికేషన్ ఆఫ్ స్క్వేర్ మెష్ కాడ్-ఎండ్’పై ఒకరోజు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శుక్రవారం ఫిషింగ్ హార్బర్ వద్ద నిర్వహించారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి. లక్ష్మణ్‌రావు, CIFNET డిప్యూటీ డైరెక్టర్ హృసికేష్ బిసోయి ప్రారంభించారు. నిపుణులు సిద్ధాంత, ప్రాయోగిక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 50 మంది మత్స్యకారులు పాల్గొన్నారు.
ప్రకాశం: కంచికచర్ల మిక్ కాలేజీలో “డ్రగ్స్ పై దండయాత్ర” కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య యువతను డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ యువత చేతిలో గంజాయి కాదని, గ్లోబల్ కంపెనీల ఆఫర్ లెటర్లు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ADB: సాయుధ సిబ్బందికి విధులలో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా ఉండాలని జిల్లా SP అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో సాయుధ సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని వాహనాల రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన షెడ్డును SP శుక్రవారం ప్రారంభించారు. AR DSP ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి తదితరులున్నారు.
NLG: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన అమానుష దాడిని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం దేవరకొండలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.2,52,464 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 236 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 35 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారు అని, 2943 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.