VKB: రోడ్డు ప్రమాదాల నివారణపై డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో అధికారులు కీలక సూచనలు చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, నిద్రలేమి, ఫోన్ వినియోగమే ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ముఖ్యంగా కంటి చూపు లోపం ఉన్నవారు రాత్రి వేళల్లో వాహనాలు నడపడం ముప్పుతో కూడుకున్నదని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
MDCL: అల్వాల్ సర్కిల్, తుర్కపల్లి డివిజన్ పరిధిలో మాజీ కార్పొరేటర్, 190, 191 రాజ్ జేతేందర్ నాథ్ శుక్రవారం ఐఏఎస్ అధికారులును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌లను కలిసి డివిజన్‌లలో వివిధ సమస్యలు, అర్బన్ బయోడైవర్సిటీ అభివృద్ధి అంశాలపై వినతిపత్రం అందజేశారు.
VKB: గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకుగాను ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ గురువారెడ్డి అన్నారు. గ్రామంలో మూడు లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని గ్రామసభలో వివరించారు.
MLG: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ కుమార్ నేడు మంత్రి సీతక్కను కలిశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కృషి చేసి, శాఖకు మరింత మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని, త్వరలో HODలతో సమావేశమై బడ్జెట్ కసరత్తు పూర్తి చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీనీ మంత్రి సీతక్క ఆదేశించారు.
RR: ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో తప్పిపోయిన చిన్నారిని పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల వివరాలు.. అంజలి, రాజు దంపతులు ఓ హాస్టల్లో ఉంటున్న బంధువులను చూడడానికి రాగా.. కుమార్తె ఆడుకుంటూ తప్పిపోయింది. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా చిన్నారిని అరగంటలోనే సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. సదరు తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు
జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. నబీ భారత జెర్సీ ధరించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డాడు. అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు గంగూలీ సూచించాడు. త్వరలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటనలో నబీని టీమిండియా జెర్సీలో చూసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.
WGL: నెక్కొండ ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకున్న వార్డ్ సభ్యులకు శుక్రవారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు ఎంపీడీవో లావణ్య, గ్రామాల అభివృద్ధిలో వార్డ్ సభ్యుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరే విధంగా పనిచేయాలని వార్డ్ నెంబర్లకు సూచించారు.
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో ఇవాళ పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగిందని అధికారులు తెలిపారు. పత్తి కనిష్ట ధర క్వింటాకు రూ. 5,511 కాగా, గరిష్ట ధర రూ. 7,469గా నమోదయింది. మొత్తం 258 మంది రైతులు 871 బస్తాల్లో 931.97 క్వింటాళ్ల పత్తిని విక్రయించడానికి తీసుకువచ్చారు.
NRML: పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. లక్ష్మణచందా మండలం వడ్యాల్ జడ్పీ హైస్కూల్‌ను ఇవాళ ఆమె ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. గణితం, ఇంగ్లీషు వంటి విషయాలపై ప్రశ్నలు అడిగి వారి ప్రతిభను పరిశీలించారు. పరీక్షల్లో ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు.
SRD: సిర్గాపూర్ రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయం సాగుపై శుక్రవారం MAO హరికృష్ణ రైతులకు అవగాహన కల్పించారు. హెర్బీ సైడ్ టాలరెంట్ HT భక్తి సాగు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు భూసార పరీక్ష కార్డు సిఫారసు ఆధారంగా రసాయన ఎరువుల వాడకంపై సూచనలు ఇచ్చారు. బియ్యం కిసాన్ లబ్ధిదారులు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో AEO భాస్కర్, రైతులు ఉన్నారు.
CTR: పెనుమూరు మండలానికి మార్చికి గాను రూ. 2.97 కోట్ల పెన్షన్ నగదు మంజూరైనట్లు ఎంపీడీవో నీలకంఠేశ్వర్ రెడ్డి తెలిపారు. మండలంలోని 14 గ్రామ సచివాలయ పరిధిలో అర్హులైన 7,060 వేల మంది లబ్ధిదారులకు పెన్షన్లను అందజేస్తామన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది శనివారం ఉదయం 7 గంటల నుంచి ప్రతి గడపకు వెళ్లి లబ్ధిదారులకు నగదును అందజేసేలా ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.
BPT: కొల్లూరు శివారులోని పొలాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై కోటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి, నిందితుల నుంచి రూ. 6,570 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని, వారిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై పేర్కొన్నారు.
అనంతపురం: లిక్కర్ అక్రమ కేసులో కడిగిన ముత్యంలా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బయట పడడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రాయదుర్గం ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జి వెంకటరమణ బాబు పేర్కొన్నారు. మీడియాకి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ కోర్టులో నేడు లిక్కర్ కేసులో ఎటువంటి సంబంధం లేదంటూ అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు.
శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఉన్న ST హాస్టల్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం పరిశీలించారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులకు సూచించారు. పరిసరాలలో చెత్తాచెదారం లేకుండా ఉంచాలని తెలియజేశారు. ఎటువంటి వ్యాధులు ప్రబలిన వెంటనే ప్రభుత్వ వైద్య శాఖ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.
BDK: మణుగూరు మండలం విప్పల సింగారం గ్రామానికి చెందిన చుక్కమ్మ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వారి నివాసానికి వెళ్లి చుక్కమ్మ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.