• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

NRPT: జిల్లాలో రానున్న వేసవికాలంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించి ప్రజల దాహార్తిని తీర్చేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీరందించేలా చూడాలని, సమస్యలున్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, మోటార్ల మరమ్మతులు సకాలంలో చేపట్టాలని ఆమె సూచించారు.

February 21, 2026 / 10:30 AM IST

‘మృత్యుంజయ్’ రిలీజ్ వాయిదా.. కొత్త తేదీ ఇదే

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘మృత్యుంజయ్’. FEB 27న రిలీజ్ కానున్న ఈ సినిమా వాయిదా పడింది. 2026 మార్చి 6న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. అయితే FEB 28న శ్రీవిష్ణు మరో సినిమా ‘విష్ణు విన్యాసం’ విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

February 21, 2026 / 10:30 AM IST

కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

WGL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం చేసే ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర స్థాయి అవార్డులకు అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు TPCC చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. మార్చి 31వ తేదీలోపు సంబంధిత జిల్లా చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 10:29 AM IST

జాతీయ వీల్ చైర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌‌గా పాలకొల్లు వాసి

W.G. వీల్ చైర్ క్రికెట్‌లో పాలకొల్లు కుర్రాడు మురపాక నళిని రాజశేఖర్ సత్తా చాటుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో ఫిబ్రవరి 23 నుంచి 28 వరకు 5వ జాతీయ వీల్ చైర్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు రాజశేఖర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఏసీఏ శుక్రవారం ప్రకటించింది.

February 21, 2026 / 10:29 AM IST

బొత్స సత్యనారాయణ బురద జల్లుతున్నారు: గురునాథం

NTR: వైసీపీ నేతలు హెరిటేజ్ సంస్థపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ విజయవాడలో టీడీపీ నేత మాదిగాని గురునాథం నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతల ఆరోపణలు దొంగే దొంగ అన్నట్లు ఉన్నాయని అన్నారు. స్వార్థ రాజకీయ లాభాల కోసం, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియా దృష్టిని ఆకర్షించేందుకు హెరిటేజ్ పై బురద జల్లుతున్నారని విమర్శించారు.

February 21, 2026 / 10:29 AM IST

శ్రీశైలంలో హుండీ ఆదాయ వివరాలు

NDL: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో 13 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. హుండీల ద్వారా రూ. 5,61,81,535 నగదు ఆదాయం లభించింది. దీంతో పాటు 124 గ్రాముల బంగారం, 5.550 కిలోల వెండి, విదేశీ కరెన్సీ కూడా అందాయి. పటిష్ట భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య ఈ లెక్కింపు ప్రక్రియను దేవస్థానం అధికారులు నిర్వహించారు.

February 21, 2026 / 10:28 AM IST

గుండెపోటుతో సర్పంచ్ మృతి

GNTR: కొల్లిపర మండలం పాత బొమ్మువారి పాలెం టీడీపీ సర్పంచ్ కొల్లి శివరామిరెడ్డి (51) శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గుంటూరు GGHకి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. శివరామిరెడ్డి ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

February 21, 2026 / 10:28 AM IST

‘తెలుగు బోధనతోనే విద్యార్థులు సమున్నతంగా ఎదుగుతారు’

NLG: తెలుగు భాషా బోధనతోనే విద్యార్థులు సమున్నతంగా ఎదుగుతారని చిట్యాల మండలం వట్టిమర్తికి చెందిన టీచర్, డాక్టరేట్ గ్రహీత సాగర్ల సత్తయ్య పేర్కొన్నారు. ఆంగ్ల భాషా ప్రభావంతో మాతృభాష కనుమరుగవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు ఉనికిని కాపాడుకునేందుకు ప్రాథమిక విద్యతో పాటు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు కూడా తెలుగులోనే బోధించాలని సూచించారు.

February 21, 2026 / 10:28 AM IST

నేడు హంస వాహనంపై లక్ష్మీ నరసింహ స్వామి

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ నాలుగో రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామివారు భక్తులకు విశేష అలంకారాల్లో దర్శనమిస్తున్నారు. ఈ రాత్రి హంస వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తిపారవశ్యంతో నిండిపోయాయి.

February 21, 2026 / 10:27 AM IST

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

TPT: తిరుపతి కొర్లగుంట మారుతీనగర్‌లో విషాదం నెలకొంది. నగరి మండలం గుండ్రాజుకుప్పానికి చెందిన దివ్య (20) మూడేళ్ల కిందట ప్రకాశ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 18 నెలల సితార అనే కుమార్తె ఉంది. తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఏమైందో ఏమో ఆమె ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని భర్త దివ్యను మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

February 21, 2026 / 10:26 AM IST

బ్రిడ్జి వద్ద నిత్యం నరకం

VKB: ఆలంపల్లి అండర్ బ్రిడ్జి వద్ద నిత్యం నీరు నిలిచి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరిరెడ్డిపల్లి, సంబంధిత తండాలకు వెళ్లే ఈ మార్గంలో గత 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం. వర్షం లేకపోయినా నీరు నిలవడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

February 21, 2026 / 10:26 AM IST

శ్రీమఠానికి భారీ విరాళం

KRNL: శ్రీమఠానికి బెంగళూరుకు చెందిన కేశవ్ గౌడు రూ.53,000, ముంబైకి చెందిన ఆదిత్య రవి అనే భక్తుడు రూ.200,000, బెంగుళూరుకు చెందిన చంద్రశేఖర్ 100 బస్తాల బియ్యం విరా ళంగా ఇచ్చినట్లు మఠం ఏఏవో మాధవవెట్టి, మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి ఇవాళ తెలిపారు. అనంతపురాణిక్, చిలకలడోణ రాఘ వేంద్రరావు, నరసింహా దేశాయ్, శ్రీపాధచార్ పాల్గొన్నారు.

February 21, 2026 / 10:25 AM IST

‘చెరువులకు తక్షణమే మరమ్మతులు చేయాలి’

VKB: మర్పల్లి మండలంలోని చెరువులు పూడిక నిండి మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతంలో చెరువులు నిండి ఆయకట్టు రైతులకు సాగునీరు సమృద్ధిగా అందేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఖల్కోడ, ఘనపూర్, రావులపల్లి గ్రామాల్లోని చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని కోరుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు.

February 21, 2026 / 10:25 AM IST

శ్రీవారి సేవలో కేంద్రమంత్రి రామ్మోహన్

కేంద్రమంత్రి రామ్మోహన్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ ఉదయం VIP విరామ సమయంలో మాజీ MP గల్లా జయదేవ్‌తో కలిసి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఇటీవల AP CM చంద్రబాబు ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రాన్ని పరిశీలించామని, తాము కూడా విమానయానశాఖలో దీన్ని ప్రారంభించేలా చూస్తామని పేర్కొన్నారు. తమకూ ఉపయోగపడేలా AIని TTD తీర్చిదిద్దిందన్నారు.

February 21, 2026 / 10:24 AM IST

మరో ఇండియన్‌కు మైక్రోసాఫ్ట్‌ పగ్గాలు

మరో దిగ్గజ సంస్థ సీఈఓగా భారత్ సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. మైక్రోసాఫ్ట్ గేమింగ్ సీఈఓగా ఆశా శర్మను నియమిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న ఫిల్ స్పెన్సర్ పదవీ విరమణ చేయడంతో ఆశాకు ఆ పదవి దక్కింది. ఆయన స్థానంలో గేమిండ్ డివిజన్‌కు సీఈఓ, వైస్ ప్రెసిండెంట్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.

February 21, 2026 / 10:22 AM IST