• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు జీరో వేస్ట్‌పై అవగాహన కార్యక్రమాలు: MPDO

VZM: స్వచ్చాంధ్ర-స్వర్థాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ గంట్యాడ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ సచివాలయాల్లోనూ జీరో వేస్ట్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్థానిక MPDO రమణమూర్తి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లో తడి, పొడి చెత్త వేరు వేరుగా అందించే విధంగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎక్కడ బడితే అక్కడ చెత్త వెయ్యవద్దన్నారు.

February 21, 2026 / 06:10 AM IST

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: డీఎస్పీ

E.G: ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా లేదా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నా వెంటనే ఫిర్యాదు చేయాలని రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్ కుమార్ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. అవినీతి నిర్మూలనకు ప్రజలు భాగస్వాములు కావాలని, నేరుగా ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

February 21, 2026 / 06:09 AM IST

‘రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి’

CTR: పుంగనూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. 2004లో మహేశ్ అనే వ్యక్తికి మంజూరైన 5 సెంట్ల భూమి పట్టాను నిబంధనలకు విరుద్ధంగా వేరొకరికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ మండిపడ్డారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని, బాధితుడికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

February 21, 2026 / 06:09 AM IST

10వ తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: కలెక్టర్

NRPT: జిల్లాలో 10వ తరగతి పరీక్షల సన్నద్ధతపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల హెచ్ఎంలతో సమావేశమై చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అన్ని మండలాల్లో విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించాలని ఆమె సూచించారు.

February 21, 2026 / 06:09 AM IST

కత్తి దాడిలో ముగ్గురికి గాయాలు

PDPL: గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఓ కుటుంబంలో జరిగిన గొడవలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రామూత్ కొబ్బరికాయలు కొట్టే కత్తితో శుక్రవారం బంధువులు సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తరలించారు.

February 21, 2026 / 06:07 AM IST

ఆరోగ్యకరమైన నగర నిర్మాణమే లక్ష్యం: సృజన

HYD: స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నగర నిర్మాణమే లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సమగ్ర శానిటేషన్ & ఎంటమాలజీ సమీక్ష నిర్వహించారు. అన్ని వార్డుల జోనల్ కమిషనర్లు, డీసీలు, ఎస్ఈడబ్ల్యూఎం ఇంజినీర్లు, ఎస్ఎఫ్ఎలతో సమావేశమై ఉదయం 6 గంటలకు హాజరు నమోదు, 100% డోర్ టూ డోర్ చెత్త సేకరణ, డ్రై డే పాటింపు, యాంటీ లార్వల్ ఆపరేషన్లపై కఠిన ఆదేశాలు జారీ చేశారు.

February 21, 2026 / 06:05 AM IST

బీసీ సింహ గర్జన సభకు హైకోర్టు అనుమతి

TG: ఆచార్య నాగార్జున యునివర్సిటీ ఎదురుగా బీసీ సింహ గర్జన పేరుతో రేపు నిర్వహించనున్న బహిరంగ సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సభ నిర్వహణకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ లక్ష్మణరావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.

February 21, 2026 / 06:05 AM IST

కంభంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

మార్కాపురం జిల్లా మండలంలోని చిన్న కంభం సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ ఏ. ఈ వెంకట నరసయ్య తెలిపారు. చిన్న కంభం, దేవనగరం, గోవిందాపురం, దర్గా మరియు గచ్చు కాలువ ఫీడర్ పరిధిలోనిఅంతరాయం ఏర్పడుతుంది. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

February 21, 2026 / 06:03 AM IST

‘ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ పనులు చేపట్టాలి’

WGL: ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ చెల్లింపులపై సమీక్షించి, సంబంధిత శాఖలు వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కలెక్టర్ డా. సత్య శారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్పర్సన్ చాహత్ బాజ్ పాయ్ కలసి జిల్లాలో పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

February 21, 2026 / 06:01 AM IST

ఘనంగా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం

AKP: మునగపాక ఆలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి, విశాలాక్షి కళ్యాణ మహోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ఆలయం ఆవరణలో అదిష్టింప చేసి ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణ మహోత్సవంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. కళ్యాణాన్ని తిలకించిన భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు.

February 21, 2026 / 05:58 AM IST

లంచం కొట్టు.. ఆ తర్వాతే పన్ను కట్టు..!

NTR: విజయవాడ కార్పొరేషన్లో పన్నులు చెల్లించాలన్నా లంచాలు సమర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఖాళీ స్థలం, ఇంటి మ్యుటేషన్ పన్నుల కోసం వచ్చే వారిని RIలు వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డాక్యుమెంట్లు సరిగ్గా లేవని వంకలు పెడుతూ, VROలను కలిసి ‘రేటు’ మాట్లాడుకోవాలని పంపిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఫైలుకు రూ. 15వేల-రూ.25వేలు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

February 21, 2026 / 05:53 AM IST

గుండ్లపల్లిలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

PLD: నకరికల్లు మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈఈ సుచరిత తెలిపారు. సబ్ స్టేషన్‌లో కొత్త బ్రేకర్ ఏర్పాటు చేసే పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. సుమారు 6 గంటల పాటు కరెంట్ కోత ఉంటుందని, గ్రామ ప్రజలు గమనించి శాఖకు సహకరించాలని ఆమె కోరారు.

February 21, 2026 / 05:48 AM IST

మహిళా ప్రాంగణంలో మంటలు.. సురక్షితంగా విద్యార్థులు

HNK: కాజీపేట పట్టణం మడికొండలోని దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ మహిళా ప్రాంగణంలో శుక్రవారం చెట్లకు అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో ప్రాంగణంలో ఉన్న సుమారు 100 మంది విద్యార్థినులు సురక్షితంగా బయటపడ్డారు.

February 21, 2026 / 05:47 AM IST

ఈ నెల 22 న శెట్టిబలిజ స్మారక చిహ్నం ఆవిష్కరణ

కోనసీమ: అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలో ఆదివారం శెట్టిబలిజ స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించనున్నట్లు సంఘ పెద్దలు మట్టపర్తి మీరా సాహెబ్ శెట్టి తెలిపారు. శుక్రవారం రాత్రి గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, తెలంగాణ సంఘం అధ్యక్షులు గుత్తుల మీరా కుమార్ పాల్గొంటారని తెలిపారు.

February 21, 2026 / 05:46 AM IST

నూతన జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్ బాధ్యతలు

NLR: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్ నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

February 21, 2026 / 05:45 AM IST