• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యార్థులకు బిగ్ అప్డేట్..!

WG: ఈనెల 23 సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్ఎస్ఐవో జి.ప్రభాకరరావు తెలిపారు. జిల్లాలో 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 37,841 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో జనరల్ విభాగం నుంచి 34,150 మంది, ఒకేషనల్ నుంచి 3,691 మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు.

February 21, 2026 / 07:04 AM IST

ఆరుగురి అరెస్ట్.. పరారీలో నలుగురు..!

NZB: గంజాయిని విక్రయిస్తున్న ముఠాలోని ఆరుగురిని బాల్కొండలో అరెస్ట్ చేసినట్లు CP సాయి చైతన్య తెలిపారు. మహమ్మద్ అమ్హద్ అలీ, మహమ్మద్ నయీమ్, చిల్వేరు మనోజ్ కుమార్, జక్కుల గోవింద్, ఆద్నాన్‌తో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశామన్నారు. మున్ని, వహీద్ సుల్తాన్, సోఫియాన్, మోసిన్ పరారీలో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

February 21, 2026 / 07:02 AM IST

కలెక్టర్‌ను కలసిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు

WGL: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మరిపల్లి చందన, గోగుల సరిత వరంగల్ జిల్లాలో సందర్శించిన సందర్భంగా నిన్న కలెక్టరేట్లో కలెక్టర్ సత్య శారదను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో వరంగల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ వసుధ, సభ్యులు సుజాత, రామలీల తదితరులు ఉన్నారు.

February 21, 2026 / 07:01 AM IST

డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె

VSP: సహకార సంఘాల ఉద్యోగులు తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె బాట పట్టారు. శుక్రవారం డీసీసీబీ బ్యాంకు నుంచి పద్మనాభం జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. వారు పదవీ విరమణ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.

February 21, 2026 / 07:00 AM IST

ఖమ్మం రెవెన్యూ శాఖలో 15 మందికి పదోన్నతులు

KMM: ఖమ్మంలో రెవెన్యూ శాఖలో పదోన్నతులు పొందిన 15 మందికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నియామక పత్రాలు శుక్రవారం అందజేశారు. జవాబుదారీతనంతో పనిచేసి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని సూచించారు. డ్రాఫ్టింగ్, కంప్యూటర్ వినియోగంపై పట్టు సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ట్రెసా ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 07:00 AM IST

తేరట్ పల్లిలో మార్కండేయస్వామి బ్రహ్మోత్సవాలు

NLG: గట్టుప్పల్ మండలం తేరట్ పల్లిలో శ్రీ మార్కండేయస్వామి 81వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

February 21, 2026 / 06:54 AM IST

కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులు..!

NLG: రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడికీ ప్రయత్నించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలన్నారు.

February 21, 2026 / 06:54 AM IST

విశ్రాంత ఏఆర్ ఎస్సై మృతి బాధాకరం: హరీష్ రావు

BDK: రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో విశ్రాంత ఏఆర్ ఎస్సై మైసయ్య మృతి చెందడంపై మాజీ మంత్రి హరీష్‌ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుమారు రూ.60 లక్షల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో, వైద్య ఖర్చులు భరించలేక ఆయన మరణించడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.

February 21, 2026 / 06:53 AM IST

పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమం

CTR: ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు శుక్రవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ ప్రాంత ప్రజల భద్రత, పలు అంశాలపై అవగాహన, పోలీసులు ప్రజల మధ్య స్నేహ పూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమము ఉద్దేశమన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

February 21, 2026 / 06:52 AM IST

రాష్ట్రంలో వచ్చేది BRS ప్రభుత్వమే: హరీష్ రావు

MHBD: రాష్ట్రంలో వచ్చేది BRS ప్రభుత్వమే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, రైతులు, మహిళల సమస్యలు వదిలిపెట్టి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కమిషన్ల కోసం కొట్లాడుతున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్, వైస్ చైర్మన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం సరికాదన్నారు.

February 21, 2026 / 06:50 AM IST

కాపీ చేశానని అంగీకరించిన AR రెహమాన్!

‘PS 2’లోని ‘వీర రాజా వీర’ సాంగ్‌కు డగర్ బ్రదర్స్‌కు క్రెడిట్ ఇవ్వడానికి AR రెహమాన్ సుప్రీంకోర్టులో అంగీకరించాడు. 5వారాల్లోపు SM, OTTలలో సవరించిన క్రెడిట్‌లు కనిపించాలని కోర్టు ఆదేశించింది. ‘శివస్తుతి’ నుంచి ఈ పాటను కాపీ చేశారని డగర్ గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో డగర్వాణీ ధ్రుపద్ సంప్రదాయం పేరుతో క్రెడిట్స్ ఇచ్చేందుకు రెహమాన్ ఓకే చెప్పాడు.

February 21, 2026 / 06:48 AM IST

ఈ నెల 25న జహీరాబాద్‌లో ఉద్యోగ మేళా

SRD: జహీరాబాద్ నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశం. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో ఖాళీగా ఉన్న 500 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరగనున్నట్లు డీఆర్డీవో జ్యోతి తెలిపారు. అభ్యర్థులు ధృవీకరణ పత్రాలతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 21, 2026 / 06:47 AM IST

రాయచోటిలో మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు పట్టివేత

అన్నమయ్య: రాయచోటిలో కర్ణాటకకు చెందిన మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు నసీర్‌ను సంయుక్త పోలీస్ ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. అతనిపై 26 కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ చర్యలో అన్నమయ్య ఎస్పీ ధీరజ్ చొరవకు ప్రశంసలు లభించాయి. స్థానికంగా తప్పుడు పేరుతో నివసిస్తున్నట్టు విచారణలో తేలినట్లు ఎస్పీ తెలిపారు.

February 21, 2026 / 06:46 AM IST

MANAGEలో ఉద్యోగాలు.. నేటితో గడువు పూర్తి

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్(MANAGE)లో 3 అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుంది. పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గల 35 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండనుండగా.. జీతంగా నెలకు రూ.57,700-1,82,400 చెల్లిస్తారు.

February 21, 2026 / 06:46 AM IST

తిరుపతిలో నేడు పవర్ కట్

TPT: తిరుపతి నగరంలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా ఉండదని ఈఈసీ గంగాధరరెడ్డి తెలపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు న్యూమారుతీ నగర్, అమరావతి నగర్, ఎల్బీ నగర్, మహిళా యూనివర్సిటీ ఏరియా, ఎయిర్పోర్ట్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 21, 2026 / 06:45 AM IST