CTR: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు జిల్లా పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను స్టేషన్లకు పిలిపించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చిన్న చిన్న కారణాలతో గొడవలు, దాడులు, బెదిరింపులకు పాల్పడకుండా శాంతియుతంగా జీవించాలన్నారు.
అన్నమయ్య: ములకలచెరువు మండలంలోని వేపూరికోట, దేవలచెరువు గ్రామాల్లో జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ వేరుశనగ పంటలను పరిశీలించారు. కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి రైతు తమ పంటను తప్పనిసరిగా ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలని, అప్పుడు మాత్రమే ప్రభుత్వ సబ్సిడీలు పొందగలరని తెలిపారు.
KMR: భిక్కనూర్ (M) బాగిర్తిపల్లి ZPHSలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడం, పథకం అమలులో నిర్లక్ష్యం వహించడంతో జిల్లా విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. శనివారం కామారెడ్డి ఆర్డీవో, భిక్కనూర్ ఎమ్మార్వో, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాఠశాలను సందర్శించి లోపాలు ఉన్నట్లు నిర్ధారించినట్లు DEO రాజు తెలిపారు. తక్షణమే ఆ ఏజెన్సీని రద్దు చేస్తునట్లు తెలిపారు.
MBNR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మహిళలందరికీ ఎస్పీ జానకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలకు గౌరవం, సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపిస్తూ దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ఆమె తెలిపారు.
KKD: వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని, భయపడే ప్రసక్తి లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన రూరల్ తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణను శనివారం ఆయన, దవులూరి దొరబాబు పరామర్శించారు. ఆధ్యాత్మిక విషయాలపై ప్రశ్నించినందుకే సత్యనారాయణను, ఆయన అనుచరులను అరెస్ట్ చేశారన్నారు.
BDK: పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిపై హత్యాయత్నం చేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. ఈనెల 4న నెహ్రూ బస్తీకి చెందిన నరేష్‌పై నాతరి శ్రీనాథ్, లోకేష్, శివ సంజయ్, ఉదయ్, రాజేశ్వరరావు రోకలిబండతో దాడి చేసినట్లు సీఐ కరుణాకర్ వెల్లడించారు. హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను కొత్తగూడెం-1 టౌన్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్థలం విషయంలో గొడవ జరిగినట్లు తెలిపారు.
MHBD: ద్రోహులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదని తొర్రూరు మండల కాంగ్రెస్ నాయకులు సోమిరెడ్డి, సాయిమల్లు, గిరిధర్‌లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కాకిరాల హరిప్రసాద్, రామ సహాయం కిషోర్ రెడ్డిలు కారణమయ్యారని, పొంతనలేని ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు.
AP: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘పోర్న్ వీడియోలు చూసే వారికి భగవద్గీత సారంశం ఎలా తెలుస్తుంది?’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. భక్తి అంటే భామ పూజ.. భజన అంటే వంట గదిలో జంట విన్యాసం అని భావించే వ్యక్తికి గీతలో మొదటి రెండు అక్షరాలే అర్థం అవుతాయంటూ విమర్శించారు.
పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని సన్మానించారు. వారి చేత కేక్ కట్ చేయించారు. సమాజంలో మహిళల ప్రాముఖ్యతను, ఆవశ్యకతను తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్ఎంవో డా. విజయ్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
NLG: రంజాన్ మాసం సందర్భంగా దేవరకొండ కోర్టులో పనిచేస్తున్న ముస్లిం సిబ్బందికి ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ కె.అనిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.స్నేహ పాల్గొని సిబ్బందితో కలిసి ఇఫ్తార్‌ను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరం, గాజుల ఆంజనేయులు, ఇతర కోర్టు సిబ్బంది ఉన్నారు.
JN: రఘునాథపల్లి మండలంలోని వెంకటాయపాలెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను గ్రంథాలయ ఛైర్మన్ రాంబాబు, నేతలు పరిశీలించారు. వెంకటాయపాలెం గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరుతామని ఛైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.
SRPT: బీజేపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, వారికి సరైన రక్షణ కరువైందని NFIW రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన ఆరోపించారు. సూర్యాపేటలో ఆమె మాట్లాడుతూ.. చట్టసభల్లో 33% రిజర్వేషన్ల అమలులో జాప్యం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. షీ టీమ్స్ సంఖ్యను పెంచాలని హైదరాబాద్‌లో జరిగే మహిళా దినోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు.
HYD: బౌద్ధనగర్‌లో శనివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు పరమత సహనానికి, సోదరభావానికి ప్రతీకలని కొనియాడారు. రంజాన్ పండుగను అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
BHNG: అన్ని రంగాల్లో మహిళలను విస్మరిస్తున్నారని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాంకేతికత పెరుగుతున్నా మహిళలను రెండో తరగతి పౌరులుగానే చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు మహిళా సాధికారత అని ప్రగల్భాలు పలికే పార్టీలు, అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నాయన్నారు.