• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

NGKL: పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. తాడూరు మండలం మేడిపూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి శనివారం ఎమ్మెల్యే హాజరై, ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 12:40 PM IST

ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్చ ఆంధ్ర- స్వర్ణాంధ్ర సాధ్యం: ఎమ్మెల్యే

PPM: ప్రజల భాగస్వామ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు గన్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతినెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ కార్యక్రమం పార్వతీపురం కేంద్ర ఆసుపత్రిలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న MLA ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.

February 21, 2026 / 12:39 PM IST

గ్రామ సభ నిర్వహించిన సర్పంచ్ సోమయ్య

BDK: అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామంలో సర్పంచ్ కోండ్రు సోమయ్య అధ్యక్షతన గ్రామసభ ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతిలో ఉన్నటువంటి పలు సమస్యలపై చర్చించారు. సర్పంచ్ సోమయ్య మాట్లాడుతూ.. గ్రామంలో మిగిలిపోయినా సీసీ రోడ్ల సమస్యలు, డ్రైనేజ్ కాలువలు సమస్య విద్యుత్ స్తంభాల సమస్య, వీధి దీపాల సమస్యలను, పారిశుద్ధ్య పనులు పరిష్కరించుకోవాలని తీర్మానించారు.

February 21, 2026 / 12:39 PM IST

‘జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు’

MLG: జిల్లాలో మాదిగలకు రాజకీయ పార్టీలు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని MRPS రాష్ట్ర నాయకుడు వావిలాల స్వామి మాదిగ మండిపడ్డారు. కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఇవాళ ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా మాదిగలను ఓటర్లుగా మాత్రమే వినియోగిస్తూ పదవులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో MRPS జిల్లా నేతలు తదితరులు ఉన్నారు.

February 21, 2026 / 12:39 PM IST

పాత మల్లం పేట పంచాయతీలో తాగునీటి కష్టాలు

అనకాపల్లి: గొలుగొండ మండలం,పాతమల్లం పేట పంచాయతీ, శివారు నిమ్మగడ్డ గ్రామంలో,గత మూడు వారాలుగా తాగునీటి సమస్యతో పోరాడుతున్న గ్రామస్తులు, మోటర్ పంపు పోయి కుళాయిలు రాకపోవడంతో, గ్రామాల్లో ప్రజలందరూ చేతి బోరుపై ఆధారపడగా, చేతి బోరు అంతాంత మాత్రమే అని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే నీటి కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.

February 21, 2026 / 12:39 PM IST

ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ, రేపే చివరి తేదీ

JGL: జగిత్యాలలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే 5 నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 22తో ముగియనుందని స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.నరేష్ తెలిపారు. బ్యాంకింగ్, RRB, SSC తదితర పోటీ పరీక్షలకు ఉచిత వసతి, స్టడీ మెటీరియల్, నోట్బుక్స్, పాకెట్ మనీతో శిక్షణ అందించనున్నారు. అభ్యర్థులు http://tsstudycircle.co.in దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 12:38 PM IST

గుండె పోటుతో ప్రధానోపాధ్యాయుడు మృతి

MHBD: MPPS ఉత్తర తండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హలవత్ శంకర్ గుండెపోటుతో మృతి చేందాడు. శనివారం ఉదయం ఆయన అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హలవత్ శంకర్ విద్యారంగానికి అంకితభావంతో సేవలందిస్తూ, పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తిగా మంచి పేరు సంపాదించారని, ఆయన మరణం తీరని లోటని స్థానికులు విచారం వ్యక్తం చేశారు.

February 21, 2026 / 12:37 PM IST

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: RIO

అన్నమయ్య: జిల్లాలో ఈ నెల 23 నుంచి నిర్వహించనున్న ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని RIO రవి తెలిపారు. శనివారం మదనపల్లెలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 50 పరీక్షా కేంద్రాల్లో 28,550 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. వీరిలో ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు 14,607 మంది,సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు 13,943 మంది ఉన్నారని చెప్పారు.

February 21, 2026 / 12:37 PM IST

బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎంపీ

KMM: ఖమ్మం నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో ఫ్రెండ్స్ క్లబ్ -2026 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు తమ ప్రయత్నాలను విజయానికి తొలిమెట్టుగా మలుచుకోవాలని సూచించారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా స్నేహసంబంధాలు మెరుగవుతాయని అన్నారు.

February 21, 2026 / 12:37 PM IST

జిల్లాలో నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని పత్తి రైతులకు ఊరట లభించింది. ఈ నెలాఖరు వరకు కొనుగోళ్లు చేపట్టనున్నట్లు సీసీఐ తెలిపింది. పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించాలంటూ ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. దీంతో గడువు పొడిగిస్తున్నట్లు సీసీఐ తెలిపింది.

February 21, 2026 / 12:36 PM IST

సెకండ్ ప్రగ్నెన్సీపై మెగా కోడలు కామెంట్స్

ప్రెగ్నెన్సీ సమయంలోనే ‘సతీ లీలావతి’ మూవీ పూర్తి చేసినట్లు నటి లావణ్య త్రిపాఠి తెలిపింది. ‘షూటింగ్‌లో వాంతులు అవుతున్నా లెక్కచేయకుండా, యాక్షన్ సీన్లప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేశాను. ప్రతి షెడ్యూల్ తర్వాత హెల్త్ చెకప్ చేయించుకున్నా. మొదటి బిడ్డతో సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తులో రెండో బిడ్డ పుట్టినప్పుడు ఈ మూవీకి పార్ట్-2 చేస్తానేమో’ అంటూ చమత్కరించింది.

February 21, 2026 / 12:36 PM IST

పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు

CTR: పలమనేరులో శనివారం ఓ పిచ్చి కుక్క పలువురిని కరిచి గాయపరిచింది. RK వీధిలో మనుషులపై దాడి చేసింది. ఏడుగురుకు పైగా గాయపడటంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పిచ్చి కుక్కను మున్సిపల్ సిబ్బంది బందించే ప్రయత్నం చేయగా వారిపై సైతం దాడి చేయడంతో కొట్టి చంపేశారు.

February 21, 2026 / 12:35 PM IST

నందిగామ ఇంచార్జ్ ఏసీపీగా లలిత కుమారి నియామకం

NTR: నందిగామ ఏసీపీ బాలగంగాధర తిలక్ కొద్ది రోజులపాటు బదిలీ అయ్యారు. గత ఏడాదిన్నరగా నందిగామ సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా పనిచేసిన ఆయనను డీజీపీ కార్యాలయంలో సీఐడీ విభాగానికి అటాచ్ చేస్తు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విజయవాడ టాస్క్ ఫోర్స్ ఏసీపీ లలిత కుమారిని నందిగామ ఇంచార్జ్ ఏసీపీగా నియమించారు. అనంతరం సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు.

February 21, 2026 / 12:35 PM IST

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

NRML: లక్ష్మణచందా మండలంలోని బోరిగాం-కంజర్ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే కిందకు దూకేయడంతో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో క్షతగాత్రునికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనాన్ని మైనర్ నడుపుతున్నట్లు సమాచారం. ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

February 21, 2026 / 12:35 PM IST

ప్యాపిలి బస్టాండ్‌లో సౌకర్యాలపై ఎమ్మెల్యే సమీక్ష

NDL: ప్యాపిలి బస్టాండ్‌లో పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై డిపో మేనేజర్‌తో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి చర్చించారు. వాహనాల నిలుపుదలకు తగిన స్థలం కేటాయించాలని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. బస్టాండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. భద్రత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.

February 21, 2026 / 12:33 PM IST