టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన రికార్డు భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉంది. ఈ నాలుగు జట్లు తలో మూడు సార్లు ఫైనల్ చేరాయి. దీంతో ఇవాళ భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే సెమీఫైనల్లో ఏ జట్టు గెలిచి ఫైనల్ చేరిన అది రికార్డు కానుంది. కాగా, భారత్ 2007(విజేత), 2014(రన్నరప్), 2024(విజేతా) ఫైనల్ చేరింది.
ఖమ్మం అభివృద్ధిలో భాగంగా ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య గురువారం పరిశీలించారు. మెరుగైన రవాణా వ్యవస్థ కోసం చేపట్టిన ఈ పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్ణీత గడువులోగా మట్టి పనులు పూర్తి చేయాలని సూచించారు.
ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజుల్లో 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
VSP: రాష్ట్రంలో పాలన గందరగోళంగా మారిందని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు అర్థం కావడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నివాసంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంపై స్పష్టత లేకుండా పాలన కొనసాగుతోందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
MBNR: మహబూబ్ నగర్‌లోని SBI, RSETI శిక్షణ కేంద్రంలో భారత ప్రభుత్వం యువజన సర్వీసు, క్రీడల ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా పరిశ్రమలశాఖ అధికారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన అవసరమన్నారు. కార్యక్రమంలో SBI, RSETI సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్, యువజన అధికారి కోటా నాయక్ పాల్గొన్నారు.
GNTR: సీఆర్డీఏ అదనపు కమిషనర్ ఏ. భార్గవతేజ గురువారం తుళ్లూరు మండలంలోని మోదులింగాయపాలెం, మల్కాపురం, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో పర్యటించారు. నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు లేఅవుట్ల ఏర్పాటు ప్రక్రియను సీఆర్డీఏ చేపట్టింది. అందుబాటులో ఉన్న భూములను గుర్తించే దిశగా పర్యటన సాగింది.
VZM: గరివిడి పోలీస్ స్టేషన్లో గురువారం ఎస్సై లోకేశ్వరరావు అధ్యక్షతన మహిళా పోలీసులకు చట్టాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ససీఐ శంకర్రావు పాల్గొని గ్రామాల్లో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో మంచి వాతావరణం కల్పించడానికి కృషి చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలపై ప్రజలను చైత్యనం చేయాలన్నారు.
ASR: అరకులోయ మండలం బొండం పంచాయతీ రాంపుడువలస గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్లను ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద మహిళల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ: పెద్దాపురంలో నూతనంగా నిర్మిస్తున్న టీడీపీ పార్టీ కార్యాలయ భవన పనులను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గురువారం పరిశీలించారు. పార్టీకి పూర్తిస్థాయిలో కార్యాలయాన్ని నిర్మించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కార్యాలయం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే చినరాజప్ప ఆదేశించారు. బడుగు శ్రీకాంత్, అడబాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
KRNL: ఓర్వకల్లు(మం)కాల్వ గ్రామంలో సయ్యద్ మహమ్మద్ షా ఖాద్రి ఉరుసు మహోత్సవాన్ని ఘనంగా ఇవాళ నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా గ్రామస్థులు వృషభ రాజుల పోటీలను ఏర్పాటు చేయగా పలు గ్రామాల నుంచి వచ్చిన వృషభాలు పోటీలో పాల్గొన్నాయి. కార్యక్రమానికి టీడీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
W.G. ఉమ్మడి ప.గో.జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అధ్యక్షతన బుధవారం పాలకొల్లు లయన్స్ క్లబ్‌లో పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యాచరణపై సమావేశం నిర్వహించబడింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కట్టుబడి పనిచేయాలన్నారు.
KDP: రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల హామీలలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, నిరుద్యోగ యువతకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదని డీవైఎఫ్ఎ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు ఎమ్.చిన్ని, వి.శివకుమార్ అన్నారు. అనంతరం మాట్లాడుతూ.. హామీ అమలు కోసం మార్చి 9న రాష్ట్ర పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
MHBD: గంగారం మండలం పెద్దఎల్లాపురంలో 234 మంది రైతులు, తమ మొక్కజొన్న ధాన్యంను పీఏసీఎస్‌లో అమ్మి రెండు నెలలు దాటిన ఇప్పటివరకు చెల్లింపు అందకపోవడంతో గురువారం రోడ్డుపై ధర్నా చేశారు. రైతుల బకాయిల మొత్తం సుమారు 5 కోట్లు అయ్యాయి. పెండింగ్ చెల్లింపులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం కోరారు,లేకపోతే అప్పుల వడ్డీలు పెరుగుతున్నాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు.
BDK: మణుగూరు ప్రభుత్వ దవాఖానాను సందర్శించే నేపథ్యంలో వెళ్లిన జిల్లా కలెక్టర్ అంకిత్‌ను సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పంచాయతీలోని పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు.
ATP: అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం జిల్లాలో 37.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.