• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రెండు నెలల బాలుడి హత్య.. బిగ్ ట్విస్ట్

TG: దుండిగల్ రెండు నెలల బాలుడి హత్యకేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి నుంచి ఏడుస్తున్నాడని కుమారుడిని చంపినట్లు ఆ తల్లి చెప్పడంతో అంతా షాకయ్యారు. చిన్నారిని చంపడంపై భర్త ప్రశ్నించడంతో అతడితో గొడవ పడింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని, బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

February 24, 2026 / 06:45 PM IST

పటాన్ చెరువు ప్రాంతంలో ఇంటింటి సర్వే

SRD: రామచంద్రపురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డిప్యూటీ ఆరోగ్య అధికారి ఏఎస్‌డీ కమల కుమారి బృందం ఆధ్వర్యంలో లేక్ వ్యూ రెసిడెన్షియల్ కాలనీలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 30 సంవత్సరాల పైబడిన వారి ఆరోగ్య వివరాలను సేకరించినట్లు కమల కుమారి తెలిపారు. ఈ సందర్భంగా గుండం మోహన్ రెడ్డిని కలిసి ఆరోగ్య సంబంధిత వివరాలు తీసుకున్నారు.

February 24, 2026 / 06:45 PM IST

అకాల వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న

KMR: తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న, జొన్న నేలకొరిగింది. దీంతో రైతులు పంట నష్టం జరిగిందని మంగళవారం వాపోయారు. పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు సర్వే చేసి తమను ఆదుకోవాలని కోరారు. నష్టపోయిన పంటకు పరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

February 24, 2026 / 06:44 PM IST

సీఎం చిత్రపటానికి పండ్ల రసాలతో అభిషేకం

RR: కోహెడ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం పట్ల పాలకవర్గం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. మరోసారి రైతుల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం నిలిచిందన్నారు.

February 24, 2026 / 06:44 PM IST

‘కుల దురహంకారం నశించాలి.. న్యాయం జరగాలి’

RR: కుమ్మెర జాతరలో అగ్రవర్ణాల దాడికి బలైపోయిన చిన్నారి మృతికి నిరసనగా BC సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో SDNR పట్టణానికి చెందిన జాతీయ BC జనసేన అధ్యక్షులు చంద్రశేఖరప్ప, నియోజకవర్గ అధ్యక్షురాలు జలజ, తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ కుల దురహంకారం నశించాలని, చిన్నారి తల్లిదండ్రులకు న్యాయం జరగాలని కోరారు.

February 24, 2026 / 06:42 PM IST

‘బాధితులకు తక్షణమే డబ్బులు చెల్లించి ఆదుకోవాలి’

HNK: ప్రైవేట్ చిట్ ఫండ్లో డబ్బులు పెట్టి ఇబ్బంది పడుతున్న బాధితులకు తక్షణమే డబ్బులు చెల్లించి వారిని ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేడు రిజిస్టార్‌కు ప్రభాకర్ రెడ్డి అందించారు. ప్రైవేట్ చిట్టీల ద్వారా సేకరించిన ప్రజాధనాన్ని కాజేసిన వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

February 24, 2026 / 06:41 PM IST

టీడీపీ నేతను పరామర్శించిన రమాకాంత్ రెడ్డి

KRNL: కమ్మలదిన్నె గ్రామానికి చెందిన టీడీపీ నేత ఈరన్న అనారోగ్యంతో బాధపడుతుండగా, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ఆయనను ఇవాళ పరామర్శించారు. ఈరన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర బీసీ సాధికారిక సభ్యుడు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ అంజినయ్య, ఆశన్న ఉన్నారు.

February 24, 2026 / 06:41 PM IST

‘అన్ని కేసులు సత్వర పరిష్కారం కావాలి’

E.G: రాజమండ్రిలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఫ్యామిలీ కోర్ట్ జడ్జి ఎం.మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇంచార్జ్ బి.పద్మ మంగళవారం మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందిస్తున్న న్యాయవాదుల నుంచి సంబంధిత కేసుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. అన్ని కేసులు సత్వర పరిష్కారం కావాలన్నారు.

February 24, 2026 / 06:40 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు

BPT: జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నేపథ్యంలో మంగళవారం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీలు, సీఐలు క్షేత్రస్థాయిలో పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేందుకు వీలుగా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ షాపులను మూసివేయించారు.

February 24, 2026 / 06:40 PM IST

‘ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి’

MHBD: తొర్రూరు మండలంలోని గోపాలగిరి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు కల్పిస్తున్న వసతులను ఇవాళ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. యాకూబ్ అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీరాంజీ చట్టాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని అన్నారు. కూలీలకు రోజు వేతనం రూ. 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

February 24, 2026 / 06:38 PM IST

PAK vs ENG: ప్లేయింగ్-11

ENG: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(c), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్PAK: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(c), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(w), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్

February 24, 2026 / 06:38 PM IST

నగర పారిశుద్ధ్యంపై మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి

KMM: ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య ఆదేశాల మేరకు నగరంలో పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా రాపర్తి నగర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్, ఇల్లందు రోడ్డు నుంచి ఆపిల్ సర్కిల్ వరకు జటాయు వాహనాల ద్వారా వ్యర్థాలను తొలగిస్తున్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్షమని కమిషనర్ తెలిపారు.

February 24, 2026 / 06:38 PM IST

‘రైతులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి’

NLG: రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సాగులో నైపుణ్యాన్ని పెంచుకోవాలని శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నూతన యాంత్రిక పరికరాలను ఉపయోగించి వ్యవసాయాన్ని సరళీకృతం చేసుకోవాలని సూచించారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం ఎలక్ట్రిక్ ట్రాక్టర్, ఇతర వ్యవసాయ పరికరాలను ప్రారంభించారు.

February 24, 2026 / 06:38 PM IST

ఆసుపత్రి పనులను పరిశీలించిన మాజీ మంత్రి

WGL: నగరంలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిని అధికారులు వద్ద నుంచి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్మాణ పనులు చేపట్టడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి ఆసుపత్రి త్వరగా ప్రారంభించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.

February 24, 2026 / 06:38 PM IST

‘సీఐ పై చర్యలు తీసుకోవాలి’

NDL: డోన్ టౌన్ సీఐ ఇంతియాజ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ సీపీఐ నాయకులు మాజీ ఎమ్మెల్సీ విల్సన్, జిల్లా కార్యదర్శి రంగం నాయుడు కలిసి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ శ్యాముల్ జవహర్‌కు వారు వినతిపత్రం అందజేశారు. సీఐ ఇంతియాజ్ మండల సీపీఐ నాయకుడు నారాయణ‌పై అన్యాయంగా దాడి చేశాడని వారు అన్నారు.

February 24, 2026 / 06:37 PM IST