MBNR: జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, IAS జిల్లా కేంద్రంలోని బీ.సీ. బాలికల వసతి గృహాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందుతున్న భోజన నాణ్యత, వసతులను స్వయంగా పరిశీలించి, వారికి పౌష్టికాహారం అందించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబినేషన్‌లో ‘వృషకర్మ’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదలకు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. రేపు మధ్యాహ్నం 12:12 గంటలకు గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా, ఇందులో నాగచైతన్య నిధి అన్వేషకుడిగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
NZB: వర్ని మండలం కూనిపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం మేకల మందపై చిరుత దాడి చేసింది. కునిపూర్ గ్రామానికి చెందిన కుక్కలి సాయిలు మేకల మందను అటవీ ప్రాంతంలోకి మేతకు తీసుకువెళ్లగా అకస్మాత్తుగా చిరుత దాడి చేసి ఒక మేకను చంపేసిందని చెప్పారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు.
E.G: నల్లజర్ల మండలం పోలవరం కుడి కాలువ గట్ల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ కృష్ణారావు హెచ్చరించారు. ఎమ్మెల్యే మద్దిపాటి ఆదేశాల మేరకు ప్రకాశరావుపాలెం, ఆవపాడు, మారెళ్లముడి, సింగరాజుపాలెం గ్రామాల్లో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
NRPT: గ్రామాల్లో శాంతిభద్రత పరిరక్షణలో సర్పంచుల పాత్ర కీలకమని మరికల్ సీఐ భగవంతు రెడ్డి అన్నారు. బుధవారం సీఐ కార్యాలయంలో మరికల్ మండల పరిధిలోని సర్పంచులకు అవగాహన సదస్సును నిర్వహించారు. సైబర్ నేరాలు, మత్తు పదార్థాల నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన, సీసీ కెమెరాలు ఏర్పాట్లపై సర్పంచులకు సూచనలు చేశారు.
సత్యసాయి: వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా జిల్లాలో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. తాగునీటి ఎద్దడి, సరఫరా అంతరాయం, పైప్‌లైన్ లీకేజీల వంటి సమస్యలను మడకశిర 9550306100, హిందూపురం 8247625245, పెనుకొండ 9885447204, పుట్టపర్తి 9490517016, కదిరి 6281434418 నంబర్లకు తెలపాలన్నారు.
TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఆశించడం ఒక రాజకీయ పార్టీగా తమ హక్కు అని, ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది బండి సంజయ్ కాదు.. ప్రజలే న్యాయ నిర్ణేతలన్నారు. ఈ దేశానికి పట్టిన గ్రహణం ఎవరో ప్రజలకు తెలుసని విమర్శించారు.
సుదీర్ఘకాలంగా అజ్ఞాత జీవితాన్ని గడిపిన గణపతి, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దాదాపు 4 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన ఆయనపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో ఆయన పేరు భద్రతా దళాల హిట్‌లిస్ట్‌లో ఉంది.
TPT: ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారం కాపాడి, రైతుల ఆదాయం పెరుగుతుందని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఇవాళ మహతి ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి కొనుగోలు–అమ్మకందారుల నెట్‌వర్కింగ్ సమావేశం నిర్వహించారు. సహజ పద్ధతిలో ఉత్పత్తి చేసిన ధాన్యాలు, పండ్లు, కూరగాయలకు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ సీఈవో రామారావు చెప్పారు.
NGKL: బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో విషాదం నెలకొంది. చింతకాయల లక్ష్మణ్(26) అనే యువకుడు డిండిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మూడేళ్లుగా అక్కడి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న లక్ష్మణ్, మంగళవారం రాత్రి బంకు నుంచి భోజనానికి కూరలు తెచ్చుకునేందుకు వెళ్లిన క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు.
KNR: నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా కోరుతూ పట్టణంలో సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. జెఫ్రీ ఎప్‌స్టీన్ వ్యవహారంలో వచ్చిన అంశాలపై స్పష్టత ఇవ్వాలన్నారు.
BPT: యద్దనపూడి మండలంలో శనగల కొనుగోలు కోసం 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు బుధవారం వ్యవసాయాధికారి (AO) కుమారి తెలిపారు. అనంతవరం, యద్దనపూడి, జాగర్లమూడి, పూనూరు కేంద్రాల్లో రైతులు తమ పంటను విక్రయించుకోవచ్చని చెప్పారు. ఈ-పంట, సీఎం యాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ మద్దతు ధర వర్తిస్తుందని, పంటలో తేమ శాతం 14 లోపు ఉండాలని ఆమె సూచించారు.
PPM: బాల్య వివాహ నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి అన్నారు. బుధవారం ఐసీడీఎస్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చట్టాన్ని అతిక్రమించి జరిపే వివాహాలపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలని అన్నారు. ప్రజల్ని మరింత చైతన్య పరచాలన్నారు. టీనేజ్ గర్భధారణపై అవగాహన కల్పించాలన్నారు.
SDPT: శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి సహిత శ్రీరామచంద్రస్వామి నూతన దేవాలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా కోమటి సత్యనారాయణ, ఛైర్మన్‌గా వెల్దండి లక్ష్మీపతి, ప్రధాన కార్యదర్శిలుగా వడ్డేపల్లి అరుణ, వడ్డేపల్లి లక్ష్మయ్య, కోశాధికారిగా పంతం కన్యాకుమారి లను ఎన్నుకున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా బూర్ల రాజయ్య, కొండా లక్ష్మణ్, కొండా రజిత హాజరయ్యారు.
KNR: కరీంనగర్ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మరో 26 రోజుల గడువు మాత్రమే ఉన్నందున అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పన్ను చెల్లింపుపై ప్రజలకు అవగాహన కల్పించి, రూ.30 కోట్ల డిమాండ్ పూర్తి చేయాలన్నారు.