MDK: నార్సింగికి చెందిన దుర్గాభవాని (22) చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మనస్తాపంతో గత నెల 27న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను మెదక్, అనంతరం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది.
RCB తమ జట్టు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. IPL-2026లో RCB తన ఐదు హోం మ్యాచ్‌లను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ CEO రాజేశ్ మీనన్ వెల్లడించారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, RCB తమ మిగిలిన రెండు హోం మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది.
AP: అవయవదానంలో రాష్ట్రం ఆరవస్థానంలో ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రంలో గడిచిన రెండు నెలల్లో జరిగిన అవయవదానాలతో 64 మందికి కొత్త జీవితం కల్పించామన్నారు. అవయవాలను దానం చేస్తున్నవారు అత్యధికంగా 50 ఏళ్ల లోపువారే ఉన్నారని పేర్కొన్నారు. 2025లో రాష్ట్రంలో అవయవదానాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు.
SRPT: కోదాడ పట్టణ పరిధిలోని మూడో వార్డు తమ్మరబండపాలెం గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త వేణుగోపాల చార్యులు అధ్యక్షతన కళ్యాణ మహోత్సవ వేలాది మంది భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు.
అన్నమయ్య: ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల జరిగిన దాడి ఘటనపై కుటుంబ సభ్యులతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. జోగి రమేష్ సోదరుడు రాము, కుమారుడు రాజీవ్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక నాయకులతో సమావేశమై పరిస్థితులపై చర్చించారు.
నెల్లూరు: రాపూరు అటవీ ప్రాంతంలో ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడింది. రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఈ విషాద ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న (25), తిరుపతి జిల్లా చిట్టమూరుకు చెందిన యాకసిరి సావిత్రి(24) ఒకే చెట్టుకు చున్నీలతో ఉరివేసుకుని ప్రాణాలు వదిలారు. పంగిలి గ్రామస్తుల సమాచారంతో రాపూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
CTR: బీసీ సంఘం పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణమూర్తి మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. బీసీల ఐక్యత కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, దీక్షలు చేపట్టారు. మత్సకారులకు ఓ ప్రత్యేకమైన గుర్తింపును కూడా నియోజకవర్గంలో ఆయన తీసుకువచ్చారు. ఆయన మృతిపై బీసీ సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వివిధ రాజకీయ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు.
GNTR: ప్రజా ఆరోగ్యం దృష్ట్యా MTMC కమిషనర్ అలీమ్ బాషా మంగళవారం నగరంలోని తాగునీటి పంప్ హౌస్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైప్‌లైన్ లీకేజీలను వెంటనే అరికట్టాలని సిబ్బందిని ఆదేశించారు. నీటి నాణ్యతను పరీక్షించేందుకు నమూనాలను గుంటూరు ల్యాబ్‌కు పంపాలని సూచించారు. తాగునీటిలో ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు వెంటనే కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
KRNL: ఆలూరు(మం) మొలగవల్లిలో జయన్నకు చెందిన 2 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. చెత్తలోని నిప్పురవ్వ గాలికి ఎగిరి వామికి అంటుకోవడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. గ్రామస్తుల సహకారంతో పక్కనున్న నాలుగు వాములు కాపాడబడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.1.30 లక్షలు విలువ చేసే పశువుల మేత కాలిపోవడంతో రైతు కన్నీరుమున్నీరయ్యారు.
MLG: తాడ్వాయి మండలం కాటాపురం గ్రామంలో మంగళవారం నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దిడ్డి మోహన్ రావు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామస్థుల సౌకర్యార్థం నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు పనులు సమయానికి పూర్తి చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. వార్డు మెంబర్లు ఉన్నారు.
కోనసీమ: రామచంద్రపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి అక్కల రిశ్వంత్ రాయ్ ఛైర్మన్‌గా మార్చి 8న ప్రమాణస్వీకారం చేయనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రామచంద్రపురంలో మంత్రి సుభాశ్ ఆధ్వర్యంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కీలక నేతలు హాజరవుతారని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
తూ.గో: జిల్లా రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి, కాకినాడ సబ్ రిజిస్ట్రార్ ఆర్.వెంకటరామారావు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. సంఘ అధ్యక్షునిగా ఎం.సత్యనారాయణ రాజు, ప్రధాన కార్యదర్శిగా ఎంవీవీ కృష్ణ, ఉపాధ్యక్షునిగా బీఎస్‌ఆర్ మూర్తి, తదితరులు ఎన్నికయ్యారు.
MNCL: జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరిఖనికి చెందిన శ్రీనివాస్ (43) TVS ఎక్సెల్ బైక్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో కిందపడి గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి జైపూర్ పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. నస్పూర్ అంబులెన్స్ EMT ప్రదీప్, పైలట్ అరవింద్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు.
WGL: గీసుకొండ మండలంలోని కొమ్మాల జాతర సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గులాబీ ప్రభ బండ్లు సిద్ధం చేసినట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు గిర్నీబావి నుండి ప్రభ బండ్ల ర్యాలీ ప్రారంభం కానుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, హాజరు కావలసిందిగా పిలుపునిచ్చారు.
ప్రకాశం: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు, పోలీస్ అధికారులు ఒంగోలు పోలీస్ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మహిళా దినోత్సవ వారోత్సవాల భాగంగా వారం రోజులపాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.