AP: భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు తెచ్చింది టీడీపీనే అని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. భోగాపురం విమానాశ్రయంపై మండలిలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమాధానం చెప్పారు. విమానాశ్రయాన్ని కూటమి ప్రభుత్వం హైజాక్ చేసిందని వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తే వైసీపీ హైజాక్ చేసిందని మంత్రి వెల్లడించారు.
SRPT: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ బుధవారం సూర్యాపేట పట్టణంలోని నారాయణ స్కూల్లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి,నిర్వహణ విధానాలను సమీక్షించారు.పరీక్ష కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ప్రశ్నాపత్రాల భద్రపరిచే విధానం,హాల్ సూపరింటెండెంట్లు,ఇన్విజిలేటర్ల విధులు వంటి అంశాలను పరిశీలించారు.
SDPT: హుస్నాబాద్ నగర శివారులో బులోరా వాహనం ఢీకొని పట్టణానికి చెందిన కేశవని సంపత్ (55) మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకొని సైకిల్ పై ఇంటికి తిరిగి వస్తుండగా అతివేగంగా వస్తున్న బులోరా వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన అతన్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కృషితో దశాబ్దాల నాటి బ్రిడ్జి కల సాకారమవుతోంది. కన్నెపల్లి నుంచి భూపసముద్రం మధ్య హగరి నదిపై రూ.30 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఏడు పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. త్వరలోనే ఈ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
SKLM: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సంఘం పిలుపుమేరకు అన్ని తాలూకా కేంద్రాలలో ఈనెల 26, 27 తేదీలలో ధర్నా నిర్వహించిన ప్రధాన కార్యదర్శి తిరుమలరావు, అధ్యక్షులు శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 12వ PRC కమిషన్‌ను నియమించాలి, 30% ఐఆర్‌ను ప్రకటించాలి, నాలుగు విడతల పెండింగ్ డిఏలను ప్రకటించాలన్నారు.
MLG: మావోయిస్టు పార్టీలో 28 ఏళ్లుగా వివిధ స్థాయిల్లో పనిచేసిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ లొంగిపోయిన విషయం తెలిసిందే. 2019లో తెలంగాణ కమిటీ సైనిక వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితుడై, గత ఏడాది నుంచి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాడు. పలు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నాడు. ‘పోరుకన్నా ఊరు మిన్న’ పిలుపు ఫలితమిచ్చిందని అధికారులు తెలిపారు.
KNR: ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి, వాటి పరిష్కారంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని మున్సిపల్ ఛైర్‌పర్సన్ సువాసిని అన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాములు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
MNCL: బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ జాడి మహేశ్వర్ ఆధ్వర్యంలో బుధవారం గ్రామసభను నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, ఆరోగ్యం, పచ్చదనం పెంపొందించడం, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం వంటి అంశాలపై చర్చించారు. గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని సర్పంచ్ కోరారు.
భారత్‌లో సైబర్ దాడులు తీవ్రమవుతున్నాయి. 2025తో పోలిస్తే ఈ ఏడాది దాడులు 2 శాతం పెరిగి, వారానికి సగటున 3,195కి చేరాయి. ముఖ్యంగా AI సాయంతో విద్యా, ప్రభుత్వ రంగాలపై దాడులు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ఎక్కువగా ప్రభావితం కాగా, 70శాతం దాడులు ప్రమాదకరమైన ట్రోజన్ మాల్వేర్‌తోనే సాగుతున్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి ఇంటర్నెట్ వాడకంలో అప్రమత్తత చాలా అవసరం.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీలిమిటేషన్ ప్రక్రియ పక్కా అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జనాభా లెక్కలు, కులగణన పూర్తి కావడంతో మున్సిపల్ సీట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం 12 స్థానాలు ఉండగా, మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం మరో 3 సీట్లు జత కలిసి 15 సీట్లు అవుతాయని అంచనా. ఇందులో 5 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి.
AKP: అధిక పాల దిగుబడికి రైతులు మేలుజాతి పశువులను ఎంపిక చేసుకోవాలని మాజీ ఎంపీ పప్పల చలపతిరావు సూచించారు. రాంబిల్లి మండలం దిమిలిలో బుధవారం పశుసంవర్ధక, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో నిర్వహించిన లేగ దూడల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా మేలు జాతి అయిన పశువులను ఉత్పత్తి చేయవచ్చునన్నారు.
JN: గ్రంథాలయాలు ప్రగతికి నిలయాలు అని నెల్లుట్ల సర్పంచ్ నర్సింగ రామకృష్ణ అన్నారు. గ్రామంలోని గ్రంథాలయాన్ని స్థానిక నేతలతో కలిసి సర్పంచ్ పరిశీలించారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ అన్నారు. ఉపసర్పంచ్ కావ్య ప్రభాకర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
HYD: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి పాటించాలని కాచిగూడ ట్రాఫిక్ సీఐ బి.వీర కౌశిక్ అన్నారు. కాచిగూడ ట్రాఫిక్ PS ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద నిర్వహించారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగవని, ముఖ్యంగా యువత ఓవర్ స్పీడ్ వల్ల రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ మృత్యువాత పడుతున్నాని అన్నారు.
WNP: శ్రీరంగాపురం రంగనాథస్వామి గుడి ఉమ్మడి జిల్లాలోని పురాతన వైష్ణవాలయాల్లో ఒకటిగా పేరొందింది. సుమారు 340 ఏళ్ల క్రితం వనపర్తి సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు హయాంలో దీనిని నిర్మించారని చరిత్ర చెబుతోంది. రంగ సముద్రం చెరువు ఒడ్డున ఉన్న ఈ గుడి అద్భుత శిల్ప కళతో భక్తులను కట్టిపడేస్తోంది. కాగా నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
VZM: జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడుగుజాడల్లో పార్టీ భావజాలన్నీ, సిద్ధాంతాలుకు అనుగుణంగా ముందుకు వెళ్దామని జనసేన నాయకులు కొర్నాన రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం స్దానిక BC కాలనీలో మాట్లాడుతూ జనసేన సభత్వ నమోదు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభిస్తున్నామని, సబ్యత్వ రెన్యవల్, లేదా నూతన సబ్యత్వానికి 9573838144 నెంబరుకు సంప్రదించాలని సూచించారు.