KRNL: CMRF పేద రోగులకు ఆర్థిక భరోసా ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్నూలులో ఎంపీ బైరెడ్డి శబరి కార్యాలయంలో శనివారం CMRF చెక్కులను బాధితులకు అందజేశారు. వివిధ మండలాలకు చెందిన ఐదుగురికి మొత్తం రూ.3 లక్షలకుపైగా సహాయం అందింది. లబ్ధిదారులు సీఎం చంద్రబాబు ఎంపీ శబరికి కృతజ్ఞతలు తెలిపారు.
AP: కాకినాడ పేలుడు ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘పలువురు మృత్యువాత పడటం మాటలకు అందని విషాదం. మృతులకు నివాళులు అర్పిస్తున్నాను, మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం’ అని వెల్లడించారు.
JGL: పెగడపల్లి మండలంలోని నామాపూర్ గ్రామంలో గల జడ్పీహెచ్ఎస్‌లో సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ ఆధారంగా పలు పరికరాలను తయారు చేసి ప్రదర్శించారు. అలాగే పలు చిత్రపటాలను గీసి, వాటి ఉపయోగంపై విద్యార్థులు వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఎంఈవో సులోచన పాల్గొని విద్యార్థులు ప్రవేశించిన పరికరాలను పరిశీలించారు.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఎంపికపై హీరోల ఆధిపత్యం గురించి నటి తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరోయిన్ల తలరాతలు హీరోల చేతుల్లోనే ఉంటాయని, స్టార్ డైరెక్టర్లు అయితే తప్ప మిగతా సమయాల్లో హీరోల మాటే చెల్లుతుందని పేర్కొంది. మగాళ్ల రాజ్యంలో హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉందని, హీరోలకు నచ్చకపోతే అవకాశం వచ్చినా తొలగిస్తారని కుండబద్ధలు కొట్టింది.
MNCL: మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పలు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి ఏరియా సింగరేణి పర్సనల్ HOD రాజేశ్వర్ రావు శనివారం తెలిపారు. మార్చ్ 5న మాదారం, 6న గోలేటిలో సాయంత్రం 4 గంటల నుండి పోటీలు జరుగుతాయన్నారు. వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న మహిళలు GM ఆఫీస్‌లో సంప్రదించాలన్నారు.
సత్యసాయి: పరిగి మండలం కోడిగేనహళ్లి గ్రామంలో పరిగి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.6,88,868 విలువైన చెక్కులను మంత్రి సవిత శనివారం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
AKP: టిడ్కో కాలనీలో తాగునీటి సమస్య లేకుండా చూస్తామని యలమంచిలి మున్సిపల్ డిప్యూటీ డీఈఈ కనకరాజు అన్నారు. పట్టణంలో రాంనగర్ సమీపంలో గల టిడ్కో కాలనీలో సీ1 బ్లాక్లో మంచినీటి సమస్యపై ఫిర్యాదు రావడంతో శనివారం పర్యటించారు. శుద్ధ వాటర్ కారణంగా పైపులు జాము అయ్యాయని, మూడు రోజుల్లో ఈ పనులు చేయించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
PPM: విద్యార్థుల భద్రతే ముఖ్యం అని ఎంవీఐ వేణుగోపాలరావు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు, ఏఎస్పీ మనీషా రెడ్డి ఉత్తర్వులతో శనివారం స్కూల్ బస్సు డ్రైవర్లకు పాలకొండలో అవగాహన కల్పించారు. విద్యార్థుల ప్రాణాలు తమ చేతుల్లో ఉన్నాయని డ్రైవర్లకు భాద్యతాయుతంగా వ్యవహరించాలని ఎంవీఐ సూచించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని ఎంవిఐ హెచ్చరించారు.
ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఎర్రగుంట గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్ శనివారం సందరర్శించారు. ఈ సందర్బంగా పాఠశాలలోని బోధన విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిని సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆసక్తి కలిగించే విధంగా బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
AP: ప్రజలు కట్టబెట్టిన భారీ మెజార్టీతో కేంద్రంలో తమ పరపతి పెరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. చీపురుపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్రం కూడా మనకు సహకరిస్తోంది. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం. విజయనగరం జిల్లా నీటి కష్టాలు తీరుస్తున్నాం. విజయనగరం పండ్ల తోటలకు కేంద్రంగా మారాలి. అన్నదాత సుఖీభవ ఇస్తామని హామీ ఇచ్చాం.. మాట నిలబెట్టుకున్నాం’ అని పేర్కొన్నారు.
TPT: తిరుపతి నగరంలోని పెద్దకాపు లేఅవుట్‌లో విషాదం నెలకొంది. కేవీపల్లె మండలం నూతన కాలువ గ్రామం దిన్నెవడ్డేపల్లికి చెందిన చెంచయ్య(40) నూతన భవన నిర్మాణ పనులకు వచ్చాడు. ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈస్ట్ ఎస్సై రామస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
WNP: మదనాపురం మండలంలోని జడ్పీ హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. విజ్ఞానం పుస్తకాలకే పరిమితం కాదని చాటుతూ కళాకారుడు విద్యార్థుల ముందే కుమ్మరి చక్రంపై మట్టి పాత్రలు తయారు చేసి చూపించారు. మట్టిని కుండలుగా మార్చే విధానం విద్యార్థులను ఆకట్టుకుంది. సైన్స్ మన దైనందిన జీవితంలో భాగమని హెచ్ఎం మహేందర్ గౌడ్ తెలిపారు.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలవడంపై నటుడు విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశాడు. మోదీ ఆశీస్సులు తీసుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని, తన తల్లిదండ్రులకు ఆయన లేఖ రాయడం విశేషమని పేర్కొన్నాడు. అమిత్ షాతో సినిమా, సంస్కృతిపై చర్చించానని.. ఆయన కానుకగా ఇచ్చిన గణేష్ విగ్రహాన్ని తమ పూజా గదిలో ఉంచామని తెలిపాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.
కోనసీమ: నిరుద్యోగ యువత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ సూచించారు. ఇవాళ మల్కిపురంలోని డిగ్రీ కళాశాల వద్ద అధికారులు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఎమ్మెల్యే సందర్శించి నిరుద్యోగులకు ఉపాధి పొందే అవకాశాలపై అవగాహన కల్పించారు.
NLG: చిట్యాల మండలం ఏపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మహేష్ సైన్స్ ప్రదర్శనలను ప్రారంభించారు. విద్యార్థులు న్యూటన్ నియమాలు, పాస్కల్ సూత్రం, గ్రీన్ ఎనర్జీ వంటి పలు వర్కింగ్ మోడల్స్‌ను ప్రదర్శించారు. సీవీ రామన్ సేవలను హెచ్ఎం మోహన్ రెడ్డి, ఫిజికల్ సైన్స్ టీచర్ గోపాల్ రెడ్డి కొనియాడారు.