SDPT: కోహెడ పోలీసుల ఆదేశాల మేరకు శ్రీరాములపల్లి గ్రామంలో గాంధీ చౌరస్తా, ప్రాథమిక పాఠశాల, అంబేద్కర్ చౌరస్తా వద్ద మొత్తం 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సర్పంచ్ పోలు శ్రీనివాస్ ప్రారంభించారు. సీసీ కెమెరాలు గ్రామ భద్రతకు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, గ్రామ ప్రతినిధులు పాల్గొన్నారు.
SKLM: జిల్లా పోలీస్ కార్యాలయంలో మీ కోసం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సోమవారం నిర్వహించారు. ఈ మేరకు భూ తగాదాలకు సంబంధించి, కుటుంబ కలహాలకు సంబంధించి, మోసాలకు పాల్పడినట్లు, ఇతర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 56 అర్జీలను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. వినతులను త్వరగా పరిష్కరించాలని పోలీసులను ఆదేశించారు.
BHPL: జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ రాహుల్ శర్మ హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ప్రతి ఇంటా ఆనందం, ఐక్యత, స్నేహభావాలను నింపాలని ఆకాంక్షించారు. హోలీ మన సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగిన పండుగని, చెడుపై మంచి విజయం సాధించిన సంకేతమని తెలిపారు. చిన్నారులు పెద్దల పర్యవేక్షణలోనే రంగులాడాలని, సహజసిద్ధ రంగులనే వినియోగించాలని అన్నారు.
SRD: గ్రామ మహిళల అభివృద్ధికి, ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఖేడ్ MLA సంజీవరెడ్డి అన్నారు. సోమవారం మనూర్ మండలం దుదిగొండ లో రూ. 10 లక్షల NREGS నిధులతో మహిళా సమైక్య భవనానికి స్థానిక సర్పంచ్ చంద్ర లీలతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు.
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మార్చి 26న అంకురార్పణ, మార్చి 27న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈవో శ్రీ వీ. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సదుపాయాలు, పార్కింగ్, రవాణా, తదితర ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని సూచించారు.
GNTR: రాష్ట్రంలోని అన్ని శాఖలు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సమర్థత పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌పై క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ 80 నుంచి 90 శాతం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
NLR: బుచ్చి పట్టణంలోని రేబాల కాలువ చెత్తాచెదారంతో నిండిపోయి దుర్గంధమైన వాసన వస్తుందని బీజేపీ నాయకులు నగర కమిషనర్ బాలకృష్ణకు తెలియజేశారు. పలు సమస్యలపై జిల్లా ఉపాధ్యక్షులు కాసా శ్రీనివాసులు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కాలువలో నీళ్లు ప్రవహించే విధంగా చెత్తను తొలగించాలన్నారు. మలిదేవి బ్రిడ్జి వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.
కృష్ణా: ప్రజల నుంచి అందే ‘మీకోసం’ అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలని JC ఎం. నవీన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 122 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖలు సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే వారి ఆరోగ్యంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ స్పందించారు. చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరో వ్యక్తికి 75 శాతం కాలిన గాయాలయ్యాయని వివరించారు.
ప్రకాశం: దర్శి వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం వంటి అంశాల గురించి వారితో చర్చించారు. గ్రామస్థాయి నుండి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
MHBD: బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దూదిమెట్ల మెహన్ మాతృమూర్తి దశదినకర్మ ఘనంగా నిర్వహించారు. ఈ దశదిన కర్మలో కాంగ్రెస్ మండల కంబాల ముసలయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాస్కర్ తదితరులు ఉన్నారు.
NRML: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీపాదరావు నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారంటూ వస్తున్న వార్తలను వన్ టౌన్ సీఐ కరుణాకర్ ఖండించారు. నిరుపేదలపై పోలీసులు దాడులు చేశారనేది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. మీడియా మిత్రులకు కూడా కనిపించని లాఠీచార్జ్ ఘటనను జరిగినట్లుగా ప్రచారం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
NDL: కొత్తపల్లి గ్రామ సమీపంలో నంద్యాల -ఆత్మకూరు రహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు పల్సర్ బైక్‌ను ఢీకొనడంతో విశ్వ నగర్‌కు చెందిన నాగరాజు(43) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మకూరు వైపు వేగంగా వెళ్తున్న బస్సు బైక్ను ఢీకొట్టిందని తాలూకా పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
WNP: జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, ప్రజల సాధారణ జీవనాన్ని నిరంతరాయంగా కొనసాగించడం, అనవసర గుమికూడింపులు నివారించడం లక్ష్యంగా మార్చి 31 వరకు 30 పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉంటుందని ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు భారీ స్థాయి సమావేశాలు నిర్వహించరాదన్నారు.