• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గచ్చిబౌలిలో చదరపు గజం రూ.1.76 లక్షలు

TG: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు మరోసారి అధిక ధరలు పలికాయి. గచ్చిబౌలి, బాలాజీ నగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 భూములను బహిరంగ వేలం నిర్వహించారు. గచ్చిబౌలిలో చదరపు గజం రూ.1.76 లక్షలు, కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో చదరపు గజం రూ. 1.64 లక్షలు పలికింది.

February 23, 2026 / 06:36 PM IST

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి

PLD: పల్నాడు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి మొత్తం 151 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. పీజీఆర్ఎస్‌లో అందిన ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు

February 23, 2026 / 06:35 PM IST

వాల్తేర్ స్కౌట్స్‌కు రాష్ట్రపతి అవార్డులు

VSP: భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ వాల్తేర్ డివిజన్‌కు చెందిన ఆరుగురు కేడెట్లు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డులు అందుకున్నారు. ఇద్దరు రోవర్స్, ఇద్దరు గైడ్స్, ఇద్దరు రేంజర్స్ ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. విశాఖలోని ‘అరణ్య’ క్యాంపింగ్ సెంటర్‌లో ప్రపంచ థింకింగ్ డే సందర్భంగా డివిజనల్ రైల్వే మేనేజర్ పురస్కారాలు ప్రదానం చేశారు.

February 23, 2026 / 06:34 PM IST

‘డెకాయిట్’ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈనెల 27న ‘రూబారూ’ అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

February 23, 2026 / 06:34 PM IST

T20 WC: విండీస్‌పై టాస్ గెలిచిన జింబాబ్వే

సంచలన ప్రదర్శనతో సూపర్-8కు చేరుకున్న జింబాబ్వే, ఇప్పుడు పటిష్టమైన వెస్టిండీస్ జట్టుతో తలపడుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గ్రూప్ దశలో రెండు జట్లు కూడా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. దీంతో, ఈ ‘అజేయ’ జట్ల మధ్య జరిగే పోరులో విజయం ఎవరిని వరిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

February 23, 2026 / 06:33 PM IST

‘బాధితుల సమస్యలు త్వరగా పరిష్కరించాలి’

MDK: బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఎస్హెచ్ఓ లకు సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల నుంచి సమస్యలు నేరుగా విని సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి పైరవులకు తావు లేకుండా సంప్రదించాలని సూచించారు.

February 23, 2026 / 06:32 PM IST

పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

NRML: రానున్న గోదావరి పుష్కరాలు సందర్భంగా జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఇవాళ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, పుష్కర ఘాట్‌ల వద్ద భక్తులకు అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.

February 23, 2026 / 06:32 PM IST

ప్రజల సమస్యలు పరిష్కరించడం తమ లక్ష్యం: ఏఎస్పీ

కృష్ణా: మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారంనిర్వహించిన మీకోసం కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వివి.నాయుడు ప్రజల వద్ద నుండి 48 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని అన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే అర్జీల రూపంలో తమ సమస్యను తెలియజేయవచ్చని సూచించారు.

February 23, 2026 / 06:30 PM IST

మిట్టపాలెం నారాయణస్వామి ఆలయ ఆదాయం రూ.57,490

ప్రకాశం: మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల ద్వారా రూ.57,490 ఆదాయం వచ్చినట్లు ఈవో గిరిరాజు నర్సింహబాబు సోమవారం తెలిపారు. టికెట్లు, లడ్డు ప్రసాదం విక్రయం, శాశ్వత అన్నదానం, మహాప్రాకార నిర్మాణ విరాళాలు, పంచామృత అభిషేకాలు, శ్రీపాద కానుకల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.

February 23, 2026 / 06:30 PM IST

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ..!

అన్నమయ్య: అర్హులైన నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సహాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ నాయకురాడు ముక్కా వరలక్ష్మి అన్నారు. సోమవారం పెనగలూరు మండలం ఓబిలి గ్రామానికి చెందిన సోమేశుల ప్రవీణ్ మరణం అనంతరం ఆయన కుటుంబ సభ్యురాలు కీర్తికి రూ.1,90,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేశారు.

February 23, 2026 / 06:30 PM IST

కలెక్టరేట్ ప్రజావాణికి 87 ఫిర్యాదులు

MBNR: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 87 ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టర్ విజయేందిర బోయి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని వెల్లడించారు.

February 23, 2026 / 06:30 PM IST

ఉదారత చాటుకున్న ఓ వ్యక్తి..!

KRNL: మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బుజ్జిగ జక్కయ్య మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అనాధలు, ఆపదలో ఉన్నవారికి, దేవాలయాల నిర్మాణాలకు ఎప్పుడూ సహకరిస్తానని నిరూపిస్తూ సోమవారం తన స్వగృహంలో గోనెగండ్ల మండలం పుట్టపాశం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఏబీఎం చర్చి నిర్మాణానికి రూ. 20,000 విరాళంగా అందించారు.

February 23, 2026 / 06:29 PM IST

ఉషా ముళ్లపూడి ఫౌండర్ మృతి

TG: హైదరాబాద్‌లో ఉషా ముళ్లపూడి ఆస్పత్రి ఫౌండర్‌ ముళ్లపూడి వెంకటరత్నం (89) కన్నుమూశారు. గత మూడు నెలలుగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. సీటీ సర్జన్‌గా ఆయన విశేష సేవలందించారు.

February 23, 2026 / 06:29 PM IST

అర్జీలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 06:28 PM IST

శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

KNR: శంకరపట్నం మండలం ఎరడపల్లిలో సర్పంచ్ కొయ్యడ రజిత, గ్రామ స్వరాజ్ సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ పుల్ల సుజాత ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ఒక్క మహిళా కుట్టు మిషన్ శిక్షణను పూర్తి స్థాయిలో నేర్చుకుని స్వంతంగా ఉపాధి పొందుతూ కుటుంబంలో సమాజంలో మంచి వ్యాపారులుగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

February 23, 2026 / 06:26 PM IST