• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జీలకర్రతో గ్యాస్ సమస్యలకు చెక్..!

జీలకర్ర జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో జీలకర్ర వేసి మరిగించి, ఆ కషాయాన్ని తాగితే కడుపులో గ్యాస్ సమస్యలు వెంటనే మాయమవుతాయి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చాలా అవసరం. వేసవిలో శరీర వేడిని తగ్గించడానికి జీలకర్ర పొడిని మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా శక్తి కూడా లభిస్తుంది.

February 27, 2026 / 04:30 PM IST

వైకుంఠధామం పునరుద్ధరణకు కాంగ్రెస్ నాయకుల సహకారం

MDCL: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 276 డివిజన్ ప్రగతి నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలేటి శ్రీనివాస్ రావు సహకారంతో ప్రగతి నగర్ వైకుంఠధామాన్ని పునరుద్ధరణ పనులు చేపట్టారు. పరిరక్షణ కమిటీ సభ్యులు, ఆలేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా వైకుంఠధామంలో బోర్ రిఫ్రెషింగ్, కొత్త మోటార్, పూల మొక్కలు పనులు చేపట్టామని తెలిపారు.

February 27, 2026 / 04:29 PM IST

‘అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి’

JGL: ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని పెగడపల్లి మండలం లింగాపూర్ సర్పంచ్ వీరేశం పేర్కొన్నారు. శుక్రవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. 3-5 సంవత్సరాలలోపు చిన్నారులను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు.

February 27, 2026 / 04:29 PM IST

‘మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించేందుకు పథకాలు అమలు’

SRCL: మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించేందుకు, ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో రూ. 8.91 లక్షలతో మంచినీటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, శుక్రవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

February 27, 2026 / 04:28 PM IST

రైతుల సమస్యలపై కవిత వినతిపత్రం

GDWL: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గద్వాల నియోజకవర్గంలో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం హైదరాబాదులోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

February 27, 2026 / 04:27 PM IST

సీఎంకు బండి సంజయ్ బహిరంగ లేఖ

KNR: రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. యాసంగి ప్రారంభమై రెండు నెలలైన సొమ్ము జమ చేయలేదని విమర్శించారు. ఫిబ్రవరి 4న మున్సిపల్ ఎన్నికల తర్వాత నిధులు వేస్తామని ప్రకటించిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. రాష్ట్రంలో 67 లక్షలకుపైగా రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

February 27, 2026 / 04:26 PM IST

‘కేరళ స్టోరీ 2’ మూవీకి లైన్ క్లియర్

వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ 2’ విడుదలకు కేరళ హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా ప్రదర్శనపై గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా కొట్టివేసింది. దీంతో చిత్ర యూనిట్‌కు పెద్ద ఊరట లభించినట్లయింది. వాదోపవాదాల అనంతరం సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోవడంతో, త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

February 27, 2026 / 04:26 PM IST

కలెక్టర్ బాలాజీని కలిసిన ఆర్డీవో

కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మచిలీపట్నం ఆర్డీవోగా సాంబశివరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ బాలాజీని, ఆర్డీవో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించాలని, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

February 27, 2026 / 04:26 PM IST

కోనసీమలో ప్రశాంతంగా ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు

కోనసీమ: జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాల్లో శుక్రవారం ఇంటర్ ప్రథమ సంవత్సర బోటనీ, హిస్టరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో మొత్తం 2,487 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 401 మంది గైర్హాజరు కావడంతో 86.11 శాతం హాజరు నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షల్లో ఎక్కడా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.

February 27, 2026 / 04:26 PM IST

‘రోడ్ సేఫ్టీ ఛాంపియన్ 2026’ అవగాహన కార్యక్రమం

NLG: దేవరకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ‘ఆర్వీఏ లైవ్ రోడ్ సేఫ్టీ ఛాంపియన్-2026’ కార్యక్రమం జరిగింది. సీఐ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అతివేగం, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కోరారు.

February 27, 2026 / 04:25 PM IST

మాపైనే బీఆర్ఎస్ దాడి చేసింది: వివేక్

TG: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగిన దాడి ఘటనపై మంత్రి వివేక్ స్పందించారు. కావాలనే బీఆర్ఎస్ నాయకులు తమపై దాడి చేశారని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల దాడిలో ఒక కానిస్టేబుల్‌కు తల పగిలి తీవ్ర గాయాలు అయ్యాయని.. అలాగే కాంగ్రెస్ కార్యకర్త కూడా గాయపడ్డారని తెలిపారు. 

February 27, 2026 / 04:24 PM IST

మనాలి అడ్వెంచర్ క్యాంప్‌కు ఎంపికైన ఉమా

బాపట్ల: ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ యు. ఉమా మనాలి అడ్వెంచర్ క్యాంప్‌కు ఎంపికయ్యారు. గుంటూరులో జరిగిన ఎంపికల్లో సుమారు 40 మంది క్యాడెట్లు పోటీ పడ్డారు. శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాల ఆధారంగా సీఎస్ఈ 3వ సంవత్సరం చదువుతున్న ఉమాను అధికారులు ఎంపిక చేశారు. ఏప్రిల్ 17 నుంచి 26 వరకు మనాలిలో ఈ క్యాంప్ జరగనుంది.

February 27, 2026 / 04:24 PM IST

నార్త్ అమెరికాలో ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘విష్ణు విన్యాసం’. ఇవాళ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నార్త్ అమెరికాలో ఈ సినిమాకు ప్రీమియర్ల ద్వారానే 75K డాలర్లకుపైగా కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు యదునాథ్ మారుతీరావు తెరకెక్కించిన ఈ మూవీకి రధన్ మ్యూజిక్ అందించాడు.

February 27, 2026 / 04:22 PM IST

జిల్లా సాధనకు రిలే నిరాహార దీక్ష..!

KRNL: పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం ఆదోని జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో 104వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలని JAC నాయకులు డిమాండ్ చేశారు. ఈ దీక్షలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులు జగన్ మాదిగ, కిరణ్ మాదిగ, భూదెబ్బ మాదిగ తదితరులు పాల్గొన్నారు. పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు.

February 27, 2026 / 04:21 PM IST

పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే పంపిణీ

E.G: మార్చి నెల ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే అందజేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అయితే, ఈసారి మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో, లబ్ధిదారుల సౌకర్యార్థం శనివారం నాడే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ శుక్రవారం వెల్లడించారు.

February 27, 2026 / 04:20 PM IST