• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వంగూరు వాసికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్

NGKL: వంగూరు మండలం డిండిచింతపల్లికి చెందిన సుగురిబాబు కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ విద్యుత్ ఆధారిత వ్యవస్థలపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. ఆయన మాట్లాడుతూ.. ప్రొఫెసర్ మల్లేశం ఆధ్వర్యంలో పీహెచ్డీ పరిశోధనలు పూర్తి చేశానని అన్నారు. అనంతరం ఈరోజు డాక్టరేట్ స్వీకరించారు.

February 28, 2026 / 04:16 PM IST

పేలుడు ఘటనపై మంత్రి నారాయణ విచారం

AP: కాకినాడలో బాణాసంచా పేలుడు ఘటనపై మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి వైద్యులను పంపించి తక్షణ వైద్యసాయం అందించాలని ఆదేశించారు.

February 28, 2026 / 04:15 PM IST

ఈడెన్‌ గార్డెన్స్‌లో పరుగుల వరద..?

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన నాకౌట్ మ్యాచ్ జరగనుంది. గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుండగా, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్ జరిగే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని సమాచారం. రెండు జట్లలోనూ విధ్వంసకర పవర్ హిట్టర్లు ఉండటంతో భారీ స్కోర్లు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.

February 28, 2026 / 04:15 PM IST

క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి శాఖకు మంచి పేరు తీసుకొచ్చారు: ఎస్పీ

మహబూబ్‌నగర్: జిల్లాలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ వెంకయ్యకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి. జానకి శాలువా కప్పి సత్కరించి అభినందించారు. 34 ఏళ్ల సేవలో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి శాఖకు మంచి పేరు తీసుకొచ్చారని ఎస్పీ కొనియాడారు.

February 28, 2026 / 04:14 PM IST

కాజీపేట ప్రాంతానికి చేసింది శూన్యం: MLA

HNK: BRS హయాంలో కాజీపేట ప్రాంతానికి చేసింది శూన్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీనియర్ శాసన సభ్యునిగా ఉన్న హరీశ్ రావు కూడా దుష్ప్రచారాలు చేయడం సబబు కాదని, కాజీపేటకు 30 పడకల దవాఖానా ఆవశ్యకత ఉన్నప్పటికీ కనీసం ప్రయత్నాలు చేయని దద్దమ్మలు మీరు అని, BRS నేతల మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు.

February 28, 2026 / 04:14 PM IST

కంభంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక అర్బన్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 04:13 PM IST

అర్హులందరికీ పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

E.G: ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లు అర్హులైన వారందరికీ అందిస్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం కోలమూరులో కొత్తగా మంజూరైన నూతన పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు పింఛన్ ఇచ్చే విధానాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు.

February 28, 2026 / 04:13 PM IST

‘కర్నూలులో CMRF చెక్కులు పంపిణి’

KRNL: CMRF పేద రోగులకు ఆర్థిక భరోసా ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్నూలులో ఎంపీ బైరెడ్డి శబరి కార్యాలయంలో శనివారం CMRF చెక్కులను బాధితులకు అందజేశారు. వివిధ మండలాలకు చెందిన ఐదుగురికి మొత్తం రూ.3 లక్షలకుపైగా సహాయం అందింది. లబ్ధిదారులు సీఎం చంద్రబాబు ఎంపీ శబరికి కృతజ్ఞతలు తెలిపారు.

February 28, 2026 / 04:11 PM IST

కాకినాడ పేలుడు ఘటనపై లోకేష్ దిగ్భ్రాంతి

AP: కాకినాడ పేలుడు ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘పలువురు మృత్యువాత పడటం మాటలకు అందని విషాదం. మృతులకు నివాళులు అర్పిస్తున్నాను, మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం’ అని వెల్లడించారు.

February 28, 2026 / 04:10 PM IST

ఘనంగా సైన్స్ దినోత్సవం

JGL: పెగడపల్లి మండలంలోని నామాపూర్ గ్రామంలో గల జడ్పీహెచ్ఎస్‌లో సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ ఆధారంగా పలు పరికరాలను తయారు చేసి ప్రదర్శించారు. అలాగే పలు చిత్రపటాలను గీసి, వాటి ఉపయోగంపై విద్యార్థులు వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఎంఈవో సులోచన పాల్గొని విద్యార్థులు ప్రవేశించిన పరికరాలను పరిశీలించారు.

February 28, 2026 / 04:07 PM IST

మగాళ్ల రాజ్యంలో హీరోయిన్ల పరిస్థితి ఇదే: నటి

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఎంపికపై హీరోల ఆధిపత్యం గురించి నటి తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరోయిన్ల తలరాతలు హీరోల చేతుల్లోనే ఉంటాయని, స్టార్ డైరెక్టర్లు అయితే తప్ప మిగతా సమయాల్లో హీరోల మాటే చెల్లుతుందని పేర్కొంది. మగాళ్ల రాజ్యంలో హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉందని, హీరోలకు నచ్చకపోతే అవకాశం వచ్చినా తొలగిస్తారని కుండబద్ధలు కొట్టింది.

February 28, 2026 / 04:07 PM IST

సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు క్రీడా పోటీలు

MNCL: మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పలు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి ఏరియా సింగరేణి పర్సనల్ HOD రాజేశ్వర్ రావు శనివారం తెలిపారు. మార్చ్ 5న మాదారం, 6న గోలేటిలో సాయంత్రం 4 గంటల నుండి పోటీలు జరుగుతాయన్నారు. వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న మహిళలు GM ఆఫీస్‌లో సంప్రదించాలన్నారు.

February 28, 2026 / 04:06 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

సత్యసాయి: పరిగి మండలం కోడిగేనహళ్లి గ్రామంలో పరిగి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.6,88,868 విలువైన చెక్కులను మంత్రి సవిత శనివారం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 04:06 PM IST

మూడు రోజుల్లో త్రాగునీటి సమస్యకు పరిష్కారం

AKP: టిడ్కో కాలనీలో తాగునీటి సమస్య లేకుండా చూస్తామని యలమంచిలి మున్సిపల్ డిప్యూటీ డీఈఈ కనకరాజు అన్నారు. పట్టణంలో రాంనగర్ సమీపంలో గల టిడ్కో కాలనీలో సీ1 బ్లాక్లో మంచినీటి సమస్యపై ఫిర్యాదు రావడంతో శనివారం పర్యటించారు. శుద్ధ వాటర్ కారణంగా పైపులు జాము అయ్యాయని, మూడు రోజుల్లో ఈ పనులు చేయించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

February 28, 2026 / 04:05 PM IST

‘స్కూల్ విద్యార్థుల ప్రయాణ భద్రతే ముఖ్యం

PPM: విద్యార్థుల భద్రతే ముఖ్యం అని ఎంవీఐ వేణుగోపాలరావు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు, ఏఎస్పీ మనీషా రెడ్డి ఉత్తర్వులతో శనివారం స్కూల్ బస్సు డ్రైవర్లకు పాలకొండలో అవగాహన కల్పించారు. విద్యార్థుల ప్రాణాలు తమ చేతుల్లో ఉన్నాయని డ్రైవర్లకు భాద్యతాయుతంగా వ్యవహరించాలని ఎంవీఐ సూచించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని ఎంవిఐ హెచ్చరించారు.

February 28, 2026 / 04:05 PM IST