• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రజల నుంచి వినతులను స్వీకరించిన కలెక్టర్

పల్నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్న ఆమె, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల విషయంలో అలసత్వం వహించరాదని అధికారులకు తెలిపారు.

February 23, 2026 / 12:55 PM IST

మైనారిటీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

BDK: క్రిస్టియన్, ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా సాగిస్తున్నదని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాత పాల్వంచ 46వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొత్వాల విమలాదేవి ఎన్నికయ్యారు. సోమవారం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కొత్వాలతో పాటు విమలాదేవిని సత్కరించారు.

February 23, 2026 / 12:54 PM IST

పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం స్థానిక 26వ డివిజన్ విక్రమ్ నగర్ ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్ పరిధిలో అన్ని భవనాలను అసెస్మెంట్ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. 100% నిర్దేశించిన ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి పన్ను, ఖాళీ స్థలం పన్నులను వసూలు చేయాలని ఆదేశించారు.

February 23, 2026 / 12:52 PM IST

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

BDK: ఆళ్లపల్లి మండలం రామానుజగూడెం గ్రామంలో బొల్ల భవాని నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయని హామీ ఇచ్చారు.

February 23, 2026 / 12:52 PM IST

పీజీఆర్ఎస్‌లో ప్రజల వినతులు స్వీకరణ

VSP: కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ప్రజల నుంచి సోమవారం వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పాల్గొన్నారు.

February 23, 2026 / 12:52 PM IST

ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం

ELR: దెందులూరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం పెదవేగి మండలం దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

February 23, 2026 / 12:52 PM IST

కర్నూలులో పుష్కలంగా యూరియా నిల్వలు

కర్నూలు జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి ఇవాళ తెలిపారు. 2025-26 రబీ సీజన్‌కు 24, 580మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అధిక ధరలకు విక్రయించినా, ఇతర ప్రాంతాలకు తరలించినా డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం 8341302863కు సంప్రదించాలనిన్నారు.

February 23, 2026 / 12:51 PM IST

అసెంబ్లీ.. బడ్జెట్ డిమాండ్లను ప్రవేశపెట్టిన మంత్రులు

AP: శాసనసభలో వివిధ శాఖల బడ్జెట్ డిమాండ్లను మంత్రులు ప్రవేశపెట్టారు. సాంఘిక సంక్షేమ శాఖకు DSBV స్వామి రూ.11,118 కోట్లు.. మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖకు సంధ్యారాణి రూ.4,764 కోట్లు.. BC సంక్షేమ శాఖకు సవిత రూ.34,350 కోట్లు.. అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి NMD ఫరూఖ్ రూ.2,956 కోట్లు.. పౌరసరఫరాలశాఖకు నాదెండ్ల రూ.3,821 కోట్ల డిమాండ్ ప్రవేశపెట్టారు.

February 23, 2026 / 12:51 PM IST

అనారోగ్యంతో కొమరోలు ఏవో మృతి

ప్రకాశం: కొమరోలు ఎంపీడీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న సయ్యద్ మస్తాన్వలి అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, సెలవుపై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు ఆయన మృతికి విచారం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.

February 23, 2026 / 12:50 PM IST

‘ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి’

BDK: అశ్వారావుపేటలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో Arrive Alive – Phase 2 కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణ రక్షణ సాధ్యమని ఎస్సై అఖిల పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

February 23, 2026 / 12:49 PM IST

కలెక్టరేట్‌కు చేరుకున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

KMR: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే బయలుదేరిన KMR ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కలెక్టరేట్ సముదాయానికి చేరుకున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు నెలకొన్న నేపథ్యంలో కలెక్టరేట్ సముదాయానికి రావాలని ఎమ్మెల్యే శనివారం సవాలు విసిరిన విషయం విధితమే. సవాలను స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు సైతం కలెక్టరేట్ కి వస్తారో లేదో ప్రశ్నార్థకంగా మారింది.

February 23, 2026 / 12:48 PM IST

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

AKP: మునగపాకలో సోమవారం సీసీ నిర్మాణ పనులకు కూటమి నాయకులు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం రూ.13 లక్షల నిధులను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మంజూరు చేశారని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతీయుల రహదారి కష్టాలు తీరుతాయని చెప్పారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

February 23, 2026 / 12:47 PM IST

రాష్ట్రస్థాయి కరాటేలో సత్తా చాటిన కోనాపూర్ విద్యార్థులు

NZB: కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ విద్యార్థులు రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మెట్పల్లిలో నిర్వహించిన ఛాంపియన్‌షిన్‌లో పాల్గొని 5 స్వర్ణ, 8 రజత,14 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. విజేతలను ప్రిన్సిపల్ ఉదయ్, సోమవారం అభినందించారు. విద్యార్థుల కృషిని కొనియాడుతూ..వారికి సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.

February 23, 2026 / 12:47 PM IST

కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు వ్యవసాయ రంగానికి మొండి చెయ్యి

KRNL: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించలేదని నాయకులు రైతు సంఘం, సీపీఐ పలు ప్రజా సంఘాల నాయకులు విరేష్, ఆంజనయ్య విమర్శించారు. ఇవాళ పెద్దకడబూరు తహశీల్దార్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లలో వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని తీవ్రంగా విమర్శించారు.

February 23, 2026 / 12:46 PM IST

‘కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు వ్యవసాయ రంగానికి మొండి చెయ్యి’

KRNL: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించలేదని నాయకులు రైతు సంఘం, సీపీఐ పలు ప్రజా సంఘాల నాయకులు విరేష్, ఆంజనయ్య విమర్శించారు. ఇవాళ పెద్దకడబూరు తహశీల్దార్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లలో వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని తీవ్రంగా విమర్శించారు.

February 23, 2026 / 12:46 PM IST