• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భయం లేకుండా ఆడతాం: హ్యారీ బ్రూక్

టీమిండియాతో సెమీఫైనల్‌పై ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘మేము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నాం. ప్రస్తుతం మంచి క్రికెట్ ఆడుతున్నాం. అయితే, ఇప్పటి వరకు మా అత్యుత్తమ ప్రదర్శన ఇంకా బయటకు రాలేదు. అది ఈరోజే వస్తుందని నేను ఆశిస్తున్నాను. మైదానంలో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ.. టీమిండియాపై పైచేయి సాధిస్తాం’ అని పేర్కొన్నాడు.

March 5, 2026 / 04:35 PM IST

చీకలచేనులో టీడీపీ కుటుంబాలు వైసీపీలో చేరిక

CTR: సదుం మండలం చీకలచేను గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కుటుంబాలు YSRCPలో చేరాయి. రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బూరగమంద క్రాస్ వద్ద జరిగిన కార్యక్రమంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడే వారికి పూర్తి అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

March 5, 2026 / 04:34 PM IST

నిరుపయోగంగా మారిన చెత్త సంపద కేంద్రాలు..!

NDL: బనగానపల్లె మండలంలోని పలు గ్రామాల్లో చెత్త సంపద కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. 2014-2019 మధ్యకాలంలో చెత్త నుంచి సంపద సృష్టించాలన్న లక్ష్యంతో రూ.100,000 వెచ్చించి కేంద్రాలు నిర్మించారు. అయితే ఇప్పటికీ అవి ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయి. మండలంలో సుమారు 50 వరకు చెత్త సంపద కేంద్రాలు ఉపయోగంలో లేవని సమాచారం.

March 5, 2026 / 04:34 PM IST

ఒడిలో బిడ్డతో విధులు నిర్వహణ

BDK: పాల్వంచ మండలం బసవతారక కాలనీలోని ఆధార్ సేవా కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న భూక్యా వెన్నెల తన విధి పట్ల అంకితభావాన్ని చాటుతున్నారు. ఏడాది వయసున్న చిన్నారిని ఒడిలో పెట్టుకుని ప్రజలకు ఆధార్ సేవలు అందిస్తున్నారు. రోజూ పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజలకు సహనంతో సేవలు అందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఆమె తల్లితనంతో పాటు విధి నిర్వాహణను నిర్వహిస్తున్నారు.

March 5, 2026 / 04:33 PM IST

17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

TPT: మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలు రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. మార్చి 19న కూడా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయబడతాయి.

March 5, 2026 / 04:33 PM IST

‘శుద్ధమైన త్రాగు నీరు చలివేంద్రాలలో అందించాలి’

VZM: రాజాం మండలం బొద్దాం గ్రామంలో పంచాయతీ తరపున గురువారం చలివేంద్రాన్ని చీపురుపల్లి డివిజన్ అభివృద్ధి అధికారి కె హేమ సుందర్ రావు ప్రారంభించారు. గ్రామాలలో ప్రజలు ఎండ వేడిమి నుండి తట్టుకోవడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, అలాగే ఆ చలివేంద్రాలలో శుద్ధమైన మంచినీరు అందించాలని సూచించారు. అనంతరం ఇండ్ల పన్నులు, ట్రేడ్ లైసెన్స్‌లు వసూలు విధానాలను పరిశీలించారు.

March 5, 2026 / 04:32 PM IST

బ్యాడ్మింటన్‌లో సత్తా చాటిన రాజోలు వైద్య సిబ్బంది

కోనసీమ: అమలాపురంలో జరిగిన జిల్లా హెల్త్ వారియర్స్ స్పోర్ట్స్ మీట్‌లో రాజోలు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సత్తా చాటారు. బ్యాడ్మింటన్‌లో ప్రతిభ చూపిన సూపరింటెండెంట్ డయానా, విప్పర్తి ప్రతాప్ కుమార్, జగదీశ్వరి, శిరీష జేసీ నిశాంతి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. విజేతలను గురువారం ఆసుపత్రి సిబ్బంది ఘనంగా సన్మానించారు. వైద్య సిబ్బంది క్రీడల్లోనూ రాణిస్తున్నారన్నారు.

March 5, 2026 / 04:32 PM IST

‘వేధింపులకు భయపడొద్దు..ఫిర్యాదు చేయండి’

SRCL: విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే గురువారం సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల భద్రత కోసం షీ టీమ్ ప్రత్యేకంగా పనిచేస్తూ విద్యా సంస్థలు, పని ప్రదేశాల్లో ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో చట్టంపై అవగాహన నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

March 5, 2026 / 04:31 PM IST

ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాన్ని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

VZM: ఇంట‌ర్ మీడియ‌ట్ ప‌రీక్షా కేంద్రాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి గురువారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. స్థానిక‌ తోట‌పాలెంలోని శ్రీ‌నివాస జూనియ‌ర్ క‌ళాశాల‌ను క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న తీరును ప‌రిశీలించారు. ప‌రీక్ష వివ‌రాలు, విద్యార్ధుల...

March 5, 2026 / 04:31 PM IST

‘వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి సహకరించాలి’

SRPT: కోదాడ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి మున్సిపల్ ఛైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ కోరారు. గురువారం కోదాడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో 35 వార్డుల కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

March 5, 2026 / 04:30 PM IST

99 రోజుల ప్రగతి ప్రణాళిక పై దిశా నిర్దేశం

MDK: 99 రోజుల ప్రగతి ప్రణాళిక పకడ్బందీగా అమలు చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల అధికారులతో ప్రణాళికపై సూచనలు చేశారు. చేగుంట మండలంలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాధికారి, నీటి సరఫరా విభాగం, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు.

March 5, 2026 / 04:30 PM IST

కాంగ్రెస్ అక్రమ కేసులు బనాయిస్తోంది: మాజీ ఎమ్మెల్యే

MBNR: కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ మనోహర్ రెడ్డి ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన జిల్లా జైలులో ఉండగా గురువారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ములాఖాత్‌లో కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరిత కేసులు పెడుతోందని ఆరోపించారు.

March 5, 2026 / 04:30 PM IST

జోగుళాంబ ఆలయానికి శంకరాచార్య రాక

GDWL: శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను శుక్రవారం సాయంత్రం జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి విజయ యాత్రలో భాగంగా సందర్శించనున్నట్లు ఈవో దీప్తి తెలిపారు. రెండు రోజుల పర్యటనలో బాల బ్రహ్మేశ్వర స్వామికి అభిషేకం, అమ్మవారికి శ్రీచక్ర అర్చన నిర్వహించి అనంతరం అనుగ్రహ భాషణం, తీర్థప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు.

March 5, 2026 / 04:30 PM IST

మెదక్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం

MDK: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’పై ఈనెల 6న మెదక్ ఐడీఓసీలో ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఇంఛార్జ్ మంత్రి వివేక్, మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరుకానున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో కలిసి ప్రణాళిక అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు.

March 5, 2026 / 04:30 PM IST

విధులు నిర్వహిస్తు హెడ్ కానిస్టేబుల్ మృతి

KMR: రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తి గుండెపోటుతో మరణించారు. గురువారం ఉదయం ఎప్పటిలాగే స్టేషన్‌లో విధులకు హాజరైన కృష్ణమూర్తికి హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి కుప్పకూలిపోయారు. వెంటనే పోలీస్ సిబ్బంది ఆయణ్ను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

March 5, 2026 / 04:30 PM IST