అన్నమయ్య: రుద్రవరం మండలం అప్పనపల్లిలో నివాసం ఉంటున్న పల్లె శివలక్ష్మి (30) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై జయప్ప శనివారం తెలిపారు. భర్త మద్యానికి బానిసయ్ కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ప్రకాశం: మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామ పరిసర ప్రాంతాల్లో రాత్రివేళల్లో అక్రమ మట్టి తవ్వకాలు, రవాణా జోరుగా సాగుతున్నాయి. అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో కొందరు కూటమి నాయకులు జేసీబీలు వినియోగించి ట్రాక్టర్ల ద్వారా మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు దృష్టి సాధించాలని ప్రజలు కోరుతున్నారు.
అన్నమయ్య: బీ కొత్తకోట మండలం నామాలపల్లిలో శనివారం కొబ్బరి బోండాలు దింపుతుండగా కాలు జారి కొబ్బరి చెట్టుపై నుంచి పడి కుళ్లాయప్ప అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు అతన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో వైద్యులు తిరుపతికి తరలించాలని సూచించారు.
WG: భీమవరంలో శనివారం APTF ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మార్చి 3న ఏలూరులో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని గౌరవ అధ్యక్షురాలు బి. పుణ్యవతి, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.శ్రీవల్లి, కె.జాన్ మోజెస్ పిలుపునిచ్చారు. హక్కుల సాధన కోసం ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
గుంటూరు నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు నగర కమిషనర్ కె. మయూర్ ప్రజారోగ్య అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. రోడ్లు, డ్రైన్లలో వ్యర్థాలు వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి వంద శాతం తడి, పొడి చెత్త సేకరించాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు కమిషనర్ సూచించారు.
RR: యాసంగి పంట సాగుకు యూరియా బస్తాల పంపిణీ ఇవాళ ఉంటుందని కందుకూరు వ్యవసాయ శాఖ తెలిపింది. కందుకూరులోని సొసైటీ ఆఫీస్ వద్ద ఉదయం10 గంటలకు రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేయనున్నారు. రైతులు యూరియా (ఫెర్టిలైజర్) ఆప్‌లో బుక్ చేసుకుని తర్వాత తమ పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకురావాలంటూ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
MDCL: ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం జరిగిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో రేపు పక్కాగా లాభాలు సాధించవచ్చని అనేకమంది నాచారం పరిధి రాఘవేంద్ర నగర్, మల్లాపూర్ వెంకటేశ్వర స్వామి నగర్ కాలనీ ట్రేడర్లకు ఫేక్ కాల్స్ వస్తున్నట్లుగా తెలిపారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, అలాంటి వాటిని నమ్మితే, మోసం జరిగే అవకాశం ఉందన్నారు.
TG: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ లేకుడా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఇవాళ్టి నుంచి ప్రత్యేక తనిఖీలు చేయనున్నారు. ఈ క్రమంలో ఎవరైనా లైసెన్స్ లేకుండా పట్టబడితే ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి.. లైసెన్స్, ఎల్ఎల్ఆర్ తీసుకునేందు సమయం ఇస్తారు. అయితే లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
SRPT: యాసంగి సీజన్‌కు గాను వారబందీ విధానంలో జిల్లాకు 1,700 క్యూసెక్కుల గోదావరి జలాలు విడుదల చేస్తుండగా శనివారం వాటిని 1,613 క్యూసెక్కులకు తగ్గించారు. ప్రస్తుతం వస్తున్న నీళ్లను వృథా చేయకుండా పంటలకు వాడుకోవాలని జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, ఏఈ చంద్రశేఖర్ రైతులకు సూచించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 257 నుంచి రూ.260 మధ్య ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ. 292 నుంచి రూ. 300 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 20 వరకు పెరిగింది
NDL: శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు కామదహనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాన ఆలయం ముందు గంగాధర మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం సంప్రదాయం ప్రకారం మన్మథ రూపాన్ని దహనం చేస్తారని వివరించారు.
నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఐదేళ్ల ఇంటిగ్రేట్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పరీక్షల సమయం పట్టికను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. 8వ సెమిస్టర్ (రెగ్యులర్ బ్యాక్ లాగ్) పరీక్షలు మార్చి 11 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలియజేశారు.
NZB: భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవ పవిత్ర తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శనివారం బోధన్ డిపోలో దీనికి సంబంధించిన పోస్టర్లను డీఎం విశ్వనాథ్ ఆవిష్కరించారు. కేవలం రూ.151 చెల్లించి కార్గో సేవల ద్వారా నమోదు చేసుకుంటే నేరుగా భక్తుల ఇళ్లకు తలంబ్రాలు డెలివరీ చేస్తామని ఆయన తెలిపారు.
KMR: భిక్కనూర్‌లోని సిద్ధరామేశ్వర స్వామి ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 7 నుంచి 11 వరకు జరగనున్నాయి. భువనేశ్వరీ సహిత స్వామి వారికి పుణ్యహవాచనం, అంకురార్పణం, రుద్రాభిషేకం, కల్యాణోత్సవం, విమాన రథోత్సవం, అవభృథ స్నానం నిర్వహించనున్నారు. అగ్నిగుండాలు, వీరభద్ర ప్రస్తావన, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.