KDP: సింహాద్రిపురం మండలం కోవరంగుంటపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయ డిప్యూటీ డెమో ఆఫీసర్ ప్రసన్న లత విద్యార్ధినీలకు టీనేజ్ ప్రెగ్నెన్సీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల తక్కువ బరువు గల శిశువులకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. టీనేజ్ పిల్లల ముందు తల్లిదండ్రులు కొన్ని అలవాట్లు మానుకోవాలని తెలిపారు.
VZM: బొబ్బిలి మండలం పెంట విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే రంగరాయపురం ఫీడర్ నిర్వహణ పనులు కోసం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.రఘు చెప్పారు. రంగరాయపురం, జె.రంగరాయపురం, చెల్లారపువలస, ఎం.బూర్జవలస గ్రామాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.
ADB: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ శ్యామల దేవి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జీపీఓ, ఆర్‌ఐ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థాయిలో ఆదాయం, నివాసం తదితర ధ్రువపత్రాలను జీపీఓల ద్వారా జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ADB: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ శ్యామల దేవి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జీపీఓ, ఆర్‌ఐ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థాయిలో ఆదాయం, నివాసం తదితర ధ్రువపత్రాలను జీపీఓల ద్వారా జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
TPT: తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమెకు రంగనాయకులు మండపంలో వేద పండితులు ఆశీర్వచనంతో అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ASF: జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఈనెల 28న తిర్యాణి మండలంలో పర్యటించనున్నట్లు BJP మండల అధ్యక్షుడు సారా రమేశ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ సభ్యుడు పర్యటనలో భాగంగా మండలంలోని మంగి గ్రామాన్ని సందర్శించడంతో పాటు మారుమూల ప్రాంతాల్లోని రోడ్లు, పోడు భూముల సమస్య, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు.
WGL: త్వరలోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించబోతున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మొత్తం 35 డిపార్ట్‌మెంట్లతో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ సేవలు అందించబోతున్నామని, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
RR: ఇవాళ షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నందిగామ గ్రామ పంచాయతీ పరిధిలోని బండకుంట తండా, ధన్‌సింగ్ తండా, చాకలిగుట్ట తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొననున్నారు. అనంతరం కొత్తూరు, నందిగామ మండల పరిధిలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.
నరసాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్ బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠకులతో ముఖాముఖి నిర్వహించి గ్రంథాలయంలో అందుతున్న సేవలు, ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.
KRNL: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయడానికి రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ పీ.విశ్వనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.
MNCL: వాహనాదారుల్లో మార్పు కోసమే జరిమానాలు విధిస్తున్నామని మంచిర్యాల ట్రాఫిక్ CI సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. జరిమానాలు విధించడం పోలీసుల లక్ష్యం కాదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రజల ప్రాణాలు కాపాడిన వారమవుతామని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు.
AP: SC, ST విద్యార్థుల ఎంపికపై గతంలో Dy. స్పీకర్ రఘురామ చేసిన వ్యాఖ్యలను IPS సునీల్ నాయక్ తప్పుబట్టారు. ‘రిజర్వేషన్ అనేది ఛారిటీ కాదు. 2వేల ఏళ్ల చారిత్రక నేరాన్ని రాజ్యాంగం సరిదిద్దుతోంది. మేము కేవలం పరీక్షలే కాదు, మీరు నిర్మించిన శతాబ్దాల గోడలను బద్దలుకొట్టాం. ఉన్నత స్థానాల్లో ఉన్నవారి ఆలోచనా విధానం ఇలా ఉంటే అణగారిన పిల్లలకు ఏం సందేశం వెళ్తుంది’ అని ప్రశ్నించారు.
NGKL: కుమ్మెర మల్లన్న జాతర ఘటనలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. A1 ఉండ్యాల శ్రీనివాస్ రెడ్డి, A2 మధు రెడ్డి, A3 శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు నెలల చిన్నారి మృతదేహంపై పోస్టుమార్టం నివేదికలో అంతర్గత, బహిర్గత గాయాలు లేవని వెల్లడైంది. RFSL నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
MBNR: దొడ్డలోనిపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కొత్త విద్యార్థుల అడ్మిషన్‌లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ Dr. జె.జయప్రద తెలిపారు. అభ్యర్థులు నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చని, రిజర్వేషన్ & మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ATP: గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్ఎస్ నివాసి చంద్రశేఖర్ కుమార్తె వివాహానికి ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి బుధవారం 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబానికి నగదును అందజేసి వధూవరులను ఆశీర్వదించారు. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆయన ఆకాంక్షించారు.