• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

డిగ్రీ కళాశాలలో ఘనంగా మాతృభాషా దినోత్సవం

SKLM: ఆమదాలవలస మండలం తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డా. జి. రవికుమార్ మాట్లాడుతూ భావ వ్యక్తీకరణకు మాతృభాష కీలకమని, ప్రపంచ భాషలలో తెలుగు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 01:12 PM IST

పేదల సొంతింటి కల నెరవేరుస్తాం: ఎమ్మెల్యే

NGKL: పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు. తాడూరు మండలం మేడిపూరులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై, రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.. అర్హులైన పేదవాడికి గృహ నిర్మాణ పథకం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

February 21, 2026 / 01:11 PM IST

సామ్రాజ్యవాద ధోరణులతో ముప్పు: సీపీఎం

NLG: అమెరికా సామ్రాజ్యవాద ధోరణులు ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘రెడ్ బుక్ డే’ సందర్భంగా నల్గొండ పట్టణంలోని స్టడీ సర్కిల్‌లో జరిగిన కార్యక్రమంలో ‘బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం’ అనే పుస్తకాన్ని ఆయన విశ్లేషించారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు.

February 21, 2026 / 01:10 PM IST

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

RR: ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు సౌకర్యవంతమైన పనులు చేస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఎండాకాలం ముగిసే సరికి రోడ్ కల్వర్టు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను కోరారు.

February 21, 2026 / 01:10 PM IST

ఘనంగా అంతర్జాతీయ మాతృబాషా దినోత్సవ వేడుకలు

W.G: భీమవరం సివి రామన్ స్కూల్లో శనివారం శ్రీవిజ్ఞాన వేదిక చార్టిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి., గోపాలశర్మ, డాక్టర్ రంగరాజు మాట్లాడుతూ.. భాషా వైవిధ్యాన్ని రక్షించుకోవడం కోసమే అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. సుబ్రహ్మణ్యం, సత్యనారాయణరాజు, నాగేశ్వరరావు,శర్మ, రాజబాబు,బాషా, పాల్గొన్నారు.

February 21, 2026 / 01:09 PM IST

ఈనెల 23న రైతు సంఘర్షణ సభ

GDWL: ఈనెల 23న గద్వాల జిల్లా కేంద్రంలో రైతు సమస్యల పరిష్కారానికై నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తునట్లు అట్టి సభను విజయవంతం చేయాలని గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు విలేకరులు సమావేశం తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండాగా రైతులను మోసం చేస్తుందని అన్నారు.

February 21, 2026 / 01:08 PM IST

సెపక్ తక్రా విభాగంలో ఆసిఫాబాద్ పోలీసులకు పతకాలు

ASF: హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన 4వ తెలంగాణ పోలీస్ క్రీడల సెపక్ తక్రా విభాగంలో కాళేశ్వరం జోన్ రన్నరప్‌గా నిలిచింది. ఆసిఫాబాద్ జిల్లా AR హెడ్‌క్వార్టర్‌కు చెందిన గోపి(కెప్టెన్), కిరణ్ కుమార్, రాజేశ్ రజత పతకాలు సాధించారు. ప్రతిభ చాటిన కెప్టెన్ గోపి త్వరలో కేరళలో జరగనున్న ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికయ్యారు.

February 21, 2026 / 01:07 PM IST

కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి ప్రకటన

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఏపీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టు పరిశీలనలో ఉందని, అవసరమైన సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోర్టు భవనాల నిర్మాణానికి అదనంగా రూ.130 కోట్లు కేటాయించినట్లు మంత్రి ఇవాళ వెల్లడించారు.

February 21, 2026 / 01:06 PM IST

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

VZM: తెర్లాంకి చెందిన శనపతి రాము కుమార్తె జ్ఞానవర్షిణికు మంజూరైన సీఎం సహాయ నిధి రూ.1,00,000 చెక్కును ఎమ్మెల్యే బేబినాయన అందజేశారు. బొబ్బిలి కోటలో శనివారం చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో దోహదం చేస్తుందని బేబినాయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా సీఎం సహాయ నిధి మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

February 21, 2026 / 01:05 PM IST

పూతలపట్టులో స్వచ్ఛ రథం ప్రారంభం

CTR: స్వచ్ఛతపై అవగాహన కల్పించే లక్ష్యంతో స్వచ్ఛ రథాన్ని అందుబాటులోకి తెచ్చారు. పూతలపట్టు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కుమారి ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ప్రజలందరూ పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. ఎంపీడీవో నాగరాజు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

February 21, 2026 / 01:04 PM IST

సీఎస్ఆర్ నిధులతో కుడికుంట చెరువుకు పునర్జీవనం

HYD: ఒకప్పుడు చెత్తతో నిండిపోయిన కుడికుంట చెరువు.. ఇప్పుడు పునర్జీవనం పోసుకుంది. సీఎస్ఆర్ నిధులతో కల్పన రమేష్ చెరువును తీర్చిదిద్దారు. దీంతో స్థానిక కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. చెత్తతో మురికిగా ఉన్న చెరువును బాగు చేయడంపై అభినందించారు. స్థానికుల సహకారంతో పాటు ఓ సంస్థ సీఎస్ఆర్ నిధులతో ఈ పనులు చేసినట్లు చెప్పారు.

February 21, 2026 / 01:03 PM IST

ఆదిలాబాద్ జిల్లాలో 13 పరీక్ష కేంద్రాలు: డీసీవో

ADB: గురుకులాల్లో ఐదవ తరగతి ఉమ్మడి పరీక్ష, 6, 7, 8, 9 తరగతులలో మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్షను ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు డీసీఓ లలిత కుమారి పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని.. మొత్తం 4820 మంది బాలబాలికలు హాజరవుతున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 10 గంటల్లోపు చేరుకోవాలన్నారు.

February 21, 2026 / 01:02 PM IST

NTPCలో 515 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC)లో 515 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు గడువు 4 రోజుల్లో(FEB 25)తో ముగియనుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఖాళీలు ఉండగా.. డిగ్రీ(ఇంజినీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు గేట్ 2025 స్కోర్ గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.40,000-1,40,000 జీతం ఉంటుంది.

February 21, 2026 / 01:02 PM IST

రోడ్డు ప్రమాద మృతుని కుటుంబానికి MLA ఆర్ధిక సాయం

ASF: బెజ్జూర్ మండలంలోని రెబ్బెన గ్రామానికి చెందిన ఆర్పటి గణేష్ వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై మరణించాడు. విషయం తెలుసుకున్న సిర్పూర్ MLA హరీష్ బాబు శనివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రెబ్బన సర్పంచ్ నందిపేట రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 01:01 PM IST

ఎమ్మెల్యే కార్యాలయానికి స్వామి వారి తీర్థప్రసాదాలు

సత్యసాయి: లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం నుంచి శ్రీస్వామి వారి తీర్థప్రసాదాలను ఆలయ ఛైర్మన్ రమానందన్ ఎమ్మెల్యే కార్యాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వాదాలు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు.

February 21, 2026 / 12:58 PM IST