MDK: జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమ సింగ్‌ను అడిషనల్ ఎస్పీ మహేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యల గురించి ఆమెకు వివరించారు.
AKP: నాతవరం మండలం డీ.యర్రవరం పాఠశాలలో మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్. రేవతమ్మ, ఎస్ఐ వై. తారకేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థినీలకు స్వీయరక్షణపై అవగాహన కల్పించారు. ప్రాథమిక రక్షణ పద్ధతులు నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి ప్రమాద పరిస్థితుల్లో ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం వస్తుందని సీఐ తెలిపారు.
MDK: జిల్లా కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రతిమ సింగ్‌ను జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమెను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలు, అభివృద్ధి సంక్షేమంపై విషయంలో చర్చించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
MBNR: మిడ్జిల్ మండల్ దోనూర్ గ్రామంలో బుధవారం ఉదయం నుంచే హోలీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యువతి, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఊరేగింపుతో వీధులన్నీ తిరిగి ఒకరికొకరు సోదరాభావంతో రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, శ్రీను చారి, శ్రీకాంత్, రాఘవేందర్, పాండు, బాలరాజ్ గ్రామంలోని యువకులు పాల్గొన్నారు.
అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం మార్గోపల్లి పంచాయతీ గుడ్లవారిపల్లికి చెందిన గోపిశెట్టి శంకరయ్యకు CMRF ద్వారా మంజూరైన రూ.41,324 చెక్కును టీడీపీ ఇంఛార్జ్, KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి వారి నివాసంలో అందజేశారు. అవసరంలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
NZB: ముప్కాల్‌లోని విద్యుత్ శాఖ కార్యాలయంలో బుధవారం లైన్‌మెన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏడీఈ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ పనులు చేసే సమయంలో లైన్‌మెన్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి ఉద్యోగి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
WGL: వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, జిల్లాలోనే అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆకాంక్షించారు. బుధవారం ఆయన హనుమకొండలోని భద్రకాళి అమ్మవారిని, సాయిబాబా మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలందిస్తానని చెప్పారు.
ELR: పెదవేగి(మం) దుగ్గిరాలలో వరిపంట పొలాల్లో బుధవారం ఈ-పంట సూపర్ వైజర్ చెక్ రికార్డులను కలెక్టరు కే. వెట్రిసెల్వి బుధవారం తనిఖీలు చేశారు. అధికారులు, సిబ్బంది రైతులకు సంబంధించిన ప్రతి ఎకరాను పంట వివరాలు నమోదు ప్రక్రియ అత్యంత ముఖ్యమని చెప్పుకొచ్చారు. తక్కువ నీటి వినియోగంతో అధిక లాభదాయకత కలిగిన పంటలుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
AP: అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను శాసనమండలి ఆమోదించింది. ఏపీ అసైన్డ్ భూముల సవరణ బిల్లు-2026కు మండలిలో ఆమోదం లభించింది. అలాగే.. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాలు సవరణ బిల్లు-2026కు మండలి ఆమోదం తెలిపింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చుతూ సవరించిన బిల్లుకు ఆమోదం లభించింది.
NLG: ఆర్డర్ చేసిన టీ త్వరగా ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు టీ స్టాల్ యజమానిపై దాడికి దిగాడు. మిర్యాలగూడలోని టీ స్టాల్ వద్దకు వచ్చిన యువకుడు, యజమానితో వాగ్వాదానికి దిగి క్షణికావేశంలో గ్లాసుతో తలపై కొట్టాడు. దీంతో యజమానికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా: చల్లపల్లి మండలం కొత్తమాజేరులో రైతు సేవా కేంద్రంలో మినుములు, పెసల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. మార్క్ ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, మార్క్ ఫెడ్ డీఎం మురళీ కిషోర్ ప్రారంభించారు. ఏఎంసీ ఛైర్మన్ తోట కనకదుర్గ, వైస్ ఎంపీపీ రాంబాబు పాల్గొన్నారు.
ATP: ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీలా మారిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురంలో బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. అమరావతిని చంద్రబాబు తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీల అమలును ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
KKD: వలసపాకలి గ్రామంలో ప్రధాన రహదారి దెబ్బతినడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల గుంతలు ఏర్పడి వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల రాకపోకలు కష్టంగా మారాయి. విద్యార్థులు, రైతులు, వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మరమ్మతు చేసి సురక్షితంగా మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
SRPT: దాడులు, దౌర్జన్యాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్పడుతున్నారని BRS పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల వరుస దాడులను కండిస్తూ బుధవారం సూర్యాపేట పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. అరాచక శక్తులను ప్రోత్సాహించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తామంటే సహించేది లేదన్నారు.
నెల్లూరులోని పొర్లు కట్ట సమీపంలోని టపాసుల తయారీ గోడౌన్లలో ఆర్డీవో అనూష తనిఖీలు నిర్వహించారు. టపాసుల తయారీకి అనుమతులు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా టపాసులు తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంతపేట పోలీసులు పాల్గొన్నారు. స్టాక్ పాయింట్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆమె వివరించారు.