• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రధాని ఆశీర్వాదం తీసుకున్నాం: విజయ్‌

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలవడంపై నటుడు విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశాడు. మోదీ ఆశీస్సులు తీసుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని, తన తల్లిదండ్రులకు ఆయన లేఖ రాయడం విశేషమని పేర్కొన్నాడు. అమిత్ షాతో సినిమా, సంస్కృతిపై చర్చించానని.. ఆయన కానుకగా ఇచ్చిన గణేష్ విగ్రహాన్ని తమ పూజా గదిలో ఉంచామని తెలిపాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.

February 28, 2026 / 04:02 PM IST

‘నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి’

కోనసీమ: నిరుద్యోగ యువత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ సూచించారు. ఇవాళ మల్కిపురంలోని డిగ్రీ కళాశాల వద్ద అధికారులు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఎమ్మెల్యే సందర్శించి నిరుద్యోగులకు ఉపాధి పొందే అవకాశాలపై అవగాహన కల్పించారు.

February 28, 2026 / 04:01 PM IST

ఏపూరు హై స్కూల్లో సైన్స్ దినోత్సవం

NLG: చిట్యాల మండలం ఏపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మహేష్ సైన్స్ ప్రదర్శనలను ప్రారంభించారు. విద్యార్థులు న్యూటన్ నియమాలు, పాస్కల్ సూత్రం, గ్రీన్ ఎనర్జీ వంటి పలు వర్కింగ్ మోడల్స్‌ను ప్రదర్శించారు. సీవీ రామన్ సేవలను హెచ్ఎం మోహన్ రెడ్డి, ఫిజికల్ సైన్స్ టీచర్ గోపాల్ రెడ్డి కొనియాడారు.

February 28, 2026 / 04:01 PM IST

విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసిన సబ్ కలెక్టర్

KMR: జుక్కల్ మండలం పెద్ద ఏడ్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం చేసి, వంటల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, మెనూ ప్రకారం వారంలో మూడు రోజులు తప్పనిసరిగా గుడ్లు పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

February 28, 2026 / 04:01 PM IST

‘పరీక్ష కేంద్రానికి అరగంట ముందు చేరుకోవాలి’

ADB: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదు నెలల ఉచిత రెసిడెన్షియల్ పరీక్ష మార్చి 1న నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేశ్ శనివారం తెలిపారు. పట్టణంలో నలంద కళాశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాలని సూచించారు.

February 28, 2026 / 04:00 PM IST

వన్ స్టాప్ సెంటర్‌ను తనిఖీ చేసిన జిల్లా జడ్జి

విజయనగరంలో ఉన్న శక్తి వన్ స్టాప్ సెంటర్‌ను జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ. కృష్ణ ప్రసాద్ శనివారం సందర్శించారు. సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలను, బాధితులకు ముఖ్యంగా మహిళా బాధితులకు ఏ విధమైన ఆశ్రయాలు కల్పిస్తున్నది వారికి ఏ విధమైన కౌన్సిలింగ్ ఇస్తున్నది వివరాలు అడిగి తెలుసుకున్నారు.

February 28, 2026 / 04:00 PM IST

సీదిలో రూ.2.41 కోట్లతో ఇండోర్ స్టేడియంకు గ్రీన్ సిగ్నల్

SKLM: పాతపట్నం నియోజకవర్గంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో CSR నిధుల ద్వారా పాతపట్నం M.సీది గ్రామంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సూత్ర ప్రాయ ఆమోదం లభించినట్లు స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.2.41 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు.

February 28, 2026 / 04:00 PM IST

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఆనం

NLR: ASపేట(M) వేల్పులగుంట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.11 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం, మరో రూ. 2 లక్షలతో మంజూరు చేసిన నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి, రూ.31 లక్షలతో నిర్మించనున్న రక్షిత మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేశారు.

February 28, 2026 / 04:00 PM IST

చర్మం బాగుండాలంటే.. జాగ్రత్తలు తప్పనిసరి!

చర్మ సౌందర్యానికి ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు తాగడం ముఖ్యం. జంక్ ఫుడ్, డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. నిత్యం సన్‌స్క్రీన్, మాయిశ్చరైజర్ రాస్తూ మెడ, కళ్ల కింద మృదువుగా మర్దన చేయాలి. రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి, కానీ ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. మొటిమలు, మచ్చలను గిల్లడం వంటివి చేయరాదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

February 28, 2026 / 04:00 PM IST

మాచర్లలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

PLD: మాచర్ల పట్టణంలోని వినాయకుని గుట్ట 28, 29వ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పరిశీలించారు. రూ.2 కోట్ల 65 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

February 28, 2026 / 03:59 PM IST

విజయవాడలో వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై

NTR: విజయవాడ గాంధీనగర్లో శనివారం ఎస్సై సరళ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు, జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.

February 28, 2026 / 03:58 PM IST

అంగన్వాడీలకు ఫ్యాన్లు పంపిణీ చేసిన ఛైర్మన్

ప్రకాశం: వెలిగండ్లలో అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన ఫ్యాన్లు, కుర్చీలు పంపిణీ చేశారు. శ్యామల వెంకటరెడ్డి ఫౌండేషన్ సహకారంతో డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి ఈ సామగ్రిని అందజేశారు. చిన్నారులకు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం అందించాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్థానిక ప్రజలు, సిబ్బంది ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

February 28, 2026 / 03:58 PM IST

ఫిర్యాదుదారుడికి భరోసా కల్పించాలి: ఎస్పీ

సంగారెడ్డి: పోలీస్ స్టేషన్లో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి ఫిర్యాదు దారుడికి భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. శనివారం SP ఆఫీస్‌లో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, నేరాలు ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించాలన్నారు.

February 28, 2026 / 03:57 PM IST

కొలిమిగుండ్లలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: కొలిమిగుండ్ల(మం) కోరుమానుపల్లిలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గ్రామ సమీపంలో ఉన్న గుండం ఆంజనేయ స్వామి వద్ద నూతనంగా నిర్మించిన పట్టాభి రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 28, 2026 / 03:54 PM IST

ఒంగోలులో అబ్బురపరిచిన సైన్స్ ఎగ్జిబిషన్

ప్రకాశం: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు మండలం కరవది గ్రామంలోని వివేకానంద విద్యావిహార్‌లో శాస్త్ర ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ మోడల్ ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకుని అబ్బురపరిచాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి మాట్లాడుతూ.. శాస్త్ర విజ్ఞానం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని తెలిపారు.

February 28, 2026 / 03:53 PM IST