• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం’

అన్నమయ్య: రాయచోటి వైఎస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ ప్రయోజనాలను విస్మరించారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ఆపివేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సరిగా అమలుకావడం లేదని, ఎన్నికల హామీలు నెరవేర్చడం లేదని ఆరోపించారు.

February 21, 2026 / 09:00 PM IST

బ్రహ్మోత్సవాలకు రావాలని డీజీపీకి ఎమ్మెల్యే ఆహ్వానం

NDL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తాను ఎమ్మెల్యే భూ మా అఖిలప్రియ ఆహ్వానించారు. శనివారం ఆయన కార్యాలయంలో ఆయను మర్యాద పూర్వకంగా కలిసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు తప్పక రావాలని కోరారు. ఈ సందర్బంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విశిష్టతను ఆయన వివరించారు.

February 21, 2026 / 09:00 PM IST

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత: మాజీ ఎమ్మెల్యే

SRD: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతతతో పాటు జీవితానికి దిశానిర్దేశం ఇస్తాయని మాజీ ఎమ్మెల్యే జైపాల్ రెడ్డి అన్నారు. శనివారం నాగలిగిద్ద మండలం ఔదత్ పూర్‌లోని శ్రీ ఎల్లా లింగేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించారు. ఇక్కడ జాతర మహోత్సవాల్లో మచ్చేందర్ నాథ్ మహారాజ్‌ను కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.

February 21, 2026 / 08:55 PM IST

భక్తుల ఇంటికే రాములోరి కళ్యాణ తలంబ్రాలు

TG: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను TGSRTC ఎండీ నాగిరెడ్డి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. రూ.151 చెల్లించి రాములోరి తలంబ్రాలు పొందే అవకాశం కల్పించారు. ఈనెల 23 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

February 21, 2026 / 08:55 PM IST

మన దేశ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు: కేటీఆర్

TG: యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను వేదికగా ఎంచుకోవడం అత్యంత విచారకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడంతో ప్రపంచ దేశాల ముందు మన దేశం ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే, ఎక్కడ ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. 

February 21, 2026 / 08:52 PM IST

ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి: స్వరూప రాణి

SDPT: ప్రభుత్వ పథకాలకు రాయతీలు లభించాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి సరూప రాణి అన్నారు. జిల్లా పరిధిలోని రైతులు తమ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా, మీసేవ కేంద్రాలకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే పంట బీమా, సబ్సిడీలు అందుతాయన్నారు.

February 21, 2026 / 08:50 PM IST

రేవంత్ రెడ్డి.. సిగ్గుపడు: హరీష్ రావు

TG: సిద్దిపేట జిల్లా జబ్బాపూర్‌లో ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ప్రైమరీ స్కూల్‌కు యజమాని తాళం వేసిన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. విద్యాశాఖ నిర్వహణ మరెవ్వరి వల్ల కాదని, అందుకే తన వద్దే పెట్టుకున్నానని పదే పదే చెప్పే రేవంత్ రెడ్డి.. ఈ సంఘటనను చూసి సిగ్గుపడాలని మండిపడ్డారు.

February 21, 2026 / 08:49 PM IST

జీఎస్టీ ఎగవేతలపై అధికారుల చర్యలు

AP: జీఎస్టీ ఎగవేతపై కేంద్ర ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టారు. విశాఖలో రూ.81.25 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించిన కేసులో చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.11.54 కోట్ల జీఎస్టీ ఐటీసీని అక్రమంగా వాడిన కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నకిలీ బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు రూ.11.54 కోట్ల నష్టం కలిగించినట్లు గుర్తించారు.

February 21, 2026 / 08:47 PM IST

శాంతినగర్ పెద్ద మసీద్‌లో ఇఫ్తార్ విందు

GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ పెద్ద మసీద్ మక్బుల్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. మౌలానా రజాక్ సర్వ మానవాళి సుఖసంతోషాలతో, శాంతియుతంగా జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై ఉపవాస దీక్షలను విరమించారు.

February 21, 2026 / 08:47 PM IST

పార్టీ కార్యకర్త పాడె మోసిన మంత్రి

NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ క్యాన్సర్ చికిత్స పొందుతూ మరణించారు. శనివారం రాష్ట్ర పశుసంవర్థక, క్రీడా, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నారాయణ భౌతికకాయానికి పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో మంత్రి పాల్గొని చనిపోయిన కార్యకర్త లక్ష్మీనారాయణ పాడెను మోశారు.

February 21, 2026 / 08:46 PM IST

‘రాష్ట్రస్థాయి శాప్ చెస్ లీగ్ ప్రారంభం’

TPT: తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్రస్థాయి SAAP చెస్ లీగ్ ప్రారంభమైంది. శాప్ ఛైర్మన్ రవి నాయుడు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులను గుర్తించి శాప్ అకాడమీల్లో ప్రవేశాలు కల్పించడమే లీగ్ లక్ష్యమన్నారు. జిల్లా స్థాయి ఎంపికల్లో 2,445 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు.

February 21, 2026 / 08:43 PM IST

వైద్య చికిత్స నిమిత్తం ఎల్‌వో‌సిని అందజేసిన ఎమ్మెల్యే

RR: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండకి చెందిన అశోక్ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2,50,000 మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నర్నె శ్రీనివాస్ రావుతో కలిసి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అందజేశారు.

February 21, 2026 / 08:42 PM IST

ఏడు ఎకరాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

TG: HYD కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీలో రూ.1400 కోట్ల విలువ చేసే ఏడు ఎకరాల పార్కు స్థలంలో నిర్మించిన ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాల్లో అక్రమ కట్టడాలు చేపట్టారని పూర్తి ఆధారాలతో కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తగిన ఆధారాలు లభించడంతో అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు.

February 21, 2026 / 08:39 PM IST

BREAKING: నిధులు విడుదల

AP: మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా విడుదల చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఈ సహాయం అందించినట్లు వెల్లడించారు. దీంతో 95 మంది కుటుంబాలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. రూ.4.75 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు.

February 21, 2026 / 08:39 PM IST

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి: ఎమ్మెల్యే

SKLM: పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది అని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. శనివారం పోలాకి మండలం గొల్లలవలసలో అధికారులు నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే చీపురు పట్టుకుని గ్రామంలో రహదారులను శుభ్రం చేశారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు.

February 21, 2026 / 08:39 PM IST