ATP: పెద్దవడుగూరు మండలం కొండూరు సమీపంలో భూ రీ-సర్వే విషయంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో పరస్పరం ఇరు వర్గాలు రాళ్లు రవ్వుకున్నారు. ఈ ఘటనలో రామన్న అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
MBNR: మహిళా సాధికారతపై సమాజాభివృద్ధికి పునాది అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. నా భారత్ ఆర్థిక సహకారంతో, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహబూబ్నగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి గ్రామ దుకాణాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం జరుగుతుందని అన్నారు.
AP: మండలి బీఏసీ సమావేశాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు బాయ్‌కాట్ చేశారు. లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలని వైసీపీ MLCలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాసనమండలి వాయిదా పడినా వైసీపీ సభ్యులు సభలోనే బైఠాయించారు. ఛైర్మన్ పోడియం ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. తిరుమల లడ్డూ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.
SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి నారా లోకేష్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్తూరులో డిగ్రీ కాలేజ్ మంజూరు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరణ చేయాలని, వంశధార ప్రాజెక్టు నిర్వాసితులపై నమోదైన కేసులను మానవతా దృష్టితో ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.
PDPL: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ రాష్ట్రస్థాయి కరాటే టోర్నమెంట్‌లో రామగుండం విద్యార్థులు సత్తా చాటారు. రామగుండం జపాన్ షిటోరియా కరాటే స్కూల్‌కు చెందిన ముక్తిశ్రీ 47 కేజీల విభాగంలో వెండి పతకం సాధించగా, 54 కేజీల విభాగంలో సహస్ర కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా కోచ్ కరాటే శ్రీనివాస్, సురేశ్,శ్రీనివాస్, శోభారాణి విజేతలను అభినందించారు.
GDWL: రాజోలి గ్రామానికి చెందిన రాజేష్ గౌడ్ (32) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కష్టపడి పైకొచ్చిన రాజేష్ మరణ వార్త విని బంధుమిత్రులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
AP: గుంటూరులోని మంగళగిరి జనసేన కార్యాలయంలో కలకలం రేగింది. ఓ అజ్ఞాత వ్యక్తి జనసేన కార్యాలయంలోకి చొరబడ్డాడు. దుండగుడు కార్ల అద్దాలు ధ్వంసం చేశాడు. భద్రతా సిబ్బంది దుండగుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కొడుకు స్టార్ క్రికెటర్ అయినా.. రూ. కోట్లు సంపాదిస్తున్నా.. ఆయన మాత్రం గ్యాస్ సిలిండర్ మోస్తూ కష్టపడేవారు. పనులన్నీ వదిలి విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఇలా జరగడం బాధాకరం. కొన్ని రోజుల్లో రింకూకి పెళ్లి జరగనుండగా.. ఆ వివాహ వేడుక చూడకుండానే ఆయన కన్నుమూయడం అందరిని కలిచివేస్తోంది.
RR: హయత్ నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీప్రియ కాలనీలో కొనసాగుతున్న భూగర్భ డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. తమ హయాంలోనే ఈ పనులకు నిధులు మంజూరు చేయించామని, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
MDK: రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మెదక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నగేష్‌లతో కలిసి సమీక్షించారు. జిల్లా ఎస్పీడీ.వి శ్రీనివాసరావు, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ట్రైనీ గ్రూప్ వన్ ఆఫీసర్ సింధు పాల్గొన్నారు.
AKP: రోటరీ క్లబ్, ఎన్టీఆర్ వైద్యాలయం ఆధ్వర్యంలో గవరపాలెం జీవీఎంసీ చిన్న హైస్కూల్‌లో శుక్రవారం విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డా. పృద్వీ మాట్లాడుతూ.. హార్ట్ ఎటాక్ సమయంలో తక్షణ సీపీఆర్ ప్రాణరక్షకమని తెలిపారు. సీపీఆర్ చేయడం వల్ల గుండె మళ్లీ కొట్టుకొని మెదడుకు రక్తప్రసరణ జరుగుతుందని వివరించారు.
ప్రకాశం మార్కాపురం APTF ఆధ్వర్యంలో ఉద్యోగులు పట్టణంలోని R&B కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ పిఆర్సి , ఐఆర్, యాప్ ల పని భారం తగ్గించి, రాష్ట్రస్థాయి విద్యారంగం ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
TG: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు రాజకీయ కుట్రతో పెట్టిన కేసు అని KCR గతంలోనే చెప్పారని జాగృతి అధ్యక్షురాలు కవిత గుర్తు చేశారు. KCR, BRSను టార్గెట్ చేయడానికే ఈ కేసు పెట్టారని వెల్లడించారు. ఐదున్నర నెలలు తనను జైలులో పెట్టి కుటుంబానికి దూరం చేశారని తెలిపారు. తనపై దుష్ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. తన తల్లిదండ్రులు, భార్త అండగా నిలిచారన్నారు.
VKB: నవాందీ రైల్వే స్టేషన్‌లో హుబ్లీ ఎక్స్‌ప్రెస్ రైలు హాల్టింగ్ ప్రారంభమైంది. MP కొండ విశ్వేశ్వర్ రెడ్డి, MLA బుయ్యని మనోహర్ రెడ్డి కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించి రైలుకు పచ్చజెండా ఊపారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బషీరాబాద్ రవాణా పరంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
BHPL: గణపురం మండలం నుండి హైదరాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. బస్సు సర్వీసును గణపురం మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు వచ్చిన ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు వినియోగించుకోవాలన్నారు.