• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శ్రీకాళహస్తి గుడి ఈవో బదిలీ.. కారణం ఇదేనా?

TPT: శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి బదిలీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజే ఈవోని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతనంగా ఏర్పడిన ఆలయ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయి, ఈవోకి మధ్య విభేదాలు వచ్చాయి. ఒకానొక సమయంలో ఈ విషయాన్ని ఛైర్మన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకెళ్లారు.

February 25, 2026 / 09:44 AM IST

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

KNR: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సర విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలోని 57 కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు కొనసాగనున్నాయి.

February 25, 2026 / 09:42 AM IST

రాజమండ్రి సూపరింటెండెండ్‌ సస్పెన్షన్

AP: రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెండ్‌పై ప్రభుత్వం వేటు వేసింది. కల్తీ పాల బాధితులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సత్యనారాయణను సస్పెన్షన్ చేశారు. కొత్త సూపరింటెండెంట్‌గా డాక్టర్ కెనడి నియామకమయ్యారు. అయితే, రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంలో ఐదుగురు మరణించారు. 8 మంది బాధితులు వెంటిలేటర్‌పై ఉన్న విషయం తెలిసిందే.

February 25, 2026 / 09:41 AM IST

రాజధాని పనుల అప్పగింతపై భిన్నాభిప్రాయాలు

GNTR: రాజధాని గ్రామాల్లో రూ. 1,000 కోట్లతో చేపట్టే మౌలిక వసతుల పనులను, ప్రస్తుతం ప్లాట్లు అభివృద్ధి చేస్తున్న పాత సంస్థలకే అప్పగిస్తున్నట్లు మంత్రి నారాయణ గ్రామ సభల్లో ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఉన్న పనుల గడువు పూర్తి చేయడానికి ఆ సంస్థలు ఇబ్బంది పడుతున్నాయని, ఈ అదనపు పనులు కూడా వారికే ఇవ్వడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

February 25, 2026 / 09:40 AM IST

మున్నాళ్ల ముచ్చటగా.. కల్లు కాంపౌడ్లపై తనిఖీలు

HYDలో కల్లు కాంపౌడ్లపై తనిఖీలు మున్నాళ్ల ముచ్చటగా మారాయి. కూకట్ పల్లి ఘటన తర్వాత హడావిడ చేసిన అధికారులు, నాణ్యతను గాలికొదిలేసరనే ఆరోపణలు వస్తున్నాయి. కల్తీ కల్లు తయారీలో అల్ప్రాజోలం వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తారు. కానీ, ఇది ప్రాణాంతకం కాబట్టి అధిక మోతాదులో తీసుకుంటే శ్వాస ఆడకపోవడం, స్పృహ కోల్పోవడం, మరణం సంభవించే ప్రమాదం ఉందని డా.రవి అన్నారు.

February 25, 2026 / 09:40 AM IST

DY.CM పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఎమ్మెల్యే

NLR: అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. వెంకటగిరి అభివృద్ధికి సహకరించాలని వినతపత్రం అందించారు. వెంకటగిరికి ఎంతో చరిత్ర ఉందని.. ఇక్కడి సమస్యలకు పరిష్కారం చూపాలని విన్నవించారు.

February 25, 2026 / 09:40 AM IST

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 510.82 పాయింట్లు లాభపడి 82736.74 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 151.05 పాయింట్ల లాభంతో 25575.70 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.88గా ఉంది.

February 25, 2026 / 09:39 AM IST

నాచారం సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్ల పై ఫోకస్

MDCL: నాచారం సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ.21 కోట్ల మేరకు పన్ను వసూలు కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం లక్ష్యం రూ.59.63 కోట్లుగా నిర్ణయించారు. లక్ష్య సాధన కోసం అధికారులు ప్రత్యేక సేకరణ డ్రైవ్‌లు చేపట్టారు. బకాయిలు ఉన్న ఆస్తి యజమానులకు నోటీసులు జారీ చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

February 25, 2026 / 09:38 AM IST

ఘనంగా స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం

BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష ఘట్టమైన స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం మంగళవారం రాత్రి కనుల పండువగా జరిగింది. స్వామివారి ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదురుగా మాడ వీధుల్లో స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవాన్ని వేద మంత్రాలతో సంప్రదాయ రీతిలో వైభవంగా నిర్వహించారు.

February 25, 2026 / 09:38 AM IST

2వార్డులో కమిషనర్, కౌన్సిలర్ మార్నింగ్ వాక్..

MHBD: మహబూబాబాద్ మున్సిపాలిటీ 2వ వార్డు పరిధిలోని జమాండ్లపల్లిలో ఈరోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, కౌన్సిలర్ శివకుమార్ మార్నింగ్ వాక్ నిర్వహించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2వ వార్డు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని కౌన్సిలర్ అన్నారు.

February 25, 2026 / 09:37 AM IST

రూ.3,145 కోట్లతో CRMP రోడ్లకు గ్రీన్ సిగ్నల్..!

HYD: తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి CRMP రెండో దశకు రూ.3,145 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఆమోదంతో మొత్తం 1,142 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి చేపట్టనున్నారు. రూ.3,145 కోట్ల వ్యయంతో రోడ్ల మరమ్మత్తులు, పునరుద్ధరణ పనులు, అవసరమైన చోట్ల కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టి రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని నిర్ణయించారు.

February 25, 2026 / 09:37 AM IST

అప్రమత్తంగా ఉండండి : కేంద్ర మంత్రి

SKLM: శ్రీకాకుళం నగరంలోని కొన్ని ప్రాంతాలలో డయేరియా కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకూ అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన వద్దని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ ప్రజలకు దైర్యం చెప్పారు. డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఢిల్లీ నుంచి వర్చ్యువల్ విధానంలో కలెక్టర్, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేతో సమీక్షించారు.

February 25, 2026 / 09:35 AM IST

కార్డన్ సెర్చ్.. 4 బైక్‌లు స్వాధీనం

ASR: జీకేవీధి మండలం సీలేరు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న చింతపల్లి క్యాంపులో సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ తమ సిబ్బందితో కలిసి బుధవారం ఉదయం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు.

February 25, 2026 / 09:35 AM IST

ఇంద్రకీలాద్రిపై మంత్రి దంపతుల దర్శనం

NDL: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి ఇందిరా రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి వెల్లడించారు.

February 25, 2026 / 09:34 AM IST

‘పెద్ది’ రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న మూవీ ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘చికిరి’ పాట రిలీజై సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. మార్చి 3, 2026న ఈ పాటను విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతుంది.

February 25, 2026 / 09:34 AM IST