• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

KRNL: దేవనకొండ మండలంలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఘటనల నేపథ్యంలో సీఐ వేణుగోపాల్ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీస్‌లకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించవద్దని, బంగారు ఆభరణాలు బహిరంగంగా ప్రదర్శించరాదని CI వెల్లడించారు.

February 20, 2026 / 02:25 PM IST

నూతన ఛైర్ పర్సన్‌లను సన్మానించిన మంత్రి

NRPT: మక్తల్ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా వాకిటి మానస హన్మంతు, వైస్ ఛైర్ పర్సన్‌గా కుమారి శైవీ రెడ్డి పదవీ బాధ్యతలు ఇవాళ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, ఆయన సతీమణి లలిత హాజరయ్యారు. కార్యాలయంలో పూజల అనంతరం ఇరువురినీ వారి వారి కుర్చీల్లో కూర్చోబెట్టి, సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

February 20, 2026 / 02:24 PM IST

సూపర్‌-8లోనూ విజయాలు సాధిస్తాం: రజా

టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే సంచలన ప్రదర్శనతో సూపర్-8కు చేరుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ సికందర్ రజా మాట్లాడుతూ.. గ్రూప్‌ దశలో అజేయంగా నిలవడం గర్వంగా ఉందని తెలిపాడు. ఇదే ప్రదర్శనను సూపర్-8లో కొనసాగిస్తామని పేర్కొన్నాడు. S-8లో ఈనెల 23న వెస్టిండీస్‌తో జరిగే తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

February 20, 2026 / 02:23 PM IST

‘పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని తక్షణమే చెల్లించాలి’

NTR: తిరువూరులో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగుల నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు సీపీఎం జిల్లా కార్యదర్శి కృష్ణయ్య శుక్రవారం హాజరయ్యి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని తక్షణమే చెల్లించాలన్నారు. 2019 నుంచి ఉద్యోగం చేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 02:23 PM IST

మహిళ దీనస్థితిపై స్పందించిన లోకేష్

AP: కడప జిల్లా గోపవరం మండలం పి.పి కుంటకు చెందిన లక్ష్మీనారాయణమ్మ దీనస్థితిపై మంత్రి లోకేష్ స్పందించారు. ప్రసార మాధ్యమాల్లో ఆమె దీనస్థితిపై వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను ఆయన అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆ కుటుంబానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించారు.

February 20, 2026 / 02:23 PM IST

పెంటపాడులో కనకదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట

W.G: పెంటపాడు మండలం ఉమామహేశ్వరంలో శ్రీ కనక దుర్గా దేవి నూతన ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ కో ఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేేక పూజలు చేశారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

February 20, 2026 / 02:21 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం’

KMM: అధికారం అంటే గద్దె మీద కూర్చోవడం కాదు, ప్రజా సమస్యల పరిష్కారమేనని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏదులాపురం 22వ వార్డులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనిత ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఏదులాపురం అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు.

February 20, 2026 / 02:20 PM IST

నర్సీపట్నంలో లేగ దూడల ప్రదర్శన

AKP: నర్సీపట్నం(మం) చెట్టుపల్లిలో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ.. రైతుల్లో పాడి పశువుల పెంపకంపై అవగాహన పెంచుతున్నామన్నారు. మేలు రకము సంతతిని వృద్ధి చేయడానికి పశుసంవర్ధక శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.

February 20, 2026 / 02:20 PM IST

‘అత్యాచార నిరోధక చట్టం అమలు చేయాలి’

KRNL: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలును అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని జేసి నూరుల్ ఖమర్ ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పలు అంశాలపై జేసీ అధికారులతో చర్చించారు. ఇందులో హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు, పత్తికొండ RDOలు సందీప్, భరత్ ఉన్నారు.

February 20, 2026 / 02:19 PM IST

పోలీసుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అసెంబ్లీలో పోలీసు శాఖ సమస్యలపై ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావించారు. పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న పని భారం, సిబ్బంది కొరత, మౌలిక వసతుల లోపాలు వంటి అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసులకు తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

February 20, 2026 / 02:19 PM IST

ఏఐ వార్ రూం.. హైదరాబాద్ అనుకూలం: సీఎం రేవంత్

TG: మనిషి కంటే ఏఐ ఎక్కువ తెలివితేటలు కలిగి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ శకం ఇప్పటికే మొదలైందన్నారు. గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది.. ఇప్పుడు సాఫ్ట్ వేర్ విప్లవం నడుస్తోందన్న రేవంత్.. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగాలన్నారు. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఏఐ వార్ రూమ్ కోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశమన్నారు.

February 20, 2026 / 02:18 PM IST

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పరిశీలన

BPT: కర్లపాలెం మండలం ఎంవీరాజుపాలెంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కొనసాగుతుంది. ఈ మేరకు ఇవాళ సర్వేను బాపట్ల ఆర్డీవో గ్లోరియా, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీదేవి పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి సర్వే నమోదు విధానాన్ని పరిశీలించారు. కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.

February 20, 2026 / 02:16 PM IST

కోటూరులో రాష్ట్ర స్థాయి పూటీ లాగుడు పోటీలు

కృష్ణా: కోడూరులో రాష్ట్రస్థాయి పూటీ లాగుడు బల ప్రదర్శన(పోటీలు) నిర్వహిస్తున్నట్లు పసుపులేటి రాము (దాణాకొట్టు) అన్నారు. కోడూరు శివారు స్వతంత్రపురం గవర్నమెంట్ హాస్పటల్ సమీపంలో పూతబోయన వెంకయ్య స్థలంలో మార్చ్ 8వ తేదీ పూటీ ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కావున ఆసక్తిగల ఎడ్ల యజమానులు మార్చ్ 1వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 02:16 PM IST

వాల్య నాయక్ తండాలో వీధి దీపాలు ఏర్పాటు

VKB: వాల్యా నాయక్ తండాలో శుక్రవారం వీధి బల్బులు బిగించారు. గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్నామని తండా వాసులు కోరగా సర్పంచ్ లక్ష్మీబాయి రాథోడ్ తక్షణమే స్పందించి ఈ పనులను చేపట్టారు. దీంతో తండా వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 02:15 PM IST

గ్రామాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: సొంటెన్న

KRNL: కూటమి ప్రభుత్వంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని టీడీపీ గ్రామ అధ్యక్షులు బోయ సొంటెన్న, బూత్ ఇన్ ఛార్జ్ దుమ్మల శివ, నాయకులు రామలింగ, నరసయ్య స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దకడబూరు మండలం హెచ్ మురవణి గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనయే లక్ష్యంగా పని చేయాలన్నారు.

February 20, 2026 / 02:15 PM IST