పాకిస్థాన్(pakistan)లోని కరాచీ(karachi)లోని ఉచిత రేషన్ పంపిణీ కేంద్రంలో పిండి కోసం శుక్రవారం తొక్కిసలాట(Stampede) జరిగి 12 మంది మృతి చెందారు. మరికొంత మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని వారు ధృవీకరించారు.
దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని సీఎం కేసీఆర్ (CM KCR) పిలుపునిచ్చారు. 14 మంది ప్రధానులు మారిన దేశ ప్రజల తల రాత మాత్రం మారలేదని అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ) తో పాటు పలువురు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీ (BRS Party ) లో చేరారు. ఈ సందరభంగా వారందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాద...
తెలంగాణ రాష్ట్ర మీడియా ఆకాడమి ఆధ్వర్యంలో భూపాలపల్లి లో రెండు రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ (Media Academy Chairman) అల్లం నారాయణప్రారంభించారు. స్థానిక ఇల్లందు క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(MLA Gandra Venkataramana Reddy), భూపాలపల్లి జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిని పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్న...
Bandi Sanjay : అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన కౌంటర్లు వేశారు. కాగా... ఆ కౌంటర్లకు బీఆర్ఎస్ పార్టీ తాజాగా.. మరో కౌంటర్ ఇచ్చింది. ప్రజలను మోసం చేయడం ఒక ఆర్ట్ అయితే.... అందులో మోదీ పికాసో అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం విశేషం
హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని రకాలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాదు స్టేడియంలోనికి కొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషేధమని ప్రకటించారు.
రాష్ట్రంలో ఎస్ఐ, ఏఏస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్ష (Written Exam) తేదీలు వెలువడ్డాయి. ఏప్రిల్ 8, 9వ తేదీలలో ఈ రాతపరీక్షలను నిర్వహించాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) నిర్ణయించింది. ఈ రెండు పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్థమెటిక్ (Arithmetic),మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ...
Kejriwal : ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివాదం పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పు పై ఆయన స్పందించారు. గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పు మరిన్ని సందేహాలకు తావిచ్చేలా ఉందని ఆయన అన్నారు.
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఆరెస్సెస్(RSS) కార్యకర్త కమల్ బదౌరియా హరిద్వార్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఏప్రిల్ 12న ఈ కుసు విచారణకు రానుంది. ఆర్‌ఎస్‌ఎస్ సభ్యలు 21వ శతాబ్దపు కౌరవులని రాహుల్ గాంధీ హర్యానాలో వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినిమాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, తెలంగాణ యాసలో చిత్రీకరిస్తున్న సిమాలపై మంత్రి కేటీఆర్ ( Minister KTR ) ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ( CM KCR )కు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక రంగంలో పునరుజ్జీవనానికి కారణమైన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని కేటీఆర్ తెలిపారు.
ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంత్ అంబానీ(Anant Ambani), అతనికి కాబోయే భార్య రాధికా మర్చంట్(Radhika Merchant) కలిసి పాల్గొన్నారు. ముకేష్ అంబానీ కుమారుడు బ్లాక్ కలర్ సూట్ ధరించగా, రాధిక అద్భుతమైన నలుపు చీరను ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇది చూసిన పలువురు నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Bandi Sanjay : తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బీజేపీ నేత బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎద్దేవా చేస్తూ బండి సంజయ్ ట్వీట్స్ చేశారు.
జగిత్యాల జిల్లా(Jagityala District) లోని గాంధీనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ (BRS) నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని విషాదం నెలకొంది.. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం(Statue of Telangana Mother) వద్ద బీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్నారు. వారంతా గుండ్రంగా ఉండి నృత్యాలు చేస్తుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజనీ (Bandari Rajni) భర్త బండారి నరేందర్ మధ...
దేశంలోని చాలా ప్రాంతాలలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం వెల్లడించింది. మధ్య, తూర్పు, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో ఈ హీట్‌వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.
ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు (Off day schools) ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Education Minister Botsa) తెలిపారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరుకు తరగతులు జరుగుతాయని ఆయన తెలిపారు. ఎల్లుండి నుంచి పదో తరగతి (10th class) పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి..
ఇటలీ యొక్క డేటా ప్రొటెక్షన్ అథారిటీ నుంచి ChatGPT తమ వినియోగదారుల డేటాను దొంగిలించిందని ఆరోపించింది. అంతేకాకుండా మైనర్‌లు అక్రమ విషయాలకు గురికాకుండా నిరోధించడానికి చాట్‌జిపిటికి వయస్సు నిర్ధారణ వ్యవస్థ లేదని చెప్పింది. దీంతో గోప్యతా సమస్యలపై ChatGPTని నిషేధించిన మొదటి దేశంగా ఇటలీ అవతరించింది.