ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ(koratala siva) దర్శకత్వంలో.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్(jr ntr). అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టలేదు. ఈ సినిమా కోసం కొరటాల.. కథ పై గట్టిగానే కసరత్తులు చేస్తున్నట్టు వినిపిస్తునే ఉంది. ఇక తారక్ తన లుక్ మార్చుకునే పనిలో ఉన్నట్టు టాక్. అయితే ఎట్టకేలకు ఎన్టీఆర్30ని.. నవంబర్ సెకండ్ వీక్‌లో లాంచ్ చేసి.. డిసెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ గురించి ఓ ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. ఆచార్య ఫ్లాప్‌తో కొరటాల-ఎన్టీఆర్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ముందుగా అనుకున్న కథ కాకుండా.. సరికొత్త కథతో మైథలాజికల్(mythology story) టచ్‌తో రాబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కథను గరుడ పురాణంలోని ఓ పాయింట్‌ని లీడ్ తీసుకొని డెవలప్ చేసినట్టు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
గతంలో శంకర్ తెరకెక్కించిన ‘అపరిచితుడు’ మూవీలో గరుడ పురాణంలో ఉన్న కొన్ని ఘోరమైన శిక్షలను చూపించారు. అలాంటి గరుడ పురాణం నుంచి కొరటాల ఎలాంటి పాయింట్‌తో సినిమా చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో నిజమెంతో గానీ.. ఎన్టీఆర్ 30 పై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. అయితే నిజంగానే కొరటాల-ఎన్టీఆర్ ఇలాంటి కథతోనే వస్తున్నారా లేదా అనేది తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.