ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప2(Pushpa 2) టైం స్టార్ట్ అయిపోయింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. దాంతో పుష్ప2 ఫస్ట్ లుక్ రాబోతోందా అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటివరకు పుష్ప2 షూటింగ్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు.. కానీ లేటెస్ట్గా ‘పుష్ప2’కి పనులు ఫుల్ ఫ్లోలో జరుగుతున్నాయని.. ఓ ఫొటోని షేర్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో దర్శకుడు సుకుమార్, ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్, పోస్టర్ డిజైనర్ జాన్ కనిపించారు.
వీరంతా బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. త్వరలో షూటింగ్ మొదలపెట్టబోతున్నారు కాబట్టి.. బన్నీ లుక్ టెస్ట్ జరిగింది. అయితే ఇప్పుడు ఫస్ట్ లుక్ కోసమే ఈ టెస్ట్ కట్ జరిగినట్టు టాక్. దీపావళి కానుకగా పుష్ప-2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్.
గతంలో ‘పుష్ప’ సినిమాకు కూడా ఇలాగే టెస్ట్ షూట్ చేసి, షూటింగ్‌కి ముందే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే ఫార్మాట్ ఫాలో కాబోతున్నాడు సుక్కు. ఇప్పటికే ఈ సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. ఇక ఇప్పుడు ఈ లుక్ అంతకు మించి అనేలా ఉంటుందని తెలుస్తోంది. దాంతో బన్నీ ఫ్యాన్స్ ఆ సమయం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.