జనసేన(janasena party) అధితనే పవన్ కళ్యాణ్(pawan kalyan) రాజకీయంగా తన పార్టీని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటన ప్లాన్ చేసుకున్నారు. కానీ అదే సమయంలో వైసీపీ విశాఖ గర్జన కార్యక్రమం చేయడంతో ఇద్దరి మధ్య వాదనలు మొదలయ్యాయి. తమ కార్యక్రమాన్ని ఆపాలనే యత్నంతోనే పవన్ విశాఖ వచ్చారంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. పవన్ వ్యక్తిగత విషయాలను సైతం రాజకీయం చేస్తూ వైసీపీ నేతలు, మంత్రులు చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో తనపై విమర్శలు చేసేవారికి తాజాగా మరోసారి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
పార్టీ నేతల సమావేశంలో పవన్ మాట్లాడుతూ ..‘ఒరేయ్ వెధవల్లారా..సన్నాసుల్లారా..సన్యాసుల్లారా నా సహనం ఇంత కాలం మిమ్మల్ని రక్షించింది. ప్యాకేజీ స్టార్ అని మరోసారి అంటే చెప్పు తీసుకొని కొడతా’అంటూ వార్నింగ్ ఇచ్చారు. తన కాలి చెప్పు తీసి మరీ ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
‘వైసీపీ(ysrcp party) క్రిమినల్స్.. మీ దగ్గర రౌడీలు – గూండాలు ఉన్నార్రా. ఒంటి చేత్తో వస్తాము. మెడ పిసికి తొక్కేస్తాం. మా ఆడబిడ్డ మీద చేయి వేస్తార్రా. బాపట్లలో పుట్టాను. గొడ్డు కారం తిన్నానురా నేను… నిలబెట్టి తోలు వలుస్తా కొడుకొల్లారా.. పవన్ మంచి తనం చూసారు.. ఇక యుద్దమే. రాడ్లా..హాకీ స్టిక్కులా.. మీరు రండిరా ఎంతమంది వైసీపీ గూండాల్లారా..నేను ఒక్కడినే వస్తాను’..అంటూ పవన్ తన చెప్పు చూపిస్తూ ఫైర్ అయ్యారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని హెచ్చరించారు.
తాను ఎనిమిదేళ్ల కాలంలో ఆరు సినిమాలు చేసానని..వంద నుంచి 120 కోట్ల మేర సంపాదించానని వెల్లగడించారు. పార్టీకి అయిదు కోట్ల ఫండ్ ఇచ్చానని చెప్పారు. ఆదాయపు పన్ను చెల్లించానని వివరించారు. అయోధ్య రామాలయానికి విరాళం ఇచ్చానని చెప్పుకొచ్చారు. తన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని..విడాకులు ఇచ్చి..అయిదు కోట్లు భరణం ఇచ్చి మీరు పెళ్లిళ్లు చేసుకోండిరా అంటూ ఫైర్ అయ్యారు. విడాకులు ఇచ్చి చేసుకున్నారా సన్నాసుల్లారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఒకరిని పెళ్లి చేసుకొని 30 ప్టెపినీలతో తిరిగే మీరా అడిగేది అని నిలదీసారు. నిలబెట్టి తోలు వలుస్తా కొడుకొల్లారా అంటూ పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒరేయ్ నాకు రాజకీయం తెలియదని అనుకుంటున్నార్రా అంటూ..ఇక యుద్దమేనని పవన్ ప్రకటించారు. తనతో కులం పేరుతో ..సోదరుడు పేరుతో మాట్లాడితే చీరేస్తా అంటూ వైసీపీ మంత్రులను హెచ్చరించారు. వెధవ వాగే కాపు ఎమ్మెల్యేలంతా కులాన్ని తగ్గించకండి అంటూ ఫైర్ అయ్యారు.