రెబల్ స్టార్ ప్రభాస్(prabhas) బర్త్ డేకు మరో నాలుగైదు రోజులు మాత్రమే ఉంది. పైగా దీపావళి కూడా ఉండడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు అసలైన పండగ ఇదే కానుంది. ప్రభాస్ కూడా ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి నుంచే అక్టోబర్ 23న డార్లింగ్ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు అభిమానులు. ఇప్పటికే రెబల్ రీ రిలీజ్‌ను ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్.. బిల్లా, వర్షం స్పెషల్ షోలతో మరింత రచ్చ లేపబోతున్నారు.
ఇక వాళ్లకు సర్ప్రైజ్ ఇచ్చేలా ప్రభాస్ సాలిడ్ అప్టేట్స్ ఇవ్వబోతున్నారట. ఒకటి కాడు, రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాల అప్టేట్స్ ఇవ్వబోతున్నాడట. ముందుగా ఆదిపురుష్ నుంచి మరో టీజర్ రిలీజ్ చేయబోతున్నారని వినిపించగా.. ఇప్పుడు ఓ పాటను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ ‘సలార్’ నుంచి గ్లింప్స్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. లేదంటే పవర్ ఫుల్ పోస్టర్ అయినా రిలీజ్ చేయడం పక్కా. అలాగే నాగ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ నుంచి ఓ సర్పైజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా ఈ మూడు సినిమాల నుంచి సాలిడ్ అప్టేట్స్ ఉండడం పక్కా అని వినిపిస్తుండగా.. ఇప్పుడు మారుతి ప్రాజెక్ట్ కూడా లైన్లోకి వచ్చేసింది. గత కొద్ది రోజులుగా ప్రభాస్-మారుతి సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ లుక్ టెస్ట్ కోసం ఫోటో షూట్ కూడా చేసినట్టు టాక్. ప్రభాస్ బర్త్ డే రోజు ఓ పోస్టర్‌తో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నారట. దాని కోసమే ఫోటో షూట్ చేశారట. దాంతో ప్రభాస్ బర్త్ డే రోజు మామూలుగా ఉండదని చెప్పొచ్చు.