ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పార్టీలో కాస్త స్ట్రాంగ్ ఎవరు ఉన్నారు అంటే… ముందుగా… మంత్రి రోజా(minister roja) పేరు కచ్చితంగా వినపడుతుంది. ఆమె మంత్రి అవ్వకముందు కూడా ప్రతిపక్షం పై తన గళం వినిపించేవారు. అందుకే అందరూ ఆమెను ఫైర్ బ్రాండ్ అని పిలిచేవారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆమెకు మంత్రి పదవి కట్టబెడతారు అని అందరూ అనుకున్నారు. కానీ.. కాస్త ఆలస్యంగానే ఆమెకు ఆ పదవి దక్కింది. ఇక అసలు విషయంలోకి వస్తే… ప్రతిపక్ష పార్టీ పక్కన పెడితే.. సొంత పార్టీలోనే ఆమెకు ఎసరు పెట్టేవారు చాలా మంది ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. వారి కారణంగా ఇప్పుడు రోజా నిజంగానే సమస్యల్లో పడ్డట్లు తెలుస్తోంది.
ఆమె సొంత నియోజకవర్గంలో ఆమెకు తెలియకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిండ్రం మండలంలోని కొప్పేడు గ్రామంలో రైతుభరోసా కేంద్రం, వెల్ నెస్ కేంద్రం నిర్మాణానికి భూమిపూజ జరిగింది.
ఈ కార్యక్రమంతోనే రోజా మండిపోయారు. తన నియోజకవర్గంలో తనకు సమాచారం కూడా లేకుండానే స్ధానికనేతలు భూమిపూజ కార్యక్రమాన్ని ఎలా చేస్తారంటు నేతలను నిలదీశారు. తర్వాత తన బాధను, ప్రత్యర్ధివర్గం చేస్తున్న పనులను, పార్టీ బలహీనపడటంతో ప్రత్యర్ధివర్గంకు మద్దతిచ్చేట్లుగా ఆమె మాట్లాడిన ఓ ఆడియో(audio leaks) ఇప్పుడు బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది.
రోజా చేసిన తప్పేమిటంటే తన ఆవేధనను ఆడియోరూపంలో విడుదలచేయటమే. తనను లెక్కచేయని బలమైన ప్రత్యర్ధి నియోజకవర్గం నియోజకవర్గంలో ఉందని రోజా తనంతట తానుగా అంగీకరించినట్లయ్యింది. వాస్తవం చెప్పాలంటే రోజాకు బలమైన ప్రత్యర్ధివర్గం కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం ట్రస్టుబోర్డు ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధరరెడ్డి, ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కేజే శాంతి, ఆమె భర్త కేజే కుమార్ తదితరులతో రోజాకు ఏమాత్రం పడటంలేదు.
ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఒకపుడు వీళ్ళంతా రోజాకు బాగా సన్నిహితులే. ఏదో గొడవల కారణంగా రోజాతో పడక అంతా ఏకమై వ్యతిరేకగ్రూపుగా తయారయ్యారు. వీళ్ళని రోజా ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డితో కూడా డైరెక్టుగా యాక్సెస్ ఉంది. అందుకనే రోజా ఎంత వ్యతిరేకించినా చక్రపాణిరెడ్డి ట్రస్టుబోర్డు ఛైర్మన్ గాను, కేజే శాంతి ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా అపాయింటయ్యారు. రోజా గనుక వీళ్ళతో పంచాయితీని సెట్ చేసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవటం కష్టమనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు.. సమస్య ఉంటే.. రోజా డైరెక్ట్ గా జగన్ తో మాట్లాడి పరిష్కరించుకోవచ్చు కదా అనే సమాధానాలు కూడా గట్టిగానే వినపడుతున్నాయి. మరి రోజా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.