విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళపై లైంగిక దాడి జరిగింది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra).. హాలీవుడ్ ని దున్నేస్తోంది. అక్కడ వరస అవకాశాలు చేజిక్కించుకొని దూసుకుపోతోంది. చాలా మంది భారతీయ నటులకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రియాంకను రోల్ మోడల్ గా తీసుకొని హాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే... అక్కడకు వెళ్లిన మొదట్లో తాను కూడ చాలా కష్టాలు పడినట్లు ప్రియాంక చోప్రా చెప్పడం విశేషం.
నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) ప్రస్తుతం పాన్ ఇండియా బ్యూటీగా దూసుకుపోతోంది. యానిమల్, పుష్ప2తో పాటు నితిన్‌తోను ఓ సినిమా చేస్తోంది. అలాగే రెయిన్‌బో అనే లేడీ ఓరియెంటేడ్ మూవీ కూడా చేస్తోంది. వీటితో పాటు ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ఓ భారీ ప్రాజెక్ట్‌కు రష్మిక ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అందులో మహారాణిగా కనిపించబోతోందట అమ్మడు. ఇప్పటికే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసేసిందట.
దివంగత ఎన్టీఆర్ గురించి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్లు దుమారం రేపాయి. రజనీకి సిగ్గు లేదని ఏపీ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.
సికింద్రాబాద్ (Secunderabad) కళాసిగూడ చిన్నారి మృతి ఘటనపై బల్దియా చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులపై వేటు వేసింది. బేగంపేట్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ హరికృష్ణలను సస్పెండ్ చేస్తూ జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ విపక్ష కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తల్లిని వైద్యుడు వేధించడం కలకలం రేపింది. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. విచారణ చేపట్టగా.. ఆ విచారణతో తాను అలా ప్రవర్తించలేదని వైద్యుడు తెలిపాడు. అయినా కూడా వైద్యుడికి షోకాజ్ నోటీసులు (Show Cause) జారీ చేశారు.
తెలంగాణ వర్సిటీ వీసీ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతుండగా విద్యార్థి సంఘం నేతలు అడ్డుకున్నారు. వీసీ గో బ్యాక్ అని నినాదాలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారుల నిర్లక్ష్యానికి సికింద్రాబాద్‌లోని కళాసిగూడ(Kalasiguda)లో శనివారం తెల్లవారుజామున తెరిచిన మురుగునీటి కాలువ (నాలా)లో పడి పదేళ్ల బాలిక ప్రాణం పోయింది. ఈ ఘటనపై స్పందించిన మేయర్ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. అంతేకాదు..
పంట నష్టపోయి రైతులు సర్వం కోల్పోయారు. ఇంత నష్టం జరిగినా సీఎం కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదు. గతనెల 23న హెలికాప్టర్ లో వచ్చి పరిశీలించి వెళ్లిన సీఎం అప్పుడు ఎకరాకు రూ.10 వేల సహాయం ప్రకటించారు. కానీ నెల దాటినా ఒక్క రూపాయి ఇవ్వలేదు అని షర్మిల విమర్శించారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఉన్న స్టార్ హీరోల్లో అక్కినేని ఫ్యామిలీ(Akkineni family) నుంచి ముగ్గురు హీరోలు ఉన్నారు. ఏఎన్నార్ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరుగా నాగార్జున ఉన్నారు. నాగ్ లెగసినీ కంటిన్యూ చేస్తూ.. నాగచైతన్య, అఖిల్ హీరోలుగా రాణించేందుకు చాలా కాలంగా గట్టిగా ట్రై చేస్తున్నారు. కానీ వర్కౌట్ అవడం లేదు. లేటెస్ట్ ఫిల్మ్ ఏజెంట్ కూడా ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది.
భర్త మరణించిన రోజు నుంచి మధామి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భర్త అంత్యక్రియల సమయంలో అతడిని విడిచి ఉండలేక చితిపై పడుకుంది. అయితే కుటుంబసభ్యులు, బంధువులు ఆమెను ఓదార్చారు. పిల్లలు ఉన్నారు.. వారి గురించి ఆలోచించు అని కుటుంబసభ్యులు బుజ్జగించడంతో ఆమె చితిపై నుంచి కిందకు దిగింది.
అక్కినేని అఖిల్(akhil akkineni) హీరోగా వచ్చిన తాజా సినిమా ఏజెంట్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కోసం అఖిల్ పడిన కష్టం మొత్తం వృథా అయిపోయింది. ఈ సినిమా అనుకున్నంత హిట్ కొట్టకపోవడంతో, అక్కినేని అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మినహా ఇప్పటి వరకు అక్కినేని అఖిల్ నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. దాంతో అందరూ ఈ సినిమాపై భారీ అంచనా...
సుడాన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2400 మందిని సురక్షితంగా భారత్ తీసుకొచ్చామని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
గ్రామాన్ని వదిలేసి పారిపోయారు. అయితే ఆమె తన పిల్లల గురించి పట్టించుకోలేదు. బంధువుల వద్ద ఉన్న పిల్లలను చూసేందుకు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేది. పిల్లల భవిష్యత్ కోసం ఆమెను తిరిగి పెళ్లి చేసుకోవాలని అదే గ్రామానికి చెందిన ఓ కళాశాల ప్రిన్సిపల్ ప్రతిపాదించాడు. చెప్పినట్టుగానే అతడి ప్రియుడితో ఆమెతో వివాహం జరిపించారు.