YS Sharmila:పేపర్ లీకేజ్ ఇష్యూ తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతూనే ఉంది. ఈ ఇష్యూపై విపక్ష నేతలు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. మంత్రి కేటీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు.
దర్శకుడు కొరటాల శివ(Koratala Shiva)తో ఎన్టీఆర్(jr ntr) చేస్తున్న 30వ(ntr30) చిత్రంపై అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రం నుంచి ఓ అప్ డేట్ ఇచ్చారు. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ Ntr30లో చేరినట్లు ప్రకటిస్తూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రకటించారు. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(janhvi kapoor) కథానాయికగా నటిస్తోంది. టాలీవుడ్...
సీనియర్ నేత, టీఆర్‌ఎస్ మాజీ రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్(D Srinivas) మళ్లీ కాంగ్రెస్ పార్టీ(congress party)లో చేరారు. దీంతోపాటు అతని కుమారుడు కుమారుడు డి సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గాంధీభవన్ చేరుకుని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఆధ్వర్యంలో పార్టీ కుండువా స్వీకరించారు.
ఖమ్మంలోని పాలేరు(Paleru) ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి తామంటే తాము పోటీ చేస్తామని అధికార బీఆర్ఎస్(BRS), సీపీఎం(CPM) పార్టీ నేతల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. పాలేరు సీటు సీపీఎం పార్టీకి కేటాయించాలని కేసీఆర్(KCR)ను అడుగుతామని తమ్మినేని ఇటీవల అన్నారు. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(tummala nageswara rao), సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల పార్థసారధి రెడ్డి(kandala pardha sara...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(joe Biden) పొరపాటును చైనా(china)ను ప్రశంసించారు. కెనడా పార్లమెంట్(Canadian parliament)లో ప్రసంగిస్తున్న క్రమంలో ఇది చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రాహుల్ గాంధీ(rahul gandhi)పై లోక్‌సభకు అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ ఆదివారం ఢిల్లీ(delhi)లోని రాజ్‌ఘాట్‌లో ఒక రోజు సంకల్ప్ సత్యాగ్రహాన్ని(Sankalp Satyagraha) ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహంలో పాల్గొన్నార...
హైదరాబాద్ ఎల్‌బీనగర్(LB Nagar)లో నిన్న మంత్రి కేటీఆర్(KTR) సమక్షంలోనే బీఆర్‌ఎస్ నేతల(BRS leaders) మధ్య వాగ్వాదం బయటపడింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు, చంపాపేట మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి మధ్య గొడవ చోటుచేసుకోగా.. ఎమ్మెల్యే అనుచరులు రమణారెడ్డిపై దాడికి ప్రయత్నించారు. ఆ క్రమంలో కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని నియంత్రించారు.
గ్రేటర్ విశాఖపట్నం(Visakhapatnam) మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మార్చి 28, 29 తేదీల్లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆర్కే బీచ్ లో జీ20 సన్నాహక మరథాన్(Marathon) కార్యక్రమం చేపట్టగా.. ఈ కార్యక్రమానికి మంత్రులు గుడివాడ అమర్ నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజనిలు హాజరై ప్రారంభించారు. 40 దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు G20 సమ్మిట్ సందర్భంగా నగరాన్ని సందర్శించవచ్చు.
TSPSC పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్(Bandi Sanjay)కు సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆదివారం హాజరు కావాలని సిట్(SIT) తెలిపింది. కానీ ఈరోజు సిట్ విచారణకు బండి సంజయ్ దూరం కానున్నారు. బండి సంజయ్ తరఫున సిట్ ముందుకు బీజేపీ(BJP) లీగల్ టీమ్ రానుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రవేశపెట్టిన మరో రాకెట్ LVM3-M3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(Satish Dhawan Space Centre) నుంచి దీనిని ప్రయోగించారు. LVM3 43.5 మీటర్ల పొడవు, 643 టన్నుల బరువుతో వన్‌వెబ్(OneWeb) యొక్క చివరి విడత 36 Gen1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది.
తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ ఓ చిరుత(leopard) సంచరిస్తోంది. గాలిగోపురం పరిధిలోని మొదటి ఘాట్ రోడ్ 35వ మలుపు వద్ద చెట్ల పొదల్లో చిరుత(Cheetah) కనిపించినట్లు భక్తులు(Devotees) చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు భయాందోళన చెందుతున్నారు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్(CCL)2023 చాంపియన్ షిప్ ను తెలుగు వారియర్స్(Telugu Warriors) నాలుగో సారి గెల్చుకుని రికార్డు సృష్టించింది. నిన్న విశాఖలో జరిగిన ఫైనల్ మ్యాచులో భోజ్‌పురి దబాంగ్స్(Bojpuri Dabanggs)పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మీకు అనుకూలంగా ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? నక్షత్రాలు, గ్రహాలు ఈ రోజును ఎలా ప్రభావితం చేస్తాయి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే.. హిట్ టీవీ వెబ్ సైట్ లో ఉన్న ఈరోజు రాశిఫలాన్ని చదవండి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పరువు నష్టం కేసు సవాల్ చేస్తూ కేరళకు (Kerala) చెందిన ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలు చేశారు. ఆభా మురళీధరన్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్‌కి సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ (Lok Sabha)సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణ (Telangana) మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి (Srikantachari)పేరును ఎల్‌బీనగర్ చౌరస్తా కు నామకరణం చేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. ఇవాళ ప్రారంభించుకున్న ఫ్లై ఓవర్‌కు మాల్ మైసమ్మ( Mall Mysamma ) అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఎల్‌బీ నగర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లై ఓవర్...