Aamir Khan: నేపాల్ వెళ్లిన అమీర్ ఖాన్.. 10 రోజులు అక్కడే!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ గురించి తెలిసిందే. అతని నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు.. ఇండియా లెవల్లో అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. ప్రస్తుతం ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్స్ లిస్ట్‌లో అమీర్ ఖాన్ సినిమానే టాప్ ప్లేస్‌లో ఉంది. 2000 వేల కోట్లకు పైగా వసూళ్లతో దంగల్ సినిమా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అలాంటి ఈ హీరో సడెన్‌గా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. దానికి కారణం ఇటీవల వచ్చిన సినిమానే. అయితే ప్రస్తుతం అమీర్ ఖాన్ నేపాల్ వెళ్లారు. అక్కడే ఓ పది రోజులు ఉండనున్నారు.
చివరగా లాల్ సింగ్ చడ్డా అనే సినిమా(Lalsingh Chadda)తో ఆడియెన్స్ ముందుకొచ్చాడు అమీర్ ఖాన్(Aamir Khan). ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga chaitanya) కీ రోల్ ప్లే చేశాడు. హాలీవుడ్(Hollywood) మూవీ ఫారెస్ట్ గంప్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా బోల్తా కొట్టేసింది. ఈ సినిమా దెబ్బకు కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చేశాడు అమీర్ ఖాన్. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్నాడు. అయితే మొన్ననే పది రోజుల పాటు జరగనున్న విపస్సనా ధ్యాన కార్యక్రమం కోసం నేపాల్ వెళ్లాడు. ఆదివారం రోజు ఉదయం విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఖాట్మండు చేరుకున్నారు అమీర్.
ఖాట్మండుకు 12 కిలోమీటర్ల దూరంలో బుధానీలకంఠలో ఉన్న విపస్సనా ధ్యాన కేంద్రంలో జరిగే కార్యక్రమంలో అమీర్(Aamir Khan) పాల్గొంటున్నాడు. ఇది ఖాట్మండులోని ప్రముఖ ధ్యాన కేంద్రాలలో ప్రసిద్ధి చెందింది. అమీర్ చివరిసారిగా 2014లో ఖాట్మండులో జరిగిన యునిసెఫ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేపాల్‌కు వెళ్లారు. ఇక ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు వెళ్లాడు. ఇదిలా ఉంటే.. అమీర్ ఖాన్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు? అనే క్లారిటీ రావడం లేదు.
కానీ బాలీవుడ్(Bollywood) వర్గాల ప్రకారం.. గజిన సినిమాకు సీక్వెల్ ప్లానింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోది. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి ఈ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తమిళ్లో సూర్య నటించిన గజిని సినిమాను హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు మురుగదాస్. అందుకే ఇప్పుడు గజిని 2 ప్లాన్ చేస్తున్నట్టు టాక్. త్వరలోనే ఈ సినిమా పై క్లారిటీ రానుంది.