Music Director Koti: సంగీత దర్శకుడు కోటికి జీవిత సాఫల్య పురస్కారం
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంగీత దర్శకుడికి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం దక్కనుంది. ఆ సంగీత దర్శకుడు మరెవరో కాదు..ఆయనే కోటి.
మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన కోటి(Music Director Koti), ఎందరో అభిమాన హీరోలకు అద్భుతం సంగీతం అందించారు. అలనాటి మధుర గీతాలను అందించిన సాలూరి కోటేశ్వర రావు అబ్బాయే కోటి. ఆస్ట్రేలియా పార్లమెంటులోని ఇండియన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో కోటీ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోనున్నాడు.
అంతేకాకుండా ఆస్ట్రేలియా వేదికపై సింగర్ సుస్మిత రాజేష్ (Singer Susmita Rajesh)తో పాట పాడించనున్నారు. హరుడే వరుడై, హర హర శంభో తర్వాత మరో వినూత్న పాటను ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని AISECS అడ్వైజర్ రాజేష్ ఉప్పల మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేస్తాయన్నారు. 4 వేల పాటల మైలురాయిని దాటిన కోటి(Music Director Koti)కి ఆస్ట్రేలియాలోని పార్లమెంట్ లో గెస్ట్ ఆఫ్ హానర్గా పిలవడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగు చలన చిత్రం తరపున, సంగీత ప్రియులు తరపున సంగీత దర్శకుడు కోటికి శుభాకాంక్షలు తెలిపారు.