YCP Leader Murder At Rajahmundry: రాజమండ్రిలో దారుణ హత్య జరిగింది. మాజీ కార్పొరేటర్, వైసీపీ నేత బూరడ భవానీ శంకర్ దారుణ హత్యకు గురయ్యాడు. అజయ్ కుమార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఒంటి, పొట్ట, ఛాతీపై తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలియగానే వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో రక్తపు మడుగులో భవానీ శంకర్ ఉన్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. హత్య చేసిన అజయ్ కుమార్ పరారీలో ఉన్నాడు. రాజమండ్రి 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.