New Couple : మీకు కొత్తగా పెళ్లైందా.. ఈ సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి
పెళ్లిళ్లు స్వర్గం(Heaven)లో నిశ్చయం అవుతాయంటారు. ఎవరికి ఎక్కడ రాసిపెట్టి ఉంటుందో చెప్పడం కష్టం. మన దేశంలో చాలా పెళ్లిళ్లను పెద్దలు కుదుర్చుతారు. పరిచయం ఉన్న వారిని పెళ్లి(Marriage) చేసుకున్నా పెళ్లి తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి.
New Couple : పెళ్లిళ్లు స్వర్గం(Heaven)లో నిశ్చయం అవుతాయంటారు. ఎవరికి ఎక్కడ రాసిపెట్టి ఉంటుందో చెప్పడం కష్టం. మన దేశంలో చాలా పెళ్లిళ్లను పెద్దలు కుదుర్చుతారు. పరిచయం ఉన్న వారిని పెళ్లి(Marriage) చేసుకున్నా పెళ్లి తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇద్దరూ ఒకటిగా కలిసి జీవించేటప్పుడు.. మాత్రం అడ్జెస్ట్(Adjest) చేసుకోవడంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. పెళ్లి అనగానే ఎవరికైనా చాలా ఊహలు ఉంటాయి.
పెళ్లి అనగానే ఓ వైపు ఆనందం మరో వైపు భయం ప్రతి ఒక్కరికీ సర్వ సాధారణం. అప్పటి వరకు పరిచయం లేని వ్యక్తి(Unknown person)తో కలిసి జీవించాల్సి వస్తుంది. వాళ్లు ఎలా ఉంటారు..? తమను ఎలా చూసుకుంటారు అని అమ్మాయిలు(Girls) భయపడితే… తమ జీవితంలోకి వచ్చే అమ్మాయి.. తమను అర్థం చేసుకుంటుందా లేదా అని అబ్బాయిలు భయపడుతూ ఉంటారు. పెళ్లైన కొత్తలో దంపతుల్లో కొన్ని కామన్ సమస్యలు వస్తుంటాయి. పెళ్లి చేసుకోబోవు వారు వాటి గురించి తప్పక తెల్సుకోవాలి.
కేవలం పెద్దలు కుదర్చిన పెళ్లిలో మాత్రమే కాదు… లవ్ మ్యారేజ్(Love Marriage) చేసుకున్న వారిలోనూ సమస్యలు రావడం సహజం. ఇద్దరి అలవాట్లు ఒకేలా ఉండకపోవచ్చు. ఒకరికి మరొకరు అలవాటు పడేందుకు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. దాదాపు అన్ని జంటల్లో తలెత్తే ప్రధాన సమస్య డబ్బు(Money). ఎవరికో తప్ప.. చాలా మంది డబ్బు విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్య పెళ్లైన మొదటి సంవత్సరంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డబ్బులు ఖర్చు చేయడంలో, పొదుపు చేయంలో ఇద్దరి అభిప్రాయాలు కుదిరే వరకు కాస్త సమస్యగానే ఉంటుంది. ఇక ఇంట్లో వంట సామాన్లు(cooking utensils), ఇతర వస్తువులు ఎక్కడ ఏమి ఉన్నాయి.. అనే విషయం అలవాటు కావడానికి కూడా కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు ఇబ్బందిగానే ఉంటుంది.
అమ్మాయిలకైతే పెళ్లితో జీవితంలోకి ఒక వ్యక్తి రావడం కాదు.. ఒక కుటుంబం రావడం. కాబట్టి.. ఆమె తన పార్టనర్(Partner) తోనే కాదు.. తన అత్తమామలతోనూ కలిసిపోవాలి. వారికి మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఎంత వరకు బౌండరీ గీయాలి అనే విషయంలోనూ కాస్త ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది. ఇక పెళ్లికి ముందు శృంగారం విషయంలో చాలా అభిప్రాయాలు, ఆశలు ఉండి ఉంటాయి. వాటిని మీ భాగస్వామి చేరుకోలేకపోయినప్పుడు.. నిరాశకు గురికావడం సహజం. లేదా ఇతర సమస్యలు ఏవైనా శృంగారపరంగా ఎదురవ్వచ్చు. ప్రతి ఒక్కరూ ఒకేలా మాట్లాడరు, ఒకేలా స్పందించకపోవచ్చు. కాబట్టి… కమ్యూనికేషన్ విషయంలో దంపతుల మధ్య అవరోధాలు ఏర్పడతాయి. ఒకరినొకరు ఈ విషయంలో అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది.