Minister Karumuri Nageshwar Rao:ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageshwar Rao) మరో రైతుపై (farmer) ఫైరయ్యారు. ఇటీవల ఓ రైతును ఎర్రి పప్పు అని పిలిచిన సంగతి తెలిసిందే. ఆ ఇన్సిడెంట్‌పై తీవ్ర దుమారం చెలరేగింది. ఆ ఘటన మరవకముందే మరో రైతుపై మండిపడ్డారు.
ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయింది. తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు మంత్రి కారుమూని నాగేశ్వరరావు (Karumuri Nageshwar Rao) ఏలూరు (eluru) జిల్లాలో పర్యటించారు. ఓ రైతు సమస్య చెప్పుకుంటుండగా.. మంత్రి (minister) ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఏయ్ నోరు మూసుకో అని కసురుకున్నారు. ఏం కావాలి నీకు.. అని గద్దించారు.
రైతు (farmer) సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఘటనను వీడియో తీస్తోన్న మీడియా ప్రతినిధులపై మండిపడ్డారు. రికార్డింగ్ ఆపాలని కోరారు. రిపోర్టర్లను కోరుతున్న వాయిస్‌తో కూడిన వీడియో ట్రోల్ అవుతుంది. సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ కామెంట్లు చేస్తున్నారు.
మంత్రి (minister) తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఓ రైతును ఎర్రి పప్ప అని పిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తప్పుగా అనలేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరో రైతుపై (farmer) తన ప్రతాపాన్ని చూపించారు. మంత్రి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.